నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హలో..హలో.. సోమిరెడ్డి గారూ..! వినిపిస్తోందా..? నెల్లూరులో మన దారెటు సార్..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : సోమిరెడ్డి చంద్రమోహ‌న్ రెడ్డి ఈ పేరు ఆంధ్రా రాజకీయాలలో సుపరిచితమే..ఈయ‌న ఐదు సార్లు ప్రజాక్షేత్రంలో ఓట‌మి పాలయ్యారు...నాలుగు సార్లు వరుసగా ఎన్నికలో ఓడిన, చంద్రబాబు మంత్రివర్గంలో కీల‌క‌ వ్యవ‌సాయ శాఖ‌ మంత్రి పదవి చేపట్టారు...తాజాగా జరిగిన ఎన్నికలలో కుడా ఓటమి పాలయ్యారు. దీనితో ఆయన రాజకీయ జీవితం సంక్షోభంలో పడినట్లే అని రాజకీయ విశ్లేషకులు చెప్తుండగా.. మరీ ఇపుడు ఇయన దారెటు అనే సందేహాలు ఆంధ్రా రాజకీయాలలో రేకేత్తుతున్నాయి.

నెల్లూరు రాజకీయాలను శాసించిన సోమిరెడ్డి..! ప్రస్తుత రాజకీయం అంధకారం..!!

నెల్లూరు రాజకీయాలను శాసించిన సోమిరెడ్డి..! ప్రస్తుత రాజకీయం అంధకారం..!!

టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత ఆత్మీయుడిగా గుర్తింపు పొందిన సోమిరెడ్డి నెల్లూరు జిల్లాలో టీడీపీకి చెందిన నాయకులలో అత్యంత సీనియర్ నాయ‌కుడిగా మరియు కీల‌క నాయ‌కుడిగా పేరు తెచుకున్నారు. వివాద ర‌హితుడిగా అంద‌రినీ క‌లుపుకొని పోయే నేత‌గా కూడా గుర్తింపు పొందారు. త‌న‌దైన శైలిలో విమర్శలు చేస్తూ.. ప్రత్యర్థుల‌ను ఇరుకున పెట్టిన చ‌రిత్రను కూడా సొంతం చేసుకున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీకి అన్ని విధాలా అండ‌దండ‌లు అందించిన నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్నారుబాబు ఏ కార్యక్రమాన్ని అప్పగించినా వివాదాల‌కు తావు లేకుండా నిర్వహించి విజ‌యం సాధించిన నాయ‌కుడిగా సోమిరెడ్డికి మంచి పేరుంది.

 టీడిపిలో కీలక నేత..! గత ఎన్నికల్లో ఘోర పరాజయం..!!

టీడిపిలో కీలక నేత..! గత ఎన్నికల్లో ఘోర పరాజయం..!!

ఈ క్రమంలోనే 2014 ఎన్నిక‌ల్లో సోమిరెడ్డి ఓట‌మి పాలైన‌ప్పటికీ.. చంద్రబాబు ఎమ్మెల్సీ సీటును ఇచ్చి గౌర‌వించారు. అంతేకాదు, త‌ర్వాత 2017 జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్తర‌ణ‌లో చంద్రబాబు సోమిరెడ్డికి కేబినెట్ సీటు ఇచ్చి మ‌రింత గౌర‌వించారు. ఎలాంటి వివాదాల‌కు తావు లేకుండా రాజ‌కీయంగా ఎలాంటి విమ‌ర్శలు ఎదుర్కొన‌కుండానే ఈ శాఖ‌ను నిర్వహించారు సోమిరెడ్డి. ఇక‌, ఇప్పుడు తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఐదోసారి పోటీ చేసి కూడా ఓడిపోవ‌డంతో ఇప్పుడు సోమిరెడ్డి భవిష్యత్తు ఏంట‌నే విష‌యంపై టీడీపీలోనే కాకుండా నెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో కూడా చ‌ర్చ ప్రారంభ‌మైంది.

 జగన్ ప్రభంజనం..! తట్టుకోలేక పోయిన టీడిపి..!!

జగన్ ప్రభంజనం..! తట్టుకోలేక పోయిన టీడిపి..!!

సోమిరెడ్డి వాస్తవానికి ఈ ఎన్నిక‌ల్లో త‌న‌కుమారుడు రాజ్‌గోపాల్‌రెడ్డిని బ‌రిలో నిల‌పాల‌నుకున్నా పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉండ‌డం, ప్ర‌త్య‌ర్తి బ‌లంగా ఉండ‌డంతో చంద్ర‌బాబు సూచ‌న‌ల మేర‌కు సోమిరెడ్డి నేరుగా ఐదోసారి స‌ర్వేప‌ల్లి నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. అయినా ఈ సారి కుడా ఓటమి తప్పలేదు వైసీపీ సీనియ‌ర్ నేత కాకాణి గోవ‌ర్థ‌న్‌రెడ్డి చేతిలో వ‌రుస‌గా రెండోసారి గ‌ట్టి పోటీ ఇచ్చి ఓడిపోయారు.ఆయన ప్రజలలో పొందిన సానుభూతిని కూడా వైసీపీ హ‌వా ముందు నిల‌వ‌లేకపోయింది. జిల్లాలో త‌న రాజ‌కీయ ప్రత్యర్థులు అంద‌రూ ఇప్పుడు వైసీపీ నుంచి ఎంపీ, ఎమ్మెల్యేలుగా ఉన్నారు.

రాజకీయ భవితపై నీలినీడలు..! సహకరించని సోమిరెడ్డి ఆరోగ్యం..!!

రాజకీయ భవితపై నీలినీడలు..! సహకరించని సోమిరెడ్డి ఆరోగ్యం..!!

దీంతో సోమిరెడ్డి రాజ‌కీయ చ‌ద‌రంగంలో పూర్తిగా వెన‌క‌ప‌డిపోయిన‌ట్లయ్యింది. ఇక ఇటు టీడీపీ జిల్లాలో ఎద‌గ‌క‌పోవ‌డానికి సోమిరెడ్డి కార‌ణం అన్న విమ‌ర్శలు కూడా ఉన్నాయి. ఇక‌ ఎన్నిక‌ల‌కుముందు ఆయ‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం ఆయనని రాజకీయాల నుండి మరింత దూరం చేసింది. ఓ వైపు త‌న కుమారుడిని రంగంలోకి దింపి తాను తెర‌వెనుక చ‌క్రం తిప్పుతార‌నే ప్రచారం జ‌రుగుతోంది.ఈ ఎన్నికలలో టీడీపీ ఓడిపోవటం,ఎమ్మెల్సీ ప‌ద‌వికి సోమిరెడ్డి రాజీనామా చేయ‌డం..ఇవన్ని చూస్తుంటే సోమిరెడ్డి రాజ‌కీయంగా తదుపరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది పెద్ద ప్రశ్నగా పరిణమించింది.

English summary
Somireddy Chandramohan Reddy also lost in the recent elections. As political analysts say that his political life is in crisis, the doubts that he is too much is reiterating in Andhra politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X