కుట్రను బయటపెడతాం...ఇది ఇంతటితో ఆగదు: జనసేన అధికార ప్రతినిధి
గత నెలరోజులగా నుంచి తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి చోటుచేసుకుంటున్న సంచలన పరిణామాలు, వాటి వెనుక కుట్రలను సమయమొచ్చినపుడు ఖచ్చితంగా బైటపెడతామని జనసేన అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ ప్రకటించారు. హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
కుట్రపూరితంగా ఈ వ్యవహారాలను వెనుకుండి నడిపిస్తున్న వారి బాగోతాలు త్వరలోనే బట్టబయలు చేస్తామని అద్దేపల్లి శ్రీధర్ చెప్పారు. "ఈ కుట్రను కచ్చితంగా బయటపెడతాం. ఇది ఇక్కడితో ఆగదు. టైం వచ్చినప్పుడు ఆధారాలన్నీ బయటపెడతాం. ప్రస్తుతం ప్రముఖులందరితో మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చర్చలు జరుపుతున్నారు. సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న వ్యవహారాలన్నింటిపైనా చర్చలు జరుగుతున్నాయి"...అద్దేపల్లి శ్రీధర్ మీడియాతో చెప్పారు.

అయితే తెలుగు సినీ ఇండస్ట్రీని దెబ్బతీయడానికే ఇలా జరుగుతోందా?...లేదా కేవలం ఒక వ్యక్తిని దెబ్బతీయడానికే ఇలా చేస్తున్నారా?...అనే విషయమై సమాచారం సేకరిస్తున్నామని తెలిపారు. "తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతోందనే విషయంపైనా చర్చ జరుగుతోందని , తెలుగు రాష్ట్రాల్లో, సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాలకు...పవన్ కళ్యాణ్ తల్లికి ఏమైనా సంబంధముందా?...అసలు ఆమెను టార్గెట్ చేయడానికి ఎవరికి హక్కుంది?...అని అద్దేపల్లి శ్రీధర్ ప్రశ్నించారు. శ్రీరెడ్డి పవన్ కల్యాణ్ తల్లి పై చేసిన వ్యాఖ్యలని ఉద్దేశించి ఆమె ఇవాళ పవన్ మదర్‌ను అన్నది...రేపొద్దున ఇంకొకర్ని అంటుందని శ్రీధర్ ాగ్రహం వ్యక్తం చేశారు.