వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ పార్టీ విషయంలో ముద్రగడ ఏం చేశారో తెలుసా .. లేఖలో జగన్ కు ఏం చెప్పారంటే

|
Google Oneindia TeluguNews

ఏపీలో రాజకీయాలు ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా రసవత్తరంగానే మారుతున్నాయి. ఎన్నికలకు ముందు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఎవరికి మద్దతు ఇస్తే ఆ పార్టీ విజయం సాధించే అవకాశం ఉంటుందని భావించారు . ఎందుకంటే కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంకు ఏపీలో అధికారాన్ని శాసించే స్థాయిలో ఉందని అందరూ భావించారు. అయితే ఎన్నికల సమయంలో తర్జన భర్జన చేసి ఎటూ తేల్చని ముద్రగడ పద్మనాభం ఎన్నికలు ముగిసిన తర్వాత తాజాగా రాసిన లేఖ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

ఆ ఐఏఎస్ ల పనితీరుపై జగన్ తీవ్ర అసంతృప్తి ..20 మంది ఐఏఎస్ లలో టెన్షన్ఆ ఐఏఎస్ ల పనితీరుపై జగన్ తీవ్ర అసంతృప్తి ..20 మంది ఐఏఎస్ లలో టెన్షన్

సీఎం జగన్ కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ .. పవన్ పార్టీపై కీలక వ్యాఖ్యలు

సీఎం జగన్ కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ .. పవన్ పార్టీపై కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఈ లేఖలో పవన్ పార్టీ గురించి ఆయన కీలక వ్యాఖ్య చేశారు . 2019 ఎన్నికల్లో కాపు కులానికి చెందిన పార్టీని కూడా కాదని తమ కులమంతా వైసీపీకే ఓటు వేశారని గుర్తుచేశారు. పరోక్షంగా పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీని ఆయన ప్రస్తావించారు. కాపు జాతికి మీ ప్రభుత్వం న్యాయం చేయగలదని నమ్ముతున్నామని ముద్రగడ పేర్కొన్నారు . కాపు కులానికి న్యాయం చేయాలని ముద్రగడ పద్మనాభం ఆ లేఖలో జగన్మోహన్ రెడ్డిని కోరారు. మాజీ సీఎం చంద్రబాబు అసంపూర్ణంగా వదిలేసిన కాపు రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.

Recommended Video

జనసేన ఆధ్వర్యంలో వంగవీటి రంగా జయంతి వేడుకలు
ఏపీలోని కాపులు వైసీపీకే ఓటు వేశారు.. కాపు రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చెయ్యాలని జగన్ ను కోరిన ముద్రగడ

ఏపీలోని కాపులు వైసీపీకే ఓటు వేశారు.. కాపు రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చెయ్యాలని జగన్ ను కోరిన ముద్రగడ

ఇక ఏపీలోని కాపులు వైసీపీకే ఓటు వేశారనే విషయం గుర్తించి కాపులకు న్యాయం చేయాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. చంద్రబాబు పూర్తి చేయకుండా వదిలేసిన కాపులకు 5 శాతం రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని సిఎం కు విజ్ఞప్తి చేశారు. ఉన్నత వర్గాల్లోని పేదలకు కేంద్రం ప్రభుత్వం కల్పించిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం రిజర్వేషన్లు కాపులకు అమలయ్యేలా చూడాలని తన లేఖలో సిఎం జగన్‌ ను ముద్రగడ పద్మనాభం కోరారు. తాను లేఖలో రాసిన విషయాలు యదార్థమని నమ్మితేనే కాపు జాతికి ఉపకారం చేయాలని ఆయన అన్నారు.

జనసేనకు కాకుండా వైసీపీకి ఓట్లేశారని లేఖలో పేర్కొన్న ముద్రగడ ..

జనసేనకు కాకుండా వైసీపీకి ఓట్లేశారని లేఖలో పేర్కొన్న ముద్రగడ ..

ఏది ఏమైనా ముద్రగడ కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని కాదని మరీ కాపులు జగన్ కు పట్టం కట్టారని చెప్పటంపై ఇప్పుడు ఏపీలో చర్చ జరుగుతుంది. పవన్ పార్టీ ఓటమికి ఒక రకంగా ముద్రగడ కారణం అయ్యారని ఒప్పుకున్నారని తాజాగా ఆయన రాసిన బహిరంగ లేఖ వల్ల అర్ధం అవుతుంది. మరి ఈ లేఖ విషయంలో జనసైన్యం ఏ విధంగా స్పందిస్తుంది. ముద్రగడ కాపుల రిజర్వేషన్ కోసం రాసిన ఈ లేఖపై సీఎం జగన్ ఎలా స్పందిస్తారో మరి వేచి చూడాలి .

English summary
Kapu Movement leader Mudragada Padmanabham has written a letter toAndhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy. He made a key comment about the Pawan Party in this letter. Recall that the Ycp voted throughout the caste that it was not even a party of the Kapu caste in the 2019 elections. He referred to the Janasena Party, which is indirectly led by Pawan Kalyan. Mudragada stated that we believe your government can do justice to the Kapu caste.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X