వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ వివేకా హత్య కేసు సీబీఐ విచారణ ఏమైంది, ప్రధానికి లేఖ రాయండి జగన్‌: వర్ల రామయ్య

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాకు సంబంధించిన చిన్న కేసులకు ప్రాధాన్యం ఇస్తారని.. బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును మాత్రం పట్టించుకోవడం లేదని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. చిల్లర మల్లర కేసులను పట్టించుకొని.. ప్రయారిటీ కేసులను గాలికొదిలేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ వివేకాను సీబీఐ విచారణకు ఆదేశించిన దర్యాప్తులో ఎందుకు పురోగతి లేదు అని ప్రశ్నించారు. వివేకా హత్య కేసును సీబీఐ విచారించాలని హైకోర్టు ఆదేశించి.. 100 రోజులవుతున్న చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. దీనిపై హోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయాలని డిమాండ్ చేశారు.

వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత సీబీఐ దర్యాప్తు చేయించాలని కోరింది మీరు కాదా అని వర్ల రామయ్య ప్రశ్నించారు. శవం పక్కన కూర్చొని సీబీఐ విచారణ కోరి.. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని అడిగారు. అప్పటి గవర్నర్‌ను కూడా కలిసి సీబీఐ విచారణ కోరలేదా అని అడిగారు. హైకోర్టులో పిటిషన్ కూడా వేసి.. సీఎం అయ్యాక ఆ విషయమే మరచిపోయారని ఆరోపించారు.

what is ys viveka murder case cbi inquiry status: varla ramaiah

Recommended Video

Vet Doctor Murder Case Solved, Four People Arrested

సీబీఐ విచారణ కోసం వేసిన పిటిషన్ ఎందుకు విత్ డ్రా చేసుకున్నారని వర్ల రామయ్య అడిగారు. వివేకా కూతురు పిటిషన్ మేరకు హైకోర్టు సీబీఐ విచారణ జరపాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటివరకు సీబీఐ దర్యాప్తు చేపట్టలేదు అని, ఎందుకు ఒక ప్రకటన చేయలేద్నారు. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణపై హైకోర్టు పురోగతి కోరాలన్నారు.

English summary
what is ys viveka murder case cbi inquiry status varla ramaiah ask to andhra pradesh government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X