• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వాట్సప్ సందేశాలు - విధ్వంసానికి ముహూర్తాలు : అమలాపురంలో ఏం జరిగింది..!!

|
Google Oneindia TeluguNews

అమలాపురంలో చోటు చేసుకున్న విధ్వంసం వెనుక అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ విధ్వంసానికి కారకులు ఎవరనే దాని పైన పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఇందులో అనేక ఆసక్త కర అంశాలను గుర్తించారు. ప్రధానంగా వాట్సప్ సందేశాల ద్వారా సమాచారం షేర్ చేసుకొని.. విధ్వంసాలకు పాల్పడ్డారని గుర్తించారు. మెత్తం 20 వాట్సప్‌ గ్రూపుల ద్వారా వివరాలు పంచుకున్నారు. ఘటనలో పాల్గొన్న 25 మందిని అరెస్ట్‌ చేయగా..వారిని విచారించిన సమయంలో మరి కొందరి పేర్లు బయటకు వచ్చాయి.

పలు రాజకీయ పార్టీలకు చెందిన వారు

పలు రాజకీయ పార్టీలకు చెందిన వారు

ఈ విధ్వంసంలో పలు రాజకీయ పార్టీలకు చెందిన వారితో పాటుగా.. ఏ పార్టీతోనూ సంబంధం లేని వారు ఉన్నట్లుగా తేల్చారు. వాట్సాప్ సందేశంలో.. సరిగ్గా.. 3 గంటల 10 నిమిషాలకు యుద్ధం మొదలుపెడదాం..పోలీసులు భోజనం చేస్తున్నారు... అమలాపురం టౌన్‌లోకి రావడానికి ఇదే మంచి సమయం.. అంటూ షేర్ చేసిన వాట్సప్ సందేశం పోలీసులు గుర్తించారు.

సరిగ్గా ఘటనకు ముందు ఈ సందేశం వాట్సప్​ గ్రూపుల్లో చెక్కర్లు కొట్టింది. విధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకునే ప్రక్రియ కొనసాగుతోందని పోలీసుల అధికారులు స్పష్టం చేసారు. 144 సెక్షన్‌ను మరో 5 రోజులు పొడిగించారు. అమలాపురంలో నిలిచిన ఇంటర్నెట్‌ సేవలు.. ఇంకా పునరుద్ధరించ లేదు.

వాట్సప్ గ్రూపుల ద్వారా సమాచారం

వాట్సప్ గ్రూపుల ద్వారా సమాచారం

20 వాట్సప్‌ గ్రూపుల ద్వారా సమాచారం పంచుకున్నారని ఎంతమంది ఎప్పుడు ఎక్కడకు చేరుకోవాలనే సందేశాలు ఉన్నాయని అధికారులు స్పష్టం చేసారు. డిలీట్‌ చేసిన మెసేజ్‌లనూ సాంకేతికత ఆధారంగా పరిశీలిస్తున్నామని, అరెస్టు చేసిన వారి ఆస్తులను జప్తు చేస్తామని చెప్పారు. అమాయకులపై కేసులు పెట్టబోమని, తప్పు చేసని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

నెలన్నర కిందట జిల్లాల విభజనలో భాగంగా కోనసీమ జిల్లాను ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనికి నిరసన పేరుతో మొదలైన ఆందోళన ఉద్రిక్తతకు కారణమైంది. నిరసన కారులు బస్సులను దగ్ధం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు.

కొనసాగుతున్న అరెస్టులు

కొనసాగుతున్న అరెస్టులు

మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీశ్ ఇంటికి నిప్పు పెట్టారు. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న అమలాపురం వీధులు వేల మంది ఆందోళనకారులతో నిండి పరిస్థితి చేయిదాటింది. సామాన్యులు, ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉరుకులు పరుగులు తీశారు. విధ్వంసం పైన సీరియస్ గా ఉన్న ప్రభుత్వం..బాధ్యుల పైన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించింది.

ఫలితంగా డీజీపీ కార్యాలయం అక్కడి పరిస్థితుల పైన నిత్యం సమీక్షిస్తోంది. పోలీసు ఉన్నతాధికారులు అమలాపురం .. పరిసర ప్రాంతాల్లో పరిస్థితిపైన నిఘా ఏర్పాటు చేసారు. తిరిగి ఎటువంటి ఘటనలకు ఆస్కారం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.

English summary
Police traced Whatsapp messages shared before Violence in Amaalapuram, 25 persons arrest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X