వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓట్ల చేర్పు,తీసివేత‌ల‌కు కొల‌మానం ఉందా..?కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ఈసీ కి హైకోర్ట్ ఆదేశం..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : డేటా దొంగ‌త‌నం పై రగుల‌తున్న వివాదం పై హైకోర్ట్ స్పందించింది. ఐటీ గ్రిడ్ సేవ‌లు, సాంకేతిక ప‌రిజ్ఞానం, ఫామ్ 7, ఇత‌ర రాష్ట్రాల ప్ర‌మేయం అనే అంశాల ప‌ట్ల లోతుగా వివారాలు కావాల‌ని, అందుకు స‌మ‌గ్ర స‌మాచారంతో కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని కేంద్ర ఎన్నికల సంఘానికి కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా ఓటర్ల జాబితా తయారీకి అనుసరిస్తున్న విధానంతోపాటు ఓట్ల తొలగింపు, చేర్పులకు అనుసరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం ఏంట‌ని, దాని వల్ల లాభనష్టాలు ఏంటో తదితర వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు ఈసీ ని ఆదేశించింది. ఓట్ల తొలగింపు విషయంలో రిటర్నింగ్‌ అధికారికి ఉన్న అధికారాలు ఏమిటో కూడా చెప్పాలంది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది.

 సాఫ్ట్‌వేర్‌ ఏమిటో వెల్లడించాలి...! సాంకేతిక పరిజ్ఞానం ఏమిటన్న కోర్ట్..!!

సాఫ్ట్‌వేర్‌ ఏమిటో వెల్లడించాలి...! సాంకేతిక పరిజ్ఞానం ఏమిటన్న కోర్ట్..!!

ఓటర్ల జాబితా తయారు సమయంలో చట్టం గుర్తించని సాఫ్ట్‌వేర్, కంప్యూటర్‌ ప్రోగ్రాం ద్వారా ఓట్లను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని, అసలు జాబితాలో మార్పులు, చేర్పులకు అనుసరిస్తున్న విధానాన్ని, అందుకు ఉపయోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌ వివరాలను వెల్లడించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని హైదరాబాద్‌ మియాపూర్‌కి చెందిన ఇంజనీర్‌ కొడాలి శ్రీనివాస్‌ హైకోర్టులో గత ఏడాది ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేసారు. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం దానిని మరోసారి విచారించింది.

సమాచారమంతా బయటకు ఎలా వ‌స్తోంది..! వివర‌ణ ఇవ్వాల‌న్న న్యాయ స్థానం..!!

సమాచారమంతా బయటకు ఎలా వ‌స్తోంది..! వివర‌ణ ఇవ్వాల‌న్న న్యాయ స్థానం..!!

పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ స్టేట్‌ రెసిడెంట్‌ డేటా హబ్‌ (ఎన్‌ఆర్‌డీహెచ్‌)కు అందచేస్తున్న ఓటర్లకు సంబంధించిన వ్యక్తిగత సమాచారమంతా, ఆధార్‌ కార్డు వివరాలతో సహా బయటకు పొక్కుతున్నాయని చెప్పారు. ఓటరు కులం ఏమిటి..? ఓటరు ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అనే వివరాలను తెలుసుకోవడం సులభవుతుందని, దీని వల్ల ఇష్టమొచ్చిన రీతిలో ఇతరుల ఓట్లను తొలగించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇటీవల కాలంలో ఎన్నికల సంఘం తీరుపై విమర్శలు వెలువెత్తుతున్నాయన్నారు. ఎన్నికల సంఘం ప్రతి దశలోనూ పారదర్శకంగా, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

నిఘా విభాగం వైఫ‌ల్యం..! అందుకే ఏపి డీజీపి మార్పు..!!నిఘా విభాగం వైఫ‌ల్యం..! అందుకే ఏపి డీజీపి మార్పు..!!

ఓట్ల తొలగింపు, చేర్పు విధానం ఏమిటి? రిట‌ర్నింగ్ అదికారుల విధులు ఏంట‌న్న కోర్ట్..!!

ఓట్ల తొలగింపు, చేర్పు విధానం ఏమిటి? రిట‌ర్నింగ్ అదికారుల విధులు ఏంట‌న్న కోర్ట్..!!

ఎన్నికల సంఘం తన సాఫ్ట్‌వేర్‌ ద్వారా తెలంగాణలో 27 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లో 17 లక్షల ఓటర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించిందని వివరించారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో ఓ వ్యక్తి వివరాలు తెలుసుకోవడం పెద్ద కష్టం కాదని వ్యాఖ్యానించింది. గూగుల్‌లో బోలెడంత సమాచారం దొరుకుతుందని తెలిపింది. అయితే, ఓటరు గోప్యత హక్కు, ఓటర్ల జాబితా స్వచ్ఛత రెండు వేర్వేరు అంశాలని, వీటిని అలాగే చూడాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఆ తరువాత ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌ వాదనలు వినిపిస్తూ, పిటిషనర్‌ చెబుతున్నదాంట్లో వాస్తవం లేదన్నారు. తాము ఉపయోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌ డూప్లికేట్‌ ఓటర్లను గుర్తిస్తుందే తప్ప, దానంతట అది ఓటర్లను జాబితా నుంచి తొలగించదన్నారు.

 ఫామ్7 విధానాలు ఏంటి..? దాని ప‌రిమితులు ఏంటో వివ‌రించాలన్న న్యామ‌స్థానం..!!

ఫామ్7 విధానాలు ఏంటి..? దాని ప‌రిమితులు ఏంటో వివ‌రించాలన్న న్యామ‌స్థానం..!!

అంతే కాకుండా ఎవరైనా పేరును ఓటరు జాబితా నుంచి తొలగిస్తే, ఆ వ్యక్తికి ముందు నోటీసు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. తిరిగి ఓటరుగా చేరేందుకు దరఖాస్తు చేసుకునే వెలుసుబాటు కూడా ఉందని వివరించారు. ఎన్‌ఆర్‌డీహెచ్‌ ఉన్న డేటాను ఏ రాజకీయ పార్టీ అడిగినా ఇస్తామన్నారు. ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపు విషయంలో రిటర్నింగ్‌ అధికారికి విస్తృతాధికారాలు ఉన్నాయని ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎన్నికల సంఘం సైతం ఈ విస్తృతాధికారాల్లో ఏ రకంగానూ జోక్యం చేసుకోజాలవన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, ఓటర్ల జాబితాలో తొలగింపులు, చేర్పులకు అనుసరిస్తున్న విధానం ఏమిటి? అలాగే ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు? దాని వల్ల ఉన్న లాభనష్టాలు ఏమిటి? తదితర వివరాలను కౌంటర్‌ రూపంలో తమ ముందుంచాలని అవినాశ్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది.

English summary
The High Court has directed the EC to follow the details of the voter list, including the removal of the votes and the technologies following the adaptation, and so on and so forth. In the case of removal of votes, the Returning Officer has the powers to say. The next hearing was postponed to March 11 to file counter on full details.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X