వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవి సినిమాపై చంద్రబాబు కుట్ర!: రాజకీయ రంగు.. నిజాలేమిటి?

ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ వేడుక వేదిక పైన పరోక్షంగానైనా ప్రస్తావన రాకపోవడం, మంత్రులు హాజరు కావడం, స్టేజ్ స్పాన్సర్‌గా ప్రభుత్వ పథకం కూడా ఉండటం చూస్తుంటే.. కుట్ర, ఆటంకాలు అన్నీ వట్టివే అంటున్నారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150వ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలకు చంద్రబాబు ప్రభుత్వం ఆటంకాలు సృష్టించిందని కొందరు అభిమానులు మండిపడ్డారు. ఇది చర్చనీయాంశంగా మారింది. అయితే, అదంతా వట్టిదేనని, ఊహాగానాలేనని వెల్లడవుతోందని అంటున్నారు.

<strong>పవన్ కళ్యాణ్ టు నాగబాబు..: మరో ఛాన్స్ లేదు.. చిరంజీవిని లాగుతున్నారు!</strong>పవన్ కళ్యాణ్ టు నాగబాబు..: మరో ఛాన్స్ లేదు.. చిరంజీవిని లాగుతున్నారు!

అందుకు పలు కారణాలు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక గుంటూరు జిల్లాలోని హాయ్‌ల్యాండ్సులో అంగరంగా వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు పత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస రావులు హాజరయ్యారు. వీరి గురించి చిరంజీవి సానుకూలంగా మాట్లాడారు.

అదే సమయంలో

అదే సమయంలో

ఖైదీ నెంబర్ 150 చిత్రం పైన ప్రభుత్వం కుట్ర చేస్తుందనే దాని పైన ఈ వేడుక సందర్భంగా చిరంజీవి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మాట్లాడుతారనే ప్రచారం సాగింది. చిరంజీవి ఏమీ మాట్లాడలేదు. పైగా మంత్రుల గురించి సానుకూలంగా మాట్లాడారు.

మరో ఆసక్తికర విషయం ఏమంటే..

మరో ఆసక్తికర విషయం ఏమంటే..

ఏపీ ఫైబర్ నెట్ కూడా ఖైదీ నెంబర్ 150 సినిమాకు స్టేజ్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఏప ఫైబర్ నెట్.. చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంటర్నెట్ పథకం. వేడుకను అడ్డుకోవాలనుకుంటే భాగస్వామి ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. అంటే, అదంతా వట్టి ప్రచారమేనని అర్థమవుతోందని అంటున్నారు.

వేదిక పైన

వేదిక పైన

పరోక్షంగానైనా ప్రస్తావన రాకపోవడం, మంత్రులు హాజరు కావడం, వారి పట్ల హీరో సానుకూలంగా స్పందించడం, స్టేజ్ స్పాన్సర్‌గా ప్రభుత్వ పథకం కూడా ఉండటం చూస్తుంటే.. కుట్ర, ఆటంకాలు అన్నీ వట్టివేనని అంటున్నారు.

సోషల్ మీడియాలోను

సోషల్ మీడియాలోను

పెద్ద ఎత్తున దుమారం రేగింది. చిరంజీవి కాంగ్రెస్ పార్టీ, ఏపీలో అధికారంలో ఉన్నది టిడిపి కాబట్టి అందుకే వేడుకకు ఒప్పుకోలేదని, కుట్ర జరుగుతోందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేశారంటున్నారు.

English summary
Andhra Pradesh government’s affordable Internet scheme for all, AP Fibernet is also one of the stage sponsors for the event.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X