వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

''బిజెపికి వ్యతిరేకంగా బాబు చక్రం: టిడిపి ప్లానేంటీ, మిత్రధర్మం ఇదేనా?''

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఒంగోలు: కేంద్ర బడ్జెట్‌పై టిడిపి నేతలు చేస్తున్న విమర్శలపై బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.బిజెపికి వ్యతిరేకంగా కేంద్రంలో చంద్రబాబునాయుడు చక్రం తిప్పారు, మళ్ళీ అవే రోజులు రానున్నాయనే వ్యాఖ్యలను ఏ కోణంలో చూడాలని వీర్రాజు ప్రశ్నించారు.

'బిజెపికి గుడ్‌బై చెప్పండి, కలిసే పోరాటం' 'బాబుపై కేసులతోనే రాష్ట్రానికి నష్టం''బిజెపికి గుడ్‌బై చెప్పండి, కలిసే పోరాటం' 'బాబుపై కేసులతోనే రాష్ట్రానికి నష్టం'

కొన్ని రోజులుగా ఏపీ రాష్ట్రంలో బిజెపి, టిడిపి నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది. టిడిపి నేతలు బిజెపిపై విమర్శలు చేయకూడదని టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు పార్టీ నేతలను హెచ్చరించారు. కానీ, దావోస్ పర్యటన నుండి వచ్చిన తర్వాత చంద్రబాబునాయుడు బిజెపిపై తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేశారు.

డిఎల్‌కు లైన్ క్లియర్: టిటిడి ఛైర్మెన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్డిఎల్‌కు లైన్ క్లియర్: టిటిడి ఛైర్మెన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్

తమతో పొత్తు వద్దనుకొటే దండం పెట్టి వెళ్ళిపోతామని చంద్రబాబునాయుడు చెప్పారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు సక్రమంగా లేకపోవడంపై కూడ టిడిపి నేతలు తీవ్రంగా రగిలిపోతున్నారు. బిజెపిపై విరుచుకుపడుతున్నారు. బిజెపితో పొత్తుపై కీలకమైన నిర్ణయాన్ని టిడిపి నేతలు తీసుకొనే అవకాశాలు తీసుకొనే అవకాశం ఉంది. ఈ తరుణంలో బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి టిడిపిపై ఫిబ్రవరి 3వ, తేదిన నిప్పులు చెరిగారు.

ఆ వ్యాఖ్యల మర్మమేమిటీ

ఆ వ్యాఖ్యల మర్మమేమిటీ

చంద్రబాబునాయుడును తక్కువగా అంచనా వేయకూడదు. గతంలో బిజెపికి వ్యతిరేకంగా చంద్రబాబునాయుడు కేంద్రంలో చక్రం తిప్పారు. మళ్ళీ అదే కాలం రానుందని కొందరు టిడిపి నేతలు చేసిన విమర్శలను సోము వీర్రాజు తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యల వెనుక మర్మమేమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్ పై టిడిపి నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని వీర్రాజు అభిప్రాయపడ్డారు. ఒంగోలు, నెల్లూరులలో ఆయన వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు.

రాయపాటిపై మండిపడిన వీర్రాజు

రాయపాటిపై మండిపడిన వీర్రాజు

నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావుతో పాటు రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ పై వీర్రాజు మండిపడ్డారు.‘కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన నాయకులు ఎవరైనా విమర్శలు చేస్తే కాంగ్రెస్‌ కోవర్టులనడం రాయపాటి సాంబశివరావుకు పరిపాటిగా మారింది. కానీ ఆయన ఎక్కడి నుంచి ఊడిపడ్డాడని వీర్రాజు ప్రశ్నించారు.
టీడీపీకి పట్టినగతే బీజేపీకి పడుతుందని టీజీ వెంకటేశ్‌ అంటున్నాడని, ఆయన కాంగ్రెస్‌లో మంత్రిగా చేసి రాష్ట్రంలో ఎలా గెలిచారో అందరికీ తెలుసున్నారు.

పోలవరంపై చంద్రబాబు అప్పుడేమీ చేశారు

పోలవరంపై చంద్రబాబు అప్పుడేమీ చేశారు

పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబునాయుడు ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి సీఎంగా ఉన్న కాలంలో ఏం చేశారని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రశ్నించారు.ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా డా. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 2005లో పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని, అంతకుముందు 1995 నుంచి 2004 వరకు సీఎంగా ఉన్న చంద్రబాబు ఎందుకు ఆ పని చేయలేదని సోము వీర్రాజు ప్రశ్నించారు.పోలవరానికి కేంద్రం ఇప్పటికే రూ.4,300 కోట్ల నిధులిచ్చినా ఇవ్వలేదని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు.

మిత్రధర్మం ఇదేనా

మిత్రధర్మం ఇదేనా

తమతో మిత్రులుగా ఉంటూనే విమర్శలు గుప్పిస్తున్నారని టిడిపి నేతలపై బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు. మిత్ర ధర్మాన్ని పాటించడం అంటే తమను విమర్శించడమేనాని అని సోము వీర్రాజు ప్రశ్నించారు.రైల్వేజోన్‌పై గతంలో వేసిన ఒక కమిటీ అనుకూల నివేదిక ఇవ్వలేదన్నారు. దీంతో సాంకేతిక సమస్య ఏర్పడడంతో బడ్జెట్‌లో పేర్కొనలేని పరిస్థితి నెలకొందని వీర్రాజు చెప్పారు.

English summary
Bjp MLC Somu Veerraju made allegations on Tdp leaders on Saturday.what is the reason behind TDP leaders comments against BJP he asked.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X