• search
  • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆ నంబర్ కు వాట్సప్ చేస్తే 10 వేలు మీ ఖాతాలో : తిరుపతి ఉపఎన్నికపై టీడీపీ షాకింగ్ ప్లాన్

|

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక అధికార ప్రతిపక్ష పార్టీల నేతలకు ప్రతిష్ఠాత్మక ఎన్నికగా మారింది. తిరుపతిలో ఎలాగైనా విజయం సాధించాలని టిడిపి పట్టుదలతో ఉంటే, భారీ మెజారిటీతో తిరుపతి లోక్ సభ స్థానాన్ని కైవసం చేసుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇక బీజేపీ వైసిపి, టిడిపి లపై విరుచుకుపడుతూ బిజెపి నుండి బరిలోకి దిగిన వారిని గెలిపించి పట్టం కట్టాలని ప్రజలను అభ్యర్థిస్తోంది.

 వైసీపీ అభ్యర్థిగా గురుమూర్తి నామినేషన్ దాఖలు ,తిరుపతి ఉపఎన్నిక లో గెలుపు లాంఛనమే : వైసీపీ మంత్రులు వైసీపీ అభ్యర్థిగా గురుమూర్తి నామినేషన్ దాఖలు ,తిరుపతి ఉపఎన్నిక లో గెలుపు లాంఛనమే : వైసీపీ మంత్రులు

 తిరుపతి ఉప ఎన్నికలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన టీడీపీ

తిరుపతి ఉప ఎన్నికలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన టీడీపీ


ఇదిలా ఉంటే గత ఎన్నికల సమయంలో అధికార వైసీపీ ఎన్నికల అక్రమాలకు పాల్పడింది అని, పథకాలు రావంటూ బెదిరింపులకు గురి చేసిందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఎన్నికల కమిషన్ కు సైతం ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ ఎన్నికల కమిషన్ టిడిపి ఫిర్యాదులపై ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడంతో తెలుగుదేశం పార్టీ ఈసారి తిరుపతి ఉప ఎన్నిక పై ఒక కొత్త వ్యూహం తో ముందుకు వెళుతుంది.

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో వైసిపి ఎత్తులను చిత్తు చేయడం కోసం తెలుగుదేశం పార్టీ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

బెదిరించే వాలంటీర్లు , వైసీపీ నేతల గుట్టు రట్టు చెయ్యాలని పిలుపునిచ్చిన అచ్చెన్న

బెదిరించే వాలంటీర్లు , వైసీపీ నేతల గుట్టు రట్టు చెయ్యాలని పిలుపునిచ్చిన అచ్చెన్న

వాలంటీర్లు కానీ, అధికార పార్టీకి చెందిన నాయకులు కానీ బెదిరిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని సూచించింది. అంతేకాదు ఆధారాలతో సహా అక్రమాలకు పాల్పడే వారిని పట్టిస్తే , వెంటనే వాట్సాప్ నెంబర్ కి పంపిస్తే వారికి నగదు బహుమతి ఇస్తామని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఈరోజు తిరుపతిలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే పథకాలు రావంటూ భయపెట్టే వాలంటీర్ల గుట్టు రట్టు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

 7557557744కు కాల్ రికార్డ్ గాని, ఫోటో గాని, వాట్సాప్ వీడియో కానీ పంపాలని విజ్ఞప్తి

7557557744కు కాల్ రికార్డ్ గాని, ఫోటో గాని, వాట్సాప్ వీడియో కానీ పంపాలని విజ్ఞప్తి

అలాంటి వారి సమాచారాన్ని పార్టీ ఏర్పాటు చేసిన వాట్సాప్ నెంబర్ 7557557744కు కాల్ రికార్డ్ గాని, ఫోటో గాని, వాట్సాప్ వీడియో కానీ పంపించాలని అలా ఎవరైతే అక్రమాలను వెలుగులోకి తెస్తారో వారికి పదివేల రూపాయలు వారి ఖాతాలో వేస్తామని ఆసక్తికరమైన ప్రకటన చేశారు. తిరుపతి లోక్సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో ఇది వర్తిస్తుందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు . ఈ విషయాన్ని అందరికీ తెలిసేలా చేరవేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

గత ఎన్నికల్లో వైసీపీ బెదిరింపుల వల్లే ఓటమి పాలయ్యాం అంటున్న అచ్చెన్న

గత ఎన్నికల్లో వైసీపీ బెదిరింపుల వల్లే ఓటమి పాలయ్యాం అంటున్న అచ్చెన్న

తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలలో అక్రమాలకు చెక్ పెట్టడానికి తీసుకున్న అనూహ్య నిర్ణయం పై ఇప్పుడు చర్చ జరుగుతుంది. , ఇంతకు ముందు జరిగిన పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికలలో అధికార పార్టీ బెదిరింపుల వల్ల ఓటమి తప్పలేదని , పథకాలు పోతాయన్న భయంతో చాలామంది వైసీపీకి ఓట్లు వేశారని అందుకే ఈసారి అక్రమాలకు చెక్ పెట్టాలని ఈ నిర్ణయం తీసుకున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు. పథకాలు పోతాయన్న భయం ఎవరికీ అవసరం లేదన్నారు.

తిరుపతి ఉపఎన్నికలో వైసీపీకి , జగన్ కి బుద్ధి చెప్పాలని పిలుపు

తిరుపతి ఉపఎన్నికలో వైసీపీకి , జగన్ కి బుద్ధి చెప్పాలని పిలుపు

ఆ డబ్బులు జగన్ రెడ్డి తాత డబ్బులు , తండ్రి డబ్బులు కాదని, అవి ప్రజల డబ్బులన్నీ పేర్కొన్న అచ్చెన్నాయుడు రాష్ట్రమంతా గతంలో వైసీపీ గెలిచినా , తిరుపతి లోనే టిడిపికి ఎక్కువ ఓట్లు వచ్చాయి అని గుర్తుచేశారు. 10 పైసలు ఇచ్చి 90 పైసలు దోచుకుంటున్న జగన్మోహన్రెడ్డికి బుద్ధి చెప్పాలంటే తిరుపతి ఉప ఎన్నికల్లో టిడిపిని గెలిపించాలని, ప్రజలు టిడిపి పక్షాన నిలవాలని అచ్చెన్నాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

English summary
Volunteers and leaders of the ruling party should be informed immediately if threatened. In addition, the Telugu Desam Party has announced a cash reward of Rs 10,000 for those who will send evidences to whatsapp number about ycp leaders and volunteers election irregularities, In Tirupati today, TDP state president Atchannaidu said that don't worry about the government schemes and they are not giving from their pockets .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X