వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ లోకల్ పోరులో సత్తాచాటెదేవరు..? వైసీపీ వద్ద ఉన్న అస్త్రాలేంటీ; టీడీపీ స్లోగనేంటీ..?

|
Google Oneindia TeluguNews

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 17వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఫిబ్రవరి 8వ తేదీన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఎన్నికల సమయం సమీపిస్తోన్న వేళ.. ఓటర్లను ఆకట్టుకునే పనిలో ప్రధాన రాజకీయ పార్టీలు తమ వ్యుహాలకు మరింత పదునుపెడుతున్నాయి. 13 జెడ్పీ స్థానాల్లో జెండా ఎగరవేయాలని వైసీపీ భావిస్తోంటే.. ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని టీడీపీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది.

8 నెలల తర్వాత..

8 నెలల తర్వాత..

అసెంబ్లీ ఎన్నికల జరిగిన 8 నెలలకు ఏపీలో స్థానిక పోరు జరగబోతోంది. దీంతో అధికార పార్టీ మెజార్టీ జెడ్పీ స్థానాలు గెలిచి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను రిపీట్ చేయాలనుకుంటోంది. 13 జెడ్పీ స్థానాలను గెలిచి.. టీడీపీ ఉనికి లేకుండా చేయాలని భావిస్తోంది. ఇందుకోసం 8 నెలల్లో చేసిన పనులను ప్రజలకు వివరించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన నవరత్నాల గురించి ప్రధానంగా ప్రస్తావించడంతో విజయం సాధ్యమని సీఎం జగన్ భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.

పథకాలకు శ్రీకారం

పథకాలకు శ్రీకారం

వైఎస్ఆర్ రైతు భరోసా, ఫీజు రీయింబర్స్ ‌మెంట్, ఆరోగ్య శ్రీ, జలయజ్ఞం, మద్యపాన నిషేధం, అమ్మ ఒడి, వైఎస్ఆర్ ఆసరా, పేదలకు ఇళ్లు, పెన్షన్ల పెంపు అనే తొమ్మిది పథకాలను నవరత్నాలుగా వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇచ్చిన హామీ మేరకు ఆయా విభాగాలకు నిధులు కేటాయిస్తున్నారు. జనవరి 9వ తేదీన సీఎం జగన్ అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించబోతున్నారు. అర్హులైన పేద విద్యార్థులకు ఏడాదికి రూ.15 వేలు అందజేస్తారు. అమ్మ ఒడి పథకం కోసం బడ్జెట్‌లో 6,455 కోట్లను ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే.

పెరిగిన పెన్షన్..

పెరిగిన పెన్షన్..

ఇచ్చిన హామీ మేరకు వృద్దుల పెన్షన్లను కూడా సీఎం జగన్ పెంచారు. గత ప్రభుత్వం పెన్షన్ల కోసం రూ.500 కోట్లు కేటాయిస్తే తమ ప్రభుత్వం రూ.1500 కోట్లు కేటాయిస్తోందని సీఎం జగన్ పేర్కొన్నారు. నవరత్నాలలో మరో కీలక పథకం పేదలకు ఇళ్లు. 25 లక్షల మంది పేదలకు ఉగాదినాటికి ఇళ్ల పట్టాలు అందజేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఇలా నవరత్నాల్లో కేటాయించిన పథకాలను ఒక్కొక్కటి సీఎం జగన్ నెరవేర్చుకుంటూ వస్తున్నారు. దీంతోపాటు తమ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని జగన్ భావిస్తున్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు హైకోర్టు ఓకే చెప్పడంతో.. సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఆయా జిల్లాలకు ఇంచార్జీ మంత్రులే పెద్ద దిక్కు అని పేర్కొన్నారు.

రెఫరెండమే..

రెఫరెండమే..

అధికార వైసీపీ సంక్షేమ పథకాలతో ముందుకెళ్లాలని భావిస్తుంటే టీడీపీ మాత్రం సర్కార్ ల్యూప్ హోల్స్ అస్త్రాలుగా మార్చుకొంటుంది. 8 నెలలో కాలంలో జరిగిన రాజధాని మార్పు, ఇసుక కొరత, మద్యం పాలసీ గురించి ప్రజలకు వివరించి అవగాహన కల్పించాలని టీడీపీ శ్రేణులు భావిస్తోన్నాయి. అమరావతి రాజధాని అనేది ఐదు కోట్ల ఆంధ్రుల అభిమతం అని.. దానిని సీఎం జగన్ మార్చేవిధంగా చర్యలు తీసుకోవడం సరికాదంటున్నారు. రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాలకు అమరావతి అనువుగా ఉంటుందని, దగ్గర ఉండే రాజధానిని వద్దని, కొత్త రాజధాని నిర్మించడం సరికాదని ప్రజల ముందు గొంతెత్తే అవకాశం ఉంది.

ఇసుక కొరత

ఇసుక కొరత


జగన్మోహన్ రెడ్డి సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడింది. దీంతో పదుల సంఖ్యలో భవన నిర్మాణ కార్మికులు ఆసువులు బాశారు. టీడీపీ, జనసేన నేతలు ప్రభుత్వ తీరును ఎండగడుతూ ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నం చేశారు. వైసీపీ ప్రభుత్వ పెద్దలే ఇసుకను బ్లాక్ చేశారని కూడా తీవ్రస్థాయిలో ఆరోపించారు. దీంతోపాటు మద్యం పాలసీతో ఒనగూరిన ప్రయోజనం ఏంటి అని ప్రశ్నించారు. రాత్రి 8 గంటలకు వైన్స్ క్లోజ్ చేసి.. బెల్ట్ షాపులు తెరుస్తున్నారని చెప్తున్నారు. దీంతో గతంలోకన్నా ఎక్కవ నష్టం జరుగుతోందన్నారు. ఒకవేళ వైసీపీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాకుంటే ఎన్నికను రెఫరెండంగా భావించాలని విపక్ష టీడీపీ డిమాండ్ చేస్తోంది.

English summary
in andhra pradesh which party won in ap local body polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X