వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ మాజీ కేంద్ర మంత్రి అల‌క‌కు కార‌ణం ఏంటి..? అందుకే విదేశాల‌కు వెళ్లారా..??

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీ విచిత్ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటోంది. నాయ‌కుల‌ను త‌యారుచేసే కర్మాగారంగా పేరుప‌డ్డ తెలుగుదేశంపార్ట‌కి ఒక్కోసారి ఆ నాయ‌కుల‌నుండే ప్ర‌తికూల ప‌రిస్ధితులు ఎదురౌతుంటాయి. పార్టీలో అనేక ప‌ద‌వులు అనుభ‌వించి ఢిల్లీ స్థాయి రాజకీయాల్లో చ‌క్రం తిప్పే రేంజ్ కు వెళ్లినా.. పార్టీపై మాత్రం విమ‌ర్శ‌లు చేస్తూనే ఉంటారు కొంద‌రు నేత‌లు. పార్టీ నేత చంద్ర‌బాబు ఆదేశాలను పాటించిన‌ట్టు క‌నిపించినా ప‌క్క‌కు వ‌చ్చి విమ‌ర్శ‌లు చేస్తుంటారు. ఇంత‌కీ చంద్ర‌బాబుని, తెలుగుదేశం పార్టీ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించిన ఆ నాయ‌కుడు ఎవ‌రు..? పార్టీ లైన్ కి క‌ట్టుబ‌డి ఉన్న‌ప్ప‌టికి లోలోప‌ల మాత్రం ర‌గిలిపోతున్న ఆ నేత ఎవ‌రు..? ఎందుకు పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా విదేశాల్లో ఉంటున్నారు..? తెలుసుకునే ప్ర‌య‌త్రం చేద్దాం..!!

విభ‌జ‌న హామీల‌ప‌ట్ల చిత్తశుద్దిని నిరూపించుకున్న బాబు..

విభ‌జ‌న హామీల‌ప‌ట్ల చిత్తశుద్దిని నిరూపించుకున్న బాబు..


ఆంద్ర ప్ర‌దేశ్ లో మిత్ర‌పక్షంగా కొన్నాళ్లు సావాసం చేసిన తెలుగుదేశం పార్టీ, భార‌తీయ జ‌న‌తా పార్టీలు కొన్ని అనివ‌ర్య‌కార‌ణాల‌వ‌ల్ల విడిపోయిన సంగ‌తి తెలిసిందే..! విడిపోవ‌డ‌మే కాకుండా ఇక్క‌డ ప్ర‌భుత్వంలో భాగ‌స్వామ్యంగా ఉన్న బీజేపి నాయ‌కుల‌కు ఉద్వాస‌న ప‌ల‌క‌డం, అక్క‌డ కేంద్రంలో ప‌ద‌వులు అనుభ‌విస్తున్న టీడిపి నాయ‌కులు రాజీనామా చేసి ఎన్డీఏ ప్ర‌భుత్వానికి రాం రాం చెప్ప‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయింది. విభ‌జ‌న హామీల అంశంలో ప్ర‌తిప‌క్ష పార్టీ దూకుడుకు ధీటుగా స‌మాధానం చెప్పే క్ర‌మంలో చంద్ర‌బాబు నాయుడు కేంద్రంతో స‌మ‌రానికి సై అన‌క త‌ప్ప‌ని ప‌రిస్థితులు త‌లెత్తాయి. విభ‌జ‌న హామీలు సాదించుకునే క్ర‌మంలో ఎలాంటి స్వ‌ప్ర‌యోజ‌నాలు ఆశించ‌కుండా ప‌నిచేస్తామ‌ని నిరూపించేంద‌కు ఇలాంటి స‌హసోపేత నిర్ణ‌యం తీసుకున్న‌ట్టుకూడా బాబు తెలిపారు.

తెలుగు ప్ర‌జ‌ల మ‌నోభావాలు ఆ ఎంపీకి అర్థం కాలేదా..?

తెలుగు ప్ర‌జ‌ల మ‌నోభావాలు ఆ ఎంపీకి అర్థం కాలేదా..?

ప్ర‌తిప‌క్ష పార్టీ మాత్రం బీజెపి ప్ర‌భుత్వంతో స్వార్థ రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతోంద‌ని, వైసీపి ఎంపీల రాజీనామాల ఆమోదింపే అందుకు నిద‌ర్శ‌న‌మ‌ని టీడిసి అభివ‌ర్ణిస్తోంది. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కోసం, విభ‌జ‌న హామీల అమ‌లుకోసం కేంద్రంతో ఎంత‌టి పోరాటానికైనా వెన‌కాడేది లేద‌నే సాంకేతాల‌ను టీడిపి ఇస్తోంది. ఇదే క్ర‌మంలో ప్ర‌ధాని మోదీ రాష్ట్రం ప‌ట్ల అనుస‌రిస్తున్న విధానాల‌ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌జ‌ల‌కు వివ‌రించేందుకు రెఢీ అయ్యారు. న‌వ‌నిర్మాణ‌ దీక్ష‌ల పేరుతో 13జిల్లాల్లో నిర‌శ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి ప్ర‌జ‌ల‌కు వాస్త‌వాలు చెప్పేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చించారు. విభ‌జ‌న హామీలు, ప్ర‌త్యేక హోదా, బ‌డ్జెట్ లో రాష్ట్రనికి చేసిన కేటాయింపులు ఇలా అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని కేంద్రం ఎంత చుల‌క‌నాగా చూస్తోందో ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని నిర్ణ‌యించారు. ఒక రకంగా ఎన్నిక‌లప్పుడు బీజెపి ఇచ్చిన హామీలు, అదికారంలోకి వ‌చ్చాక మాట త‌ప్పిన విధానాల‌ను ప్ర‌జ‌ల‌ముందుంచేందుకు టీడిపి ఆధారాల‌తో సిద్ద‌ప‌డింది.

ప్ర‌తిప‌క్షానికి ధీటైన స‌మాధానం చెప్పేందుకే రాజీనామాల అస్త్రం...

ప్ర‌తిప‌క్షానికి ధీటైన స‌మాధానం చెప్పేందుకే రాజీనామాల అస్త్రం...

అంతే కాకుండా ఆంద్ర‌ప్ర‌దేశ్ అభివ్రుద్దికి స‌హ‌క‌రించ‌కుండా విల‌న్ పాత్ర పోషిస్తున్న విధానాల‌ను కూడా ఎష్టాబ్లిష్ చేస్తోంది టీడిపి. అదీ కాకుండా మోదీ రాష్ట్రానికి అభివ్రుద్ది నిరోద‌క శ‌క్తిలా అవ‌త‌రించాడ‌ని టీడిపి అభివ‌ర్ణించే ప్ర‌య‌త్నం చేస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వంలో మంత్రి ప‌ద‌వుల్లో ఉన్న టీడిపి ఎంపీలు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామ‌లు చేసిన‌ప్పుడు ఆంద్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి ప్ర‌జ‌ల‌నుండి మంచి సానుభూతి ల‌భించింది. చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యాన్ని ప్ర‌జ‌లు పెద్ద యెత్తున స్వాగ‌తించారు. మోదీని రాష్ట్రంలో జీరోగా అభివ‌ర్ణించిన చంద్ర‌బాబు తెలుగు ప్ర‌జ‌ల ద్రుష్టిలో హీరోగా అవ‌త‌రించారు. ఇంత అనుకూల ప‌రిణామాలు కేంద్ర‌మంత్రుల రాజీనామాల‌తో చోటు చేసుకుంటే స‌ద‌రు ఎంపీ గారు మాత్రం త‌న ప‌ద‌విని ఒదులుకోవ‌డానికి మాత్రం స‌సేమిరా ఒప్పుకోలేదు. త‌ర్వాత ప‌రిస్థితుల ఒత్తిడిని బ‌ట్టి రాజీనామా చేయాల్సి వ‌చ్చింది.

 రాజ‌కీయాల‌ను కూడా వ్యాపారాత్మ‌కంగా చూస్తే ఎలా అని ప్ర‌శ్నిస్తున్న నేత‌లు..

రాజ‌కీయాల‌ను కూడా వ్యాపారాత్మ‌కంగా చూస్తే ఎలా అని ప్ర‌శ్నిస్తున్న నేత‌లు..

రాజీనామా చేసిన త‌ర్వాత కూడా త‌న స‌హ‌చ‌ర ఎంపీల వ‌ద్ద రాజీనామాల ద్వారా ఏం సాధించామ‌ని ప్ర‌శ్నించిన‌ట్టు స‌మాచారం. వ్రుత్తి ప‌రంగా ప్ర‌ముఖ‌ వ్యాపార‌వేత్త ఐన సుజ‌నా చౌద‌రి రాజీయాల‌ను కూడా వ్యాపారాత్మ‌క దోర‌ణిలోనే చూస్తున్నార‌నే విమ‌ర్శ‌లు కూడా వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం ఏ మాత్రం ఇష్టం లేని సుజానాకు దాని వల్ల క‌లిగే ప్ర‌యోజ‌నం ఎలా అర్థం అవుతుంద‌ని పార్టీలో చ‌ర్చ జరుగుతోంది. రాజీనామాల అంశం స‌హ‌చ‌ర నాయ‌కుల ద‌గ్గ‌ర ప్ర‌స్థావించిన‌ప్పుడు అంద‌రూ శ‌భాష్..! ఉత్త‌మ‌మైన ప‌నిచేసారు..!! అని చెప్తుండ‌డంతో క‌ర్ణ‌క‌ఠోరంగా భావించిన సుజ‌నా చౌద‌రి విదేశాల‌కు వెళ్లిపోయిన‌ట్టు తెలుస్తోంది. ఏదైనా తాను మెచ్చింది రంభ అన‌క‌పోతే ఎవ‌రికైనా చిరాకే క‌దా మ‌రి..!!!

English summary
tdp mp sujana chowdary opposing their resignations. he denying to come out from the central government. he questions his colleagues that what we achieved due to the resignations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X