• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టీడీపీ డెడ్‌ ఎండ్: మీరు నిజంగానే ఏడ్చారా?: జగన్, కేటీఆర్‌‌తో లోకేష్‌‌ పోటీ: చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి

|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుకు అనూహ్య ప్రశ్నలను ఎదుర్కొన్నారు. సీనియర్ జర్నలిస్ట్ సంధించిన ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరికి గురయ్యారు. వాటికి సమాధానాలను ఇవ్వడంలో ఆయన తడబడాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీ భవిష్యత్, రాజకీయ వారసులు, రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిణామాలు, సమకాలీన పరిస్థితులపై తనకు ఎదురైన ప్రశ్నలకు ధీటుగా సమాధానాలను ఇవ్వలేకపోయారు.

 సూటిగా.. వాడివేడి ప్రశ్నలతో..

సూటిగా.. వాడివేడి ప్రశ్నలతో..

ఓ జాతీయ దినపత్రికకు చెందిన పొలిటికల్ సీనియర్ జర్నలిస్ట్ కుమ్‌కుమ్ ఛద్దా ఈ ఇంటర్వ్యూను నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ రూపంలో సాగిందీ ఇంటర్వ్యూ. దీన్ని ఆ జాతీయ దినపత్రిక తన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది. కుమ్‌కుమ్ ఛద్దా ముక్కుసూటిగా తన ప్రశ్నలను సంధించారు. ఎక్కడా దాపరికాలకు పోలేదు. తాను అడగదలచుకున్న ప్రశ్నలను ఎలాంటి డొంక తిరుగుళ్లు లేకుండా అడిగేశారు. ఓ దశలో ఆమె మీరు నిజంగా ఏడ్చారా?.. అని చంద్రబాబును ఛద్దా నేరుగా ప్రశ్నించేంత తీవ్రతతో సాగిందీ ఇంటర్వ్యూ.

డెడ్ ఎండ్‌కు వచ్చిందా?

డెడ్ ఎండ్‌కు వచ్చిందా?

రాష్ట్రంలో ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల గురించి కుమ్‌కుమ్ ఛద్దా తన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. దీన్ని బట్టి చూస్తే- తెలుగుదేశం పార్టీ డెడ్ ఎండ్‌కు చేరుకున్నట్టే కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల నుంచి టీడీపీ ఎలా గట్టెక్కుతుంది? ప్రత్యామ్నాయ మార్గాలేంటీ? అన్ని దారులు మూసుకుపోయినట్టేనా?, పార్టీ డెడ్ ఎండ్‌కు చేరుకుందా? అని అడిగారు. 2019 తరువాత ఎదుర్కొన్న ప్రతి ఎన్నికలోనూ టీడీపీ ప్రజల ఆదరణను చూరగొనడంలో విఫలమైందనే విషయాన్ని ఆమె ప్రస్తావించారు.

 మమత ప్రస్తావన..

మమత ప్రస్తావన..


తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ రాజకీయ ప్రస్థానాన్ని ఛద్దా ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైటర్స్ బిల్డింగ్ (పశ్చిమ బెంగాల్ సచివాలయం)లో అడుగు పెట్టడానికి మమత బెనర్జీ 18 సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘంగా ఎదురు చూడాల్సి వచ్చిందని అన్నారు. మరోసారి అధికారంలోకి రావడానికి ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాల్సి వస్తోందని భావిస్తున్నారంటూ చంద్రబాబును ప్రశ్నించారు.

జగన్, కేటీఆర్‌తో లోకేష్ సరితూగగలరా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుల కుమారులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్.. విజయవంతంమైన రాజకీయ నాయకులగా తమను తాము నిరూపించుకోగలిగారని అన్నారు. వారితో పోల్చుకుంటే మరో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్ సరితూగగలరా అని అడిగారు. వైఎస్ జగన్, కేటీఆర్‌లను నారా లోకేష్ ఎదుర్కొనగలరా అని ప్రశ్నించారు.

మీరు నిజంగానే ఏడ్చారా..

మీరు నిజంగానే ఏడ్చారా..

చంద్రబాబు ఓ సమర్థుడైన నాయకుడని, అలాంటి వ్యక్తి ప్రజల నుంచి సానుభూతిని పొందడానికి ప్రయత్నించారని ఛద్దా అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. మీడియా సమక్షంలో ఎందుకు ఎడవాల్సి వచ్చిందని సూటిగా ప్రశ్నించారు. దీనికి చంద్రబాబు బదులిస్తూ- తానూ మనిషినేనని, తన భార్యను అసెంబ్లీలో అవమానించారని అన్నారు. అది తనకు బాధను కలిగిందని, దాన్ని అణచివేసుకోలేకపోయానని చెప్పారు. మీరు నిజంగానే ఏడ్చారా..? అంటూ ఛద్దా ప్రశ్నించడంతో అవునని అన్నారు.

అధికారం మాదే..

అధికారం మాదే..


చంద్రబాబు వంటి బలమైన నాయకుడు ఏడవడం వల్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఛద్దా చెప్పారు. 2024లో అధికారంలోకి వస్తామనే నమ్మకం ఉందా? అని ఆమె ప్రశ్నించగా.. ఖచ్చితంగా జరగబోయేది అదేనని చంద్రబాబు తేల్చి చెప్పారు. 2024 లేదా అంతకంటే ముందే తాము అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ వంటి రాజకీయాలను తాము చేయలేమని, ప్రజాస్వామ్యంగా పోరాడతామని ఓ ప్రశ్నకు చంద్రబాబు బదులిచ్చారు.

English summary
This was the question posed by senior political journalist Kumkum Chadha of Hindustan Times, in a virtual interview with TDP chief and former AP CM Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X