'రిషికేశ్వరి కేసులో బాబుకేం సంబంధం, అనూషపై రోజా రాజీ కుదిర్చింది!'
విజయవాడ: గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న రిషికేశ్వరి కేసులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎటువంటి సంబంధం లేకపోయినా ఆయన పైన వైసిపి బురద జల్లే ప్రయత్నం చేస్తోందని టిడిపి నేత జూపూడి ప్రభాకర రావు బుధవారం మండిపడ్డారు.
చంద్రబాబు పైన వైసిపి, ఎమ్మెల్యే రోజా బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సంబంధం లేని విషయాలను ముఖ్యమంత్రికి అంటగడుతున్న వైసిపి నేతలు రోజురోజుకు దిగజారుతున్నారన్నారు.
ప్రకాశం జిల్లాలో బూచేపల్లి సుబ్బారెడ్డి కళాశాలలో హెచ్ఓడీ వేధింపులతో అనూష అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటే రోజా ఎక్కడా కనిపించడం లేదని నిలదీశారు. అనూష కుటుంబం, కాలేజీ యాజమాన్యం మధ్య రోజా రాజీ కుదిర్చిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

తిరుపతి బ్రహ్మోత్సవం వేళ..: చంద్రబాబు ఆనందం
తిరుపతి బ్రహ్మోత్సవం వేళ పట్టిసీమ ప్రాజెక్టు మొదటి పంపుహౌస్ నుంచి నీటిని విడుదల చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనందం వ్యక్తం చశారు. నేడు ఈ మహత్కార్యానికి శ్రీకారం చుట్టడం సంతోషదాయకమన్నారు.
గోదావరి పుష్కరాల తొక్కిసలాటపై ఏకసభ్య కమిషన్
గోదావరి పుష్కరాలలో తొక్కిసలాట ఘటన పైన ఏపీ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. విచారణ అధికారిగా హైకోర్టు రిటైర్డ్ జడ్జి సోమయాజులును నియమించింది. ఆరు నెలల్లో నివేదిక అందజేయాలని చెప్పింది. గోదావరి పుష్కరాల తొలి రోజు జరిగిన తొక్కిసలాటలో 27 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications