వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'శ్రీరెడ్డికి ఏం చెప్పారు? పబ్లిసిటీ కోసమే పవన్ మర్డర్ ప్లాన్ వ్యాఖ్యలు, అవతల పడేస్తారు'

|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సామాజిక తీవ్రవాదిలా మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య ఆదివారం మండిపడ్డారు. తన హత్యకు కుట్ర జరుగుతోందని చెప్పిన పవన్, పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయడం లేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ పబ్లిసిటీ కోసమే హత్యకు ప్లాన్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారని ఆరోపించారు.

<strong>దాడి చేస్తే.. నా సంగతి తెలియదు: పవన్ ఎదురుదాడి, లగడపాటి సర్వేకు కౌంటర్</strong>దాడి చేస్తే.. నా సంగతి తెలియదు: పవన్ ఎదురుదాడి, లగడపాటి సర్వేకు కౌంటర్

సినిమా నటులు అందరూ ముఖ్యమంత్రులు కాలేరని ఎద్దేవా చేశారు. పవన్ నోటీకు వచ్చినట్లు మాట్లాడవద్దని, సభ్య సమాజం అంగీకరించదని చెప్పారు. నేను హీరోను కదా, నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతానంటే కుదరదన్నారు. సినిమాల్లో అలా మాట్లాడటం కుదురుతుందేమోనని, రాజకీయాల్లో అది కుదరదని తేల్చి చెప్పారు.

నిజ జీవితంలో అవతల పడేస్తారు

నిజ జీవితంలో అవతల పడేస్తారు

సినిమాలలో నువ్వు ఎడమ చేత్తో కొడితే పదిమంది పడిపోతారేమోనని వర్ల రామయ్య.. పవన్‌ను ఉద్దేశించి విమర్శించారు. కానీ నిజ జీవితంలో అలా కుదరదని, విరిచి అవతల పడేస్తారని హెచ్చరించారు. అది కూడా గుర్తించి మాట్లాడటం నేర్చుకోవాలని హితవు పలికారు. నోటీకి వచ్చినట్లు మాట్లాడటం మంచిది కాదన్నారు.

శ్రీరెడ్డికి ఏం సలహా ఇచ్చావ్?

శ్రీరెడ్డికి ఏం సలహా ఇచ్చావ్?

గతంలో శ్రీరెడ్డి అనే అమ్మాయి కాస్టింగ్ కౌచ్ గురించి నానా గలాటా చేసి, తెలుగు సినీ రంగాన్ని ఒక ఊపు ఊపితే అప్పుడు పవన్ కళ్యాణ్ ఆ అమ్మాయికి ఏం సలహా ఇచ్చారో గుర్తు చేసుకోవాలని ఎద్దేవా చేశారు. అమ్మా... మనకు ఏదైనా అన్యాయం జరిగితే పోలీస్ శాఖ ఉన్నదని, పోలీస్ కంప్లయింట్ ఇవ్వాలని జనసేనాని సలహా ఇవ్వలేదా అని గుర్తు చేశారు. ఆ అమ్మాయికి మీరు ఆ సలహా ఇవ్వలేదా చెప్పాలన్నారు.

పవన్ నువ్వేం చెప్పావ్?

పవన్ నువ్వేం చెప్పావ్?

ఈ రోజు మాత్రం ముగ్గురు మిమ్మల్ని (పవన్ కళ్యాణ్) హత్య చేసేందుకు ప్లాన్ వేస్తున్నారని చెప్పారని వర్ల గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. పత్రికలో వచ్చిన వార్తను చదువుతూ.. 'పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ సంచలన వ్యాఖ్యలు.. పవన్ అంటే మీరే, నన్ను హత్య చేయాలనుకుంటున్నారు, నా హత్యకు ప్లాన్ చేశారు, ఎన్నికల్లోపే నన్ను చంపేస్తే అడ్డు తొలగుతుందని అనుకుంటున్నారు, ఆ ముగ్గురు ఎవరో నాకు తెలుసు, వాళ్లు ఏ పార్టీ వాళ్లో తెలుసు' అని పవన్ అన్నారని పేపర్ కట్టింగ్ చదివారు.

బాధ్యత గల పౌరుడిగా ఏం చేయాలి

బాధ్యత గల పౌరుడిగా ఏం చేయాలి

మిమ్మల్ని చంపేందుకు ఎవరో ప్లాన్ చేస్తున్నప్పుడు, బాధ్యత కలిగిన భారత పౌరుడిగా మీరు ఏం చేయాలని పవన్‌ను వర్ల ప్రశ్నించారు. మీరు వెంటనే పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత లేదా అని నిలదీశారు. మీరు అలా ఎందుకు చేయలేదని అడిగారు.

English summary
Telugudesam party leader Varla Ramaiah on sunday questioned Jana sena chief Pawan Kalyan what was he suggested to Sri Reddy and what he is doing now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X