వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓవైపు భక్తి.. మరోవైపు రక్తి..? 30 ఇయర్స్‌ పృథ్వీపై వేలాడుతున్న కత్తి..

|
Google Oneindia TeluguNews

అమరావతి రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న ఎస్వీబీసీ చైర్మన్,వైసీపీ నేత పృథ్వీ మరో వివాదంలో ఇరుక్కోవడం దుమారం రేపుతోంది. ఆధ్యాత్మిక పదవిలో ఉన్న ఆయన ఆ ముసుగులో ఎస్వీబీసీ మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తున్నాడని అక్కడి సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఓ ఆడియో టేపు కూడా లీక్ కావడం కలకలం రేపుతోంది. కామాంధుడైన పృథ్వీ ఎస్వీబీసీ పదవికి అనర్హుడని.. వెంటనే ఆయన్ను పదవి నుంచి తప్పించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పృథ్వీ భవితవ్యంపై
ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చర్చనీయాంశంగా మారింది.

ఆడియో టేపు లీక్ :

ఆడియో టేపు లీక్ :

ఎస్వీబీసీలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగితో పృథ్వీ మాట్లాడిన ఆడియో టేపు బయటకు లీక్ అయింది. 'పడుకునేటప్పుడు నేను గుర్తు రాలేదా..?' అంటూ మొదలుపెట్టిన పృథ్వీ.. ఆమెతో అసభ్యకరంగా మాట్లాడాడు. అయితే ఆ టేపుల్లో అవతలి మహిళ కూడా పృథ్వీకి అనుకూలంగానే మాట్లాడినట్టు స్పష్టమవుతోంది. దీనిపై ఎస్వీబీసీ సిబ్బందిని ప్రశ్నించగా.. పృథ్వీ అసలు స్వరూపాన్ని బయటపెట్టేందుకే

ఆమె అలా మాట్లాడిందని వారు చెబుతున్నారు.

 మహిళా ఉద్యోగుల ఆరోపణలు :

మహిళా ఉద్యోగుల ఆరోపణలు :

ఎస్వీబీసీ యూనియన్‌కు బాధిత మహిళ ఫిర్యాదు చేసిందని,దీనిపై కార్మిక శాఖకు కూడా ఫిర్యాదు చేశామని సిబ్బంది తెలిపారు. పేరు బయటపెట్టడం సమంజసం కాదని.. ఆమె వివరాలు ఎక్కడా చెప్పడం లేదన్నారు. ఎస్వీబీసీలో చాలామంది మహిళలు అతని వల్ల వేధింపులకు గురవుతున్నారని ఆరోపించారు. ఏదో ఆర్థిక పరిస్థితులు బాగా లేక.. కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేందుకు ఉద్యోగాలు చేస్తుంటే.. పృథ్వీ లాంటివాళ్లు తమను వేధించడం దారుణమని అక్కడి మహిళా ఉద్యోగులు వాపోతున్నారు. పృథ్వీని ఆ పదవి నుంచి తప్పించి.. అతని రాసలీలలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

 పృథ్వీని శిక్షించాలని డిమాండ్ :

పృథ్వీని శిక్షించాలని డిమాండ్ :

పృథ్వీని అసలేం చూసి ఎస్వీబీసీ చైర్మన్‌ పదవిలో నియమించారని మహిళా ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. గతంలో భార్యలను వేధించిన కేసులు కూడా అతనిపై ఉన్నాయని, అలాంటి వ్యక్తిని ఆధ్యాత్మిక పదవిలో ఎలా కూర్చోబెట్టారని నిలదీస్తున్నారు. ఓవైపు భక్తి కార్యక్రమాల్లో పాల్గొంటూ మరోవైపు ఇలా మహిళలను వేధిస్తున్న పృథ్వీని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

 పృథ్వీ భవిష్యత్‌పై జగన్ ఏం డిసైడ్ చేయబోతున్నారు.. :

పృథ్వీ భవిష్యత్‌పై జగన్ ఏం డిసైడ్ చేయబోతున్నారు.. :

అమరావతి రైతులపై విమర్శలు చేసి ఇప్పటికే వివాదంలో ఇరుక్కున్న పృథ్వీకి తాజా వివాదం మరిన్ని కష్టాల్ని తెచ్చిపెట్టింది. ఎస్వీబీసీ సిబ్బంది ఆయనపై చేస్తున్న ఆరోపణలను సీఎం జగన్ ఎలా పరిగణిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. పృథ్వీపై వస్తున్న ఆరోపణలపై సీఎం విచారణ జరిపిస్తారా..? లేక చూసీ చూడనట్టే వదిలేస్తారా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికైతే పృథ్వీ వైపు నుంచి కూడా ఈ ఆడియో టేపులపై ఎలాంటి స్పందనా రాలేదు.

English summary
what jagan will decide about prudhvi raj over sexual harassment allegations against him
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X