వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధానిని జగన్ కలిస్తే తప్పేంటి?: అచ్చెన్నాయుడిపై మండిపడ్డ విష్ణుకుమార్ రాజు

ప్రధాని నరేంద్ర మోదీడీని వైఎస్ జగన్ కలిసిన విషయమై ఆరోపణలు గుప్పిస్తున్న టీడీపీ నేత అచ్చెన్నాయుడిపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ప్రధాని నరేంద్ర మోదీడీని వైఎస్ జగన్ కలిసిన విషయమై ఆరోపణలు గుప్పిస్తున్న టీడీపీ నేత అచ్చెన్నాయుడిపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు.

విజయవాడలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని మోడీ, వైఎస్ జగన్ కేసుల గురించి మాట్లాడుకోవడం మంత్రి అచ్చెన్నాయుడు చూశారా? అని ప్రశ్నించారు. మోడీపైన, జగన్ పైన అనవసర ఆరోపణలతో టీడీపీ నాయకులు తమ స్థాయిని తగ్గించుకోవద్దని హితవు పలికారు.

vishnukumar-achennayudu

జగన్ కేసుల గురించి మాట్లాడుకున్నామని అచ్చెన్నాయుడుకి మోడీ ఏమైనా చెప్పారా? అని ఆయన మండిపడ్డారు. రాష్ట్రపతి ఎన్నికల్లో షరతులు లేకుండా మద్దతు తెలపడంలో తప్పేంటని, అసలు ప్రధానిని జగన్ కలిస్తే తప్పేంటని టీడీపీ నాయకులను విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు.

English summary
What's wrong if YS Jagan meet PM Narendra Modi? questioned MLA Vishnukumar Raju here on Thursday at Vijayawada. He fired on Minister Achennayudu and asked that whether Achennayudu saw saw YS Jagan talking about court cases with Narendra Modi? Raju also questioned what's wrong if YSRCP would offer support to any candidate that the BJP fields in the coming presidential election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X