వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్ ఒదిలిన భాణం ఎక్క‌డ‌..?

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్/ఏపి: జ‌గ‌న్ ఒదిలిన బాణం.. ఈ ప‌దానికి ఓ ప్ర‌త్యేక‌త ఉంది. అక్ర‌మాస్తుల కేసులో వైసీపి అదినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి జైలుకెళ్లిన‌ప్పుడు పార్టీ బ‌రువు బాద్య‌త‌ల‌ను తీసుకున్నారు ఆయ‌న సోద‌రి ష‌ర్మిళ‌. జ‌గ‌న్ చేస్తున్న ఓదార్పు యాత్ర మ‌ద్య‌లో ఉండ‌గా జైలుకు వెళ్ల‌డంతో మిగిలిని యాత్ర‌ను ష‌ర్మిళ‌తో పూర్తి చేయించారు జ‌గ‌న్. ఆ సంద‌ర్బంగా బాగా ప్రాచూర్యం పొందిన ష‌ర్మిళ రాజ‌కీయంగా మంచి ప్ర‌జాధ‌ర‌ణ పొంద‌గ‌లిగారు. త‌ర్వాత జ‌గ‌న్ జైలునుంచి విడుద‌ల కావ‌డంతో ఒక్క‌సారిగా ష‌ర్మిళ కునుమ‌రుగ‌య్యారు. తాజాగా ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌ద్యంలో ష‌ర్మిళ మ‌ళ్లీ ప్ర‌త్య‌క్ష‌రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఒంగోలు పార్ట‌మెంట్ స్థానం నుండి ష‌ర్మిళ పోటీ చేసేందుకు రెఢీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది.

ప్ర‌త్యోక్ష రాజ‌కీయాల్లోకి ష‌ర్మిల‌..! మ‌ళ్లీ ప్ర‌జాక్షేత్రంలోకి జ‌గ‌న‌న్న బాణం..!

ప్ర‌త్యోక్ష రాజ‌కీయాల్లోకి ష‌ర్మిల‌..! మ‌ళ్లీ ప్ర‌జాక్షేత్రంలోకి జ‌గ‌న‌న్న బాణం..!

వైఎస్సార్ ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన వారిలో ప్ర‌జ‌ల్లో ఇమేజ్ సంపాదించుకున్న వైఎస్ త‌న‌య ష‌ర్మిల‌..పెద్ద‌గా పరిచ‌యం అక్క‌ర్లేని పేరు. అన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి జైలుకు వెళ్లిన‌పుడు ఓదార్పుయాత్ర‌తో ప్ర‌జ‌ల‌కు బాగా చేరువ‌య్యారు. క‌న్నీరు పెట్టుకున్న అమ్మ మ‌న‌సు అంటూ, అభిమానుల మ‌న్న‌న‌లు అందుకున్నారు. పైగా జ‌గ‌న్ అన్న వ‌దిలిన బాణాన్ని అంటూ ఎమోష‌న్ బాగా పండించారు. నాలుగైదు నెల‌ల పాటు జ‌నంలో ఉన్న ఆమెకు జ‌నం బ్ర‌హ్మ‌ర‌థః ప‌ట్టారు. కొన్ని సంద‌ర్భాల్లో అయితే.. వైఎస్ బాడీలాంగ్వేజ్‌, హావ‌భావాలూ అచ్చు నాన్న‌లాగానే ఉందంటూ అభిమానుల ప్ర‌శంస‌లూ అందుకున్నారు.

ఓదార్పు యాత్ర త‌ర్వాత ప్ర‌జ‌ల‌కు దూర‌మైన ష‌ర్మిళ‌..! తండ్రి తర‌హా మాట‌ల‌తో ఆక‌ట్టుకున్న కూతురు..!

ఓదార్పు యాత్ర త‌ర్వాత ప్ర‌జ‌ల‌కు దూర‌మైన ష‌ర్మిళ‌..! తండ్రి తర‌హా మాట‌ల‌తో ఆక‌ట్టుకున్న కూతురు..!

చివ‌ర్లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌న్నా ష‌ర్మిల ప్ర‌సంగాలు సూప‌ర్ అన్నంత రేంజ్ లోకి వెళ్లిపోయాయి. మ‌రి అక‌స్మాత్తుగా ఏమైందో ఏమోగానీ కొన్నాళ్లు ష‌ర్మిల జ‌నం మ‌ధ్య నుంచి దూర‌మ‌య్యారు. జైలు నుంచి వ‌చ్చిన జ‌గ‌న్ ష‌ర్మిళ‌కు విశ్రాంతి నిచ్చార‌నే విమ‌ర్శ‌లూ ఉన్నాయి. అయితే అస‌లు విష‌యం అది కాద‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. పార్టీలో అభిమానుల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక ఇమేజ్‌ను సంపాదించుకుంటున్న చెల్లెలు త‌న‌కు మున్ముందు రాజ‌కీయంగా పోటీ వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌నే ఉద్దేశంతోనే జ‌గ‌న్ ప‌క్క‌న బెట్టారంటూ స్వ‌యంగా కార్య‌క‌ర్త‌లే మాట్లాడుకున్నారు. కాని ఇందులో వాస్త‌వం లేద‌నే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది.

జ‌గ‌న్ క‌న్నా ష‌ర్మిళ బెట‌ర్ అనే స్థాయికి వ‌చ్చిన నాయ‌కురాలు..!

జ‌గ‌న్ క‌న్నా ష‌ర్మిళ బెట‌ర్ అనే స్థాయికి వ‌చ్చిన నాయ‌కురాలు..!

వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన నేత‌లు కూడా ఇదే మాట చెబుతుంటారు. జ‌గ‌న్ మొండివాడైతే మంచిదే కానీ పెద్ద‌లంటే గౌర‌వం లేని వాడిగా వ్య‌వ‌హ‌రిస్తాడ‌ని, త‌న‌కంటే హుందాగా ఎవ‌రైనా క‌నిపిస్తే భ‌రించ‌లేడనే విమ‌ర్శ‌లు ఉన్నాయి. జేసీ దివాక‌ర్‌రెడ్డి అయితే నా ముందు జ‌గ‌న్ బ‌చ్చా అంటూ చాలా సార్లు చెప్పు కొచ్చారు. తండ్రిలో ఉన్న ల‌క్ష‌ణాలు కొన్ని కూడా లేవంటూ ఎద్దేవా చేశారు కూడా. అంటువంటి జ‌గ‌న్‌, చెల్లెలును ఎలా రాజ‌కీయంగా ఎద‌గ‌నిస్తాడంటూ కూడా ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌య్యాయి. అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ జ‌గ‌న్ ష‌ర్మిళ‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాకి దించుతున్నారు. 2019 ఎన్నిక‌ల్లో ఒంగోలు పార్ల‌మెంట్ స్థానం నుండి ష‌ర్మిళ‌ను నిల‌బెట్టాల‌ని జ‌గ‌న్ ప్ర‌ణాళిక ర‌చిస్తున్న‌ట్టు తెలుస్థోంది. అందుకోసం సిట్టింగ్ ఎంపి వైపీ సుబ్బారెడ్డిని కూడా జ‌గ‌న్ సంప్ర‌దించిన‌ట్టు స‌మాచారం.

 మ‌ళ్లీ ప్ర‌త్యక్ష రాజ‌కీయాల్లోకి రానున్న ష‌ర్మిళ‌..! ఒంగోలు నుండి ఎంపీగా పోటీ..??

మ‌ళ్లీ ప్ర‌త్యక్ష రాజ‌కీయాల్లోకి రానున్న ష‌ర్మిళ‌..! ఒంగోలు నుండి ఎంపీగా పోటీ..??

ఢిల్లీ స్థాయిలో వైసీపికి స‌రైన నాయ‌క‌త్వం లేని ప‌క్షంలో జ‌గ‌న్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు చ‌ర్చ జ‌రుగుతోంది. ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి ఢిల్లీ స్థాయిలో వైసీపి త‌రుపున రాజ‌కీయం జ‌రుపుతున్న‌ప్ప‌టికి అవి అంత‌గా ప్ర‌భావం చూప‌డంలేద‌నేది జ‌గ‌న్ భావ‌న‌గా తెలుస్తోంది. ఆడిట‌ర్ గా ఉన్న విజ‌యసాయి రెడ్డిని పూర్తి స్థాయి రాజ‌కీయ‌నేత‌గా ఇంకా ఆక‌ళింపుచేసుకోలేద‌నే విమ‌ర్శ‌లు కూడా వినిపిస్తున్నాయి. దానికి తోడు ఇటీవ‌ల పార్ల‌మెంట్ లో జ‌రిగిన రాజీనామా, అవిశ్వాస తీర్మాణం వంటి ప‌రిణామాలు పూర్తి స్థాయిలో వైసీపికి వ్య‌తిరేక ఫ‌లితాల‌నిచ్చాయి. దీంతో విజ‌య‌సాయి రెడ్డి తో పాటు మ‌రో న‌మ్మ‌క‌మైన నాయ‌కుడు ఢిల్లీ ఉండాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంద‌ని జ‌గ‌న్ గుర్తించార‌ని తెలుస్తోంది. దీంతో అటు ఎంపీ వైవీ సుబ్బారెడ్డితో, ఇటు చెల్లెలు ష‌ర్మిళ‌తో జ‌గ‌న్ సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్టు లోట‌స్ పాండ్ వ‌ర్గాలు తెలియ‌జేస్తున్నాయి.మ‌రి ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో చెల్లి మ‌రోసారి బాణంగా దూసుకొస్తుందా.. జ‌గ‌న‌న్న ఆదేశాల‌ను శిర‌సావ‌హిస్తుందా.. లేదా చూడాలి.

English summary
ysrcp is searching for new boost up for party. ycp chief jaganmohan reddy syster sharmila coming into direct politics. in the delhi range no leader for ycp to do politics. so jagan decided to bring sharmila into direct politics. she is going to contest as pm from ongole parliament seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X