• search
 • Live TV
నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆనందయ్య ఎక్కడ ? మందు పంపిణీ ఏదీ ? జగన్‌ సర్కార్‌పై అల్లోపతి మాఫియాదే పైచేయి ?

|

కరోనాపై అద్బుతంగా పనిచేస్తుందని ఏపీలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ ఊదరగొట్టిన నెల్లూరు ఆనందయ్య మందు పంపిణీ ఎందుకు నిలిచిపోయింది ? అసలు ఆనందయ్య ఎక్కడున్నారు ? ఆయన మందు పంపిణీకి ప్రభుత్వం ఎందుకు సహకరించలేదు ? ప్రభుత్వ సహకారం లేకపోవడంతో మందు పంపిణీ నిలిపేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఆనందయ్య ఎక్కడికి వెళ్లారు ? అంతా ఊహిస్తున్నట్లుగా ప్రభుత్వ చిత్తశుద్ధి కంటే అల్లోపతి మాఫియానే పైచేయి సాధించిందా ? సాదారణ ప్రజల్లో నెలకొన్న ప్రశ్నలివి. ఈ మౌనం వెనుక ఏముందో తెలియాంటే ఈ స్టోరీ చదవాల్సిందే...

ఆనందయ్య ఎక్కడ ?

ఆనందయ్య ఎక్కడ ?

నెల్లూరులో తన ఆయుర్వేద మందుతో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వైద్యుడు ఆనందయ్య ఇప్పుడు ఎక్కడున్నారంటే ప్రభుత్వంతో పాటు విపక్షాలు సైతం మౌనాన్నే ఆశ్రయిస్తున్నాయి. తాను తయారు చేసిన కరోనా మందును తీసుకునేందుకు లక్షలాది మంది రోగులు ఎదురుచూస్తుంటే దాన్ని అందరికీ అందించేందుకు సిద్దమైన ఆనందయ్య ఎక్కడున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తన ఆయుర్వేద మందు తయారీ కోసం ప్రభుత్వ సహకారం కావాలని పదేపదే కోరిన ఆనందయ్య కనిపించకుండా పోవడం వెనుక ఏం జరిగింది ?

ఆనందయ్య మందు పంపిణీకి బ్రేక్‌ వెనుక ?

ఆనందయ్య మందు పంపిణీకి బ్రేక్‌ వెనుక ?

ఆనందయ్య తయారు చేస్తున్న కరోనా ఆయుర్వేద మందు పంపిణీకి బ్రేకులు ఎందుకు పడ్డాయనే ప్రశ్నకు అటు ప్రభుత్వం వద్దా, ఇటు విపక్షాల వద్దా సమాధానం లభించడం లేదు. ఆనందయ్య మందు కృష్ణపట్నం నుంచి సర్వేపల్లికీ, అనంతరం చంద్రగిరికీ, తర్వాత ఒంగోలుకూ పంపిణీ అయిన తర్వాత మరో చోట జరగలేదు. ప్రభుత్వ సహకారం ఉంటేనే రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేయడం సాధ్యమవుతుందని ఆనందయ్య తేల్చిచెప్పేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో ఆనందయ్య మందు పంపిణీ గురించి అంతా మాట్లాడటమే మానేశారు. దీంతో ఆనందయ్య మందు పంపిణీకి బ్రేక్ వెనుక రహస్య శక్తులు పనిచేసినట్లు అర్దమవుతోంది.

వైసీపీ సర్కార్ ఎందుకు సహకరించలేదు ?

వైసీపీ సర్కార్ ఎందుకు సహకరించలేదు ?

నెల్లూరు ఆనందయ్య మందు గురించి ఆనందయ్య కంటే ముందు రాష్ట్రంలో ప్రచారం చేసుకుంది వైసీపీ నేతలే. ఆనందయ్య మందు పంపిణీకి జనాన్ని రావాలని కోరింది వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి. ఆ తర్వాత టీడీపీ రంగంలోకి దిగినా అంతిమంగా వైసీపీ నేతలు, ప్రభుత్వ సహకారం లేనిదే ఈ మందు పంపిణీ జరగదని అందరికీ అర్ధమైపోయింది. చివరికి అంతా ఊహించినట్లుగానే కొందరు వైసీపీ నేతలు తమ నియోజకవర్గాల్లో ఆనందయ్య మందు పంపిణీ చేసి మమ అనిపించేశారు. మిగతా నియోజకవర్గాలకు సైతం దాని పంపిణీ కాకుండా అడ్డుకున్నారు. కోర్టుల్లో సైతం ఈ మందు అనుమతుల కోసం పోరాడిన వైసీపీ నేతలు, ప్రభుత్వం రాష్ట్రవ్యాప్త పంపిణీ చేపడితే ఎదురయ్యే సమస్యలకు భయపడ్డారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అల్లోపతి మాఫియాదే పైచేయి ?

అల్లోపతి మాఫియాదే పైచేయి ?

నెల్లూరు ఆనందయ్య మందు పంపిణీ ప్రారంభమైందో లేదో దానికి బ్రేకులు పడటం మొదలైంది. ఇలా మందు పంపిణీ ప్రారంభించారో లేదా అనుమతుల పేరుతో దానికి బ్రేకులు వేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆయుష్‌, ఐసీఎంఆర్‌ వంటి కేంద్ర ప్రభుత్వ విభాగాలు కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినా, వైసీపీ సర్కార్‌ అనుమతి ఇచ్చినా మందు పంపిణీ మాత్రం పరిమితంగానే సాగింది. ఇప్పుడు మొత్తంగా ఆగిపోయింది. ఆనందయ్య మందు అందరికీ అందుబాటులోకి వస్తే తమకు ముప్పని భావించిన అల్లోపతి మాఫియా.. ప్రభుత్వాలు, అధికారుల సాయంతో దీనికి బ్రేక్ వేయించిందా అన్నఅనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదీ ఏ స్ధాయిలో అంటే ప్రభుత్వం అనుమతిచ్చిన మందుకు... సర్కారే పంపిణీకి సహకరించకుండా చేయడం ద్వారా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

  Krishnapatnam Medicine Distribution | Oneindia Telugu
  English summary
  nellore anandayya medicine distribution has halted after his vows on andhrapradesh government's non-cooperation.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X