• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టిట్ ఫర్ టాట్: జగన్‌కు సంచైత షాక్ -కోరి తెచ్చుకుంటే కారం పెట్టినట్లు కామెంట్లు -మార్పు తప్పదంటూ

|

ఏనాడో ఉత్తరాంధ్రను వదిలి వెళ్లిన ఆమెను వెతికిమరీ పట్టుకున్నారు.. తన కోసం అర్ధరాత్రి జీవోలిచ్చారు.. చట్టాలను సవరించి మరీ పెద్ద పీట వేశారు.. కోర్టుల నుంచి మొట్టికాయలు, ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తాయని తెలిసినా ఆమెవైపే నిలబడ్డారు.. ప్రత్యర్థిని దెబ్బ తీయడానికి ఆమెనొక ఆయుధంగా వాడుకున్నారు.. కానీ అంతలా కోరి తెచ్చుకున్న వ్యక్తే.. ఇవాళ కంట్లో నలుసులా, కారం పెట్టినట్లుగా కామెంట్లు చేస్తుంటూ వాపోవడం తప్ప వైసీపీకి మరో ఆప్షన్ లేకుండాపోయింది. అవును మనం మాట్లాడుతున్నది మన్సాస్, సింహాచలం దేవస్థానాల చైర్ పర్సన్ సంచైత గజపతిరాజు, ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ గురించే..

బీజేపీలోకి నటుడు రాజేంద్ర ప్రసాద్? -సోము వీర్రాజుతో భేటీ -నాడు చంద్రబాబుకు ముద్దు -జగన్‌పై రుసరుసబీజేపీలోకి నటుడు రాజేంద్ర ప్రసాద్? -సోము వీర్రాజుతో భేటీ -నాడు చంద్రబాబుకు ముద్దు -జగన్‌పై రుసరుస

మోదీకి జగన్ షాకిస్తే..

మోదీకి జగన్ షాకిస్తే..

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ దేశవ్యాప్తంగా రైతులు నిరసనలు చేస్తుండటం, అందులో భాగంగా మంగళవారం భారత్ బంద్ నిర్వహిస్తుండటం తెలిసిందే. సెప్టెంబర్ లో వ్యవసాయ బిల్లుల విషయంలో గొడవలొచ్చి ఎన్డీఏ మిత్రులు సైతం కేబినెట్ నుంచి వైదొలిగిన క్లిష్ట సమయంలో తామున్నామంటూ కేంద్రానికి వైసీపీ మద్దతు తెలిపింది. పార్లమెంటులో ఆ మూడు బిల్లులకు అనుకూలంగా ఓటు కూడా వేసింది.

సీన్ కట్ చేస్తే, మూడు నెలల తర్వాత.. రైతాంగం అవే చట్టాలకు వ్యతిరేకంగా పిలుపునిచ్చిన భారత్ బంద్ కు వైసీపీ మద్దతిచ్చింది. మంగళవారం నాటి భారత్ బంద్ ను ఏపీలో అధికారికంగా నిర్వహిస్తుననారు. తద్వారా ప్రధాని మోదీకి సీఎం జగన్ షాకిచ్చినట్లయింది. అయితే టిట్ ఫర్ టాట్ సామెత తరహాలో జగన్ కు సంచైత రిటర్న్ షాకిచ్చిందిలా..

మోదీకే నా మద్దతు..

మోదీకే నా మద్దతు..

అనువంశికతపై పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు వచ్చినా పట్టించుకోకుండా జగన్ సర్కారు సంచైత గజపతిరాజును మన్సాస్, సింహాచటం దేవస్థానం చైర్ పర్సన్ గా కొనసాగిస్తున్నది. అందుకు కృతజ్ఞతగా సంచైత సైతం తరచూ టీడీపీపై ఎదురుదాడికి దిగుతున్నారు. మన్సాస్, సిహాచలం అంశాల్లో చంద్రబాబు, అశోక్ గజపతిరాజులకు గట్టి కౌంటర్లిస్తూ వస్తున్నారు.

ఒక దశలో సంచైత వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు ప్రచారం జరిగినా.. తాను తొలి నుంచీ బీజేపీ సమర్థకురాలినని, ప్రధాని మోదీ మద్దతుదారునని ఆమె స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. మంగళవారం భారత్ బంద్ సందర్భంగా వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నవాళ్లను ఉద్దేశించి సంచైత కీలక కామెంట్లు చేశారు.

మోదీకి జగన్ భారీ షాక్:‘భారత్ బంద్'కు వైసీపీ మద్దతు -రైతుల పోరుకు రెస్పెక్ట్ -చంద్రబాబుపైనా తూటాలుమోదీకి జగన్ భారీ షాక్:‘భారత్ బంద్'కు వైసీపీ మద్దతు -రైతుల పోరుకు రెస్పెక్ట్ -చంద్రబాబుపైనా తూటాలు

మార్పు అవశ్యమనన సంచైత

మార్పు అవశ్యమనన సంచైత

అన్నదాత జీవితాల్లో మంచి మార్పుల కోసమే వ్యవసాయ చట్టాలను సంస్కరించామని, వీటిని వ్యతిరేకిస్తున్నవాళ్లంతా నవశకానికి అడ్డుపడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రాత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదే తరహాలో సంచైత గజపతిరాజు సైతం వ్యవసాయ రంగంలో సంస్కరణలు చాలా అవసరమని, ప్రస్తుత సంద్భంలో ప్రతి ఒక్కరూ ప్రధాని మోదీకి మద్దతుగా నిలబడాలని పిలుపునిచ్చారు. ‘‘ప్రతి మార్పు ముందుగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటుందని. కానీ ఆ మార్పు మంచి కోసమే అని గుర్తించాల్సి ఉంటుంది. దాన్ని అందరూ స్వాగతించాల్సిందే'' అని సంచైత పేర్కొన్నారు. భారత్ బంద్, వ్యవసాయ చట్టాల విషయంలో ఏపీ ప్రభుత్వం ఒకలా, ఆ ప్రభుత్వం చేత నియమితురాలైన సంచైత మరోలా వ్యవహరిస్తుండటం చర్చనీయాంశమైంది.

English summary
mansas trust chairperson sanchaita gajapathi raju, who appointed by ys jagan govt, supported farmer laws brought by the central government. while ap govt is observing bharath bandh officially, sanchaita differs with ysrcp line. she made key comments supporting pm modi on tuesday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X