వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెగా హీరోలు ఎక్క‌డ‌..? ఎన్నిక‌ల ప్ర‌చారంలో బాబాయికి బాస‌ట క‌లేనా..?

|
Google Oneindia TeluguNews

అమ‌రావ‌తి/హైద‌రాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫీవర్ నడుస్తుంది. అక్కడ టీడీపీ, వైసీపీ హోరాహోరి తలపడుతున్నాయి. ఇక నేను కూడా ఉన్నానంటూ వన్ కళ్యాణ్ దూసుకు వస్తున్నారు. టీడీపీ, జనసేన, వైసీపీ మాటల యుద్ధంతో ప్ర‌చారం మొత్తం మార్మోగిపోతోంది. ఇక ఈసారి టీడీపీకి సినిమా గ్లామర్ దూరమైంది. ఒక్క దివ్యవాణి మాత్రమే కనబడుతుంది. కానీ వైసీపీకి మాత్రం పలువురు కామెడీ న‌టులు మద్దతిస్తున్నారు. ఇక జనసేన సినిమా గ్లామర్ పార్టీనే. పవన్ కళ్యాణ్ కెరీర్ మంచి దూకుడుగా ఉన్న టైంలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కాని ఇప్పుడున్న మగా జెన‌రేష‌న్ హీరోలు మాత్రం కెరీర్ అంటూ బాబాయి ప్ర‌చారానికి దూరంగా ఉంటున్న‌ట్టు చ‌ర్చ జ‌రుగుతోంది.

ప్ర‌చారంలో దూసుకెళ్తున్న జ‌న‌సేన‌..! కాన‌రాని మెగా హీరోలు..!!

ప్ర‌చారంలో దూసుకెళ్తున్న జ‌న‌సేన‌..! కాన‌రాని మెగా హీరోలు..!!

జనసేన పార్టీతో రాజ‌కీయాల్లో స‌మూల మార్పులు సాధిస్తానని, ఒక్కసారి సీఎం గా అవ‌కాశం ఇవ్వండి అంటూ ప్రజలను ఓట్లు అడుగుతున్నారు గ‌బ్బ‌ర్ సింగ్. ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ ఎన్నికల కోసం మెగా ఫ్యామిలీలోని హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రచారానికి రోడ్డెక్కారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో మెగా హీరోలు ఎవరూ పవ��్ కళ్యాణ్ పక్షాన నిలబడిన‌ట్టు కనిపించడం లేదు. మెగా ఫ్యామిలీలో అరడజనుకు పైగా హీరోలు వున్న విష‌యం తెలిసిందే..!

మెగా ఫామిలీలో అర‌డ‌జ‌ను పైగా హీరోలు..! కాని ప‌వ‌న్ కు సంఘీభావం తెల‌ప‌ని కుర్ర‌కారు..!!

మెగా ఫామిలీలో అర‌డ‌జ‌ను పైగా హీరోలు..! కాని ప‌వ‌న్ కు సంఘీభావం తెల‌ప‌ని కుర్ర‌కారు..!!

ఇంకా ఎన్నికల ప్రచారానికి, కేవలం 16 రోజుల స‌మ‌యం మాత్ర‌మే టైం మాత్రమే ఉంది. వీడియోస్ రూపంలో గలాటా చేసిన నాగబాబు ,నిన్నగాక మొన్న జనసేనలోకి చేరి నర్సాపురం ఎంపీ టికెట్ సంపాదించాడు. గతంలో ఫ్యాన్స్ మెగా ఫ్యామిలిని పవన్ ఎక్కడంటూ అడిగినప్పుడు, వాడి గురించి నాకు తెలియదని విసుక్కున్నాడు నాగబాబు. సరే అదలా ఉంటే రామ్ చరణ్, బాబాయ్ పవన్ కళ్యాణ్ కి మద్దతిస్తున్నాని అన్నాడు కానీ, ప్రస్తుతం ఆ ఊసే లేకుండా సినిమా షూటింగ్ కోసం పొరుగు రాష్ట్రం వెళ్లిపోయాడు.

ప్ర‌త్యక్ష రాజ‌కీయాల‌కు దూర‌మైన చిరంజీవి..! జ‌న‌సేన కు మ‌ద్ద‌త్తు పై సందిగ్ద‌త‌..!!

ప్ర‌త్యక్ష రాజ‌కీయాల‌కు దూర‌మైన చిరంజీవి..! జ‌న‌సేన కు మ‌ద్ద‌త్తు పై సందిగ్ద‌త‌..!!

ఇక చిరంజీవి "సైరా" షూటింగ్ లో బిజీగా వున్నాడు. ప్రజారాజ్యం ను పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ అన్న కోసం యూరాజ్యం అని పెట్టి రాష్ట్రంలో పర్యటించాడు. ఇప్పుడు మాత్రం అన్న తమ్ముడికి సహాయం అందించడంలేదు. అంతే కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్య‌వ‌హారాల‌కు కూడా చిరు దూరంగా ఉంటున్నారు. మరోపక్క వరుణ్ తేజ్, సాయి ధర��్ తేజ్ లాంటి మెగా హీరోలు కూడా జనసేనపై స్పందించడానికి జంకుతున్నారు. ఇక అల్లు ఫామిలీ జ‌న‌సైనికుడికి ఆమ‌డ దూరం ఉంటోంది.

అల్లు కుంటుబం ఆమ‌డ దూరం..! కాట‌మ రాయుడుతో క‌లిసి వ‌చ్చేది ఎవ‌రు..?

అల్లు కుంటుబం ఆమ‌డ దూరం..! కాట‌మ రాయుడుతో క‌లిసి వ‌చ్చేది ఎవ‌రు..?

పవన్ కళ్యాణ్ ప్రాణ మిత్రుడు త్రివిక్రమ్, ఎక్కడా జనసేన గూర్చి మాట్లాడడం లేదు. మరి మెగా హీరోల గ్లామర్ జనసేనకు అందనట్టే కనబడుతుంది. నాగబాబు ఒక్కడే ప��న్ కళ్యాణ్ కు బాస‌ట‌గా నిల‌వాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. మరి రెండు చోట్ల బరిలోకి దిగుతున్న పవన్ కళ్యాణ్ త‌న సొంత ఇమేజ్ తో రెండు స్థానాల్లో గెలిచేస్తాడేమో కానీ, మిగతా అభ్యర్థుల సంగతి ఎలా ఉంటుందో చెప్పలేని ప‌రిస్థితులు త‌లెత్తాయి. ఇక మెగా ఫ్యామిలీ ప్ర‌చారానికి రాకపోతేనే బెటర్ అన్నట్టుగా గ‌బ్బ‌ర్ సింగ్ వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

English summary
Janasana is a glamor party. Pawan Kalyan's career has come into politics as well. But now there is talk that the heroes of Mega Generation are away from the campaign for f Babai pavan kalyan..!.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X