హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆసక్తికరం: నారావారి కోడలి రక్తదానం.. పక్కనే మెగా కోడలు, బాలయ్య ఇలా!

ఓ వైపు నంది అవార్డుల వివాదం మెగా, నందమూరి కుటుంబాల మధ్య దూరం పెంచిందనే ప్రచారం జరుగుతుంటే.. మరోవైపు అలాంటిదేం లేదనే సంకేతాలు కూడా వస్తున్నాయి. ఇందుకు మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన కామినేని, ఏపీ సీఎం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓ వైపు నంది అవార్డుల వివాదం మెగా, నందమూరి కుటుంబాల మధ్య దూరం పెంచిందనే ప్రచారం జరుగుతుంటే.. మరోవైపు అలాంటిదేం లేదనే సంకేతాలు కూడా వస్తున్నాయి. ఇందుకు మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన కామినేని, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కోడలు నారా నారా బ్రాహ్మణీలే కారణం.

Recommended Video

వైరల్ అవుతున్న ఉపాసన కాఫీమేకింగ్ వీడియో

తాజాగా, కోడలు ఉపాసన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఆసక్తికరమైన ఫొటోను పోస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. శనివారం జరిగిన ఓ రక్తదాన శిభిరంలో ఉపాసన, బ్రాహ్మణిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేసిన ఉపాసన.. '18 ఏళ్ల వయసులో రక్తదానం చేయటం ప్రారంభిస్తే ప్రతీ 90 రోజులకు ఒకసారి చొప్పున 60 ఏళ్ల వరకు చేయవచ్చు. దాదాపు 500 మంది ప్రాణాలను కాపాడవచ్చు' అంటూ పేర్కొన్నారు.

బ్రాహ్మణి మాట్లాడుతూ.. మన దేశంలో ఏటా 5 కోట్ల యూనిట్ల రక్తం అవసరం అవుతోందని చెప్పారు. అయితే, కేవలం రెండున్నర కోట్ల యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో, రక్తదానం ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. స్వచ్ఛంద సంస్థలు, యువత భారీ ఎత్తున ప్రచారం నిర్వహించాలని అన్నారు. రక్తదానంపై ప్రచారం నిర్వహించేందుకు ఫేస్ బుక్ బ్లడ్ టూల్ ను ఈ రోజు ప్రారంభించినట్టు తెలిపారు.

కాగా, ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా రక్తదానం చేశారు. తలసేమిక్ చిన్నారులను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన రక్తదాన కార్యక్రమంలో ఆయన రక్తదానం చేశారు. ఆయన పక్కనే కుమార్తె బ్రాహ్మణి కూడా ఉన్నారు.

English summary
At a time when a fullscale Nandamuri-Konidela fan war is on over Nandi awards, the daughters' in laws of both families came together for a cause. Nandamuri Balakrishna's daughter and Chief Minister Chandrababu's 'kodalu' Nara Brahmani and Chiranjeevi's daughter in law Upasana Kamineni jointly promoted blood donation. The bonhomie and joie de vivre among the two young ladies was seen to be believed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X