వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీధి బడుల్లో చదువుకున్నాం... మీకంటే ఎక్కువే మాట్లాడగలం... రైతు దీక్షలో పవన్ కళ్యాన్

|
Google Oneindia TeluguNews

జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఒకరోజు దీక్ష ముగిసింది.. కాకినాడ కేంద్రంగా రైతులకు మద్దతుగా రైతు సౌభాగ్య దీక్ష పేరుతో ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. అయితే... జనసేన పార్టీ ఏర్పాటు చేసిన తరువాత అనేక అంశాల మీద పోరాటాలు చేసిన పవన్ కళ్యాన్ దీక్షకు దిగటం మాత్రం ఇదే తొలిసారి. ఉదయం నుండి సాయంత్రం వరకు దీక్ష చేసిన జగన్ అనంతరం జరిగిన సభలో జగన్ ప్రభుత్వ వైఫల్యాల పైన తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ విధానాలను ఆయన విమర్శించారు.

రైతుల వద్ద కులాల ప్రస్తావన ఎందుకు..?

రైతుల వద్ద కులాల ప్రస్తావన ఎందుకు..?

దీక్ష విరమణ అనంతరం ముందుగా రైతుల సమస్యలను పవన్ కళ్యాన్ ప్రస్తావించారు. ధాన్యం రైతులకు ప్రతిక్వింటాలుకు 1500 రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మాట్లాడితే... మానవత్వం అంటున్న సీఎం జగన్ కౌలు రైతుల విషయంలో కులాల ప్రస్తావన ఎందుకు తీసుకువస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఓట్లు అడిగినప్పుడు ఫలాన కులాలకు ఇవ్వమని చెప్పారా... అని ప్రశ్నించారు... అయితే అన్యాయం జరుగుతున్న రైతులు సింహాల్లా వ్యవహరించాలని ... లేదంటే అమాయకులను ఆదివారం మటన్ వలే నంజుకుని తింటారని అన్నారు.

150 ఎమ్మెల్యేల మెజారీటి ఉండి ప్రయోజనం ఏంటీ...

150 ఎమ్మెల్యేల మెజారీటి ఉండి ప్రయోజనం ఏంటీ...

ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ జరుగుతున్న తీరుపై ఆయన ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో కూడ ప్రభుత్వం హుందాగా వ్యవహరించడం లేదని ఆయన విమర్శించారు. అసెంబ్లీలో కూర్చోని నేతలను తిట్టడడం తప్ప ఏం సాధించింది లేదని దుయ్యబట్టారు. కనీసం బోటు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేసే విజ్ఝత కూడ 150 మంది ఎమ్మెల్యేలకు లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే అటు రైతులతో పాటు కనీస ప్రజల అవసరాలు, సమస్యలను తీర్చలేని 150 ఎమ్మెల్యేలు సభలో కూర్చుని ఏం లాభమని ఆయన ప్రశ్నించారు. తిట్టడం మానేసీ సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు.

వీధి బడుల్లో చదువుకున్నాం.. మీకంటే ఎక్కువే మాట్లాడగలం

వీధి బడుల్లో చదువుకున్నాం.. మీకంటే ఎక్కువే మాట్లాడగలం

ఇక అసెంబ్లీతో పాటు బయట వైసీపీ నేతలు మాట్లాడుతున్న భాష తీరును తీవ్రంగా తప్పుబట్టారు.. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారని... కాని మేము వీధి బడుల్లో చదువుకున్నాం... మీకంటే అధ్వాన్నమైన భాషలో మాట్లడగలం... నేను కూడ అలాంటీ భాషను మాట్లాడతాను, అయితే.. అన్ని రకాల ప్రయత్నాలు అయిపోయిన తర్వాత ఒకరోజు వస్తుందని, ఆ రోజు వచ్చినప్పుడు భయపడి వెనక్కి తగ్గే అవకాశమే లేదని అన్నారు. అప్పుడు మాత్రం ఖచ్చితంగా మాటకు మాట బదులు తీర్చుకుటామని హెచ్చరించారు. మాకంటూ ఓ రోజు వచ్చినప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల అంతూ చూస్తామని హెచ్చరించారు. అంతవరకు జనసేన కార్యకర్తలు ఓపిగ్గా ఉండాలని సూచించారు.

అవమానాలన్ని ప్రజల కోసమే...

అవమానాలన్ని ప్రజల కోసమే...

తాను ప్రజల కోసం పోరాటాలు చేస్తుంటే... ప్రభుత్వం విమర్శలు చేస్తుందని, అయితే....ప్రభుత్వం ఎన్ని విమర్శలు... అవమానాలు పరిచినా, తమ లక్ష్యం కోసం పోరాడతామని అన్నారు. ఇందుకోసం ఎలాంటీ అవమానాలకైనా... సిద్దంగా ఉన్నానని అన్నారు. ఓటమి వల్ల తన ఆత్మస్థైర్యం ఏమీ దెబ్బతినలేదని మరోసారి గుర్తు చేశారు. తాను సినిమాలతో పాటు అన్ని వదులుకోనే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. దీక్షల వల్ల సినిమాల్లో అయితే...కేవలం చప్పట్లు పడతాయని, కాని నిజ జీవీతంలో మాత్రం ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. దీంతో తాను రాజకీయాల్లోకి రావడం చాల సంతోషంగా ఉందని అన్నారు.

English summary
Janasena chief Pawan Kalyan over oneday protest at kakinada.Speaking in public after that Pawan Kalyan criticized the government policies
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X