వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింధుకు మద్దతుగా భారత్: ఏపీ, తెలంగాణ మాత్రం ఆమె కులం కోసం శోధించారు

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారత్‌ను పీవీ సింధు ప్రేమిస్తుంటే, ఇండియన్స్ మాత్రం కులాన్ని ప్రేమిస్తున్నారని గూగుల్ చెప్తోంది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ చేతిలో సింధు పరాజయం పాలైనా భారతీయుల హృదయాలను గెలుచుకుంటే 9 లక్షల మంది భారతీయులు మాత్రం సింధు కులం గురించి గూగుల్‌లో శోధించారట.

రియో దాకా సింధు ; సింధు కోసం..

రియో ఒలింపిక్స్‌లో భాగంగా గురువారం రాత్రి రియోలో బాడ్మింటన్ సింగిల్స్ సెమీ ఫైనల్‌లో జవరల్డ్ 10వ ర్యాంక్‌లో సిందు 21-19, 21-10తో ప్రపంచ 6వ ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్)ను ఓడించి సింధు ఫైనల్ చేరడం వరకు అంటే ఆగస్టు 14 నుంచి గూగుల్ ఎక్కువ మంది భారతీయులు సింధు కులం గురించే సెర్చ్ చేశారట.

3 కోట్లు, అమరావతిలో 1000 గజాలు: సింధుకు ఏపీ ప్రభుత్వం భారీ నజరానా3 కోట్లు, అమరావతిలో 1000 గజాలు: సింధుకు ఏపీ ప్రభుత్వం భారీ నజరానా

While India was rooting for PV Sindhu, Andhra Pradesh and Telangana were googling her caste

ఎప్పుడైతే జపాన్ క్రీడాకారిణిపై సింధు విజయం సాధించింది పైనల్‌కు చేరిందో ఈ శోధన మరింతగా పెరిగిందట. ఇక శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్ ఆడటానికి ముందు అయితే గూగుల్‌లో ఈ సెర్చ్ క్వరీ (Sindhu's caste - the search query)ని ఎక్కువ మంది ఉపయోగించారట.

అంతేకాదు రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధు ఫైనల్‌కు చేరడంతో ఆమె గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కూడా పెరిగిందట. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ స్వయంగా వెల్లడించడం విశేషం. సింధు విజయాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు కూడా తమదంటే తమవని చెప్పుకుంటున్నాయట.

While India was rooting for PV Sindhu, Andhra Pradesh and Telangana were googling her caste

అంతేకాదు సింధు ఆంధ్రా అమ్మాయా లేక తెలంగాణ అమ్మాయా అంటూ పెద్ద ఎత్తున చర్చకు కూడా తెరలేపారు. సింధు హైద‌రాబాద్‌లో పుట్టి పెరిగింది కాబట్టి ఆమె తెలంగాణ అమ్మాయి అని కొంద‌రంటున్నారు. దానికి ఆంధ్రా వాళ్లు సింధు వాళ్ల అమ్మది విజ‌య‌వాడ కాబట్టి ఆమె ఆంధ్రా అమ్మాయి అని కొంద‌రంటున్నారు.

సిల్వర్ మెడల్‌తో హృదయాలను గెలిచిన సింధు: ట్విట్టర్‌లో ఎవరేమన్నారు?

అయితే సింధు తల్లిదండ్రులు మాత్రం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. సింధు తండ్రి పేరు ర‌మ‌ణ‌. సింధు తండ్రి ర‌మ‌ణ తెలంగాణ‌లోని ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న‌ నిర్మ‌ల్‌లో జ‌న్మించారు. సింధు తండ్రి ర‌మ‌ణ ఓ స్పోర్ట్స్ ఆఫీస‌ర్. ద‌క్షిణ మ‌ధ్య రైల్వేలో ప‌నిచేస్తున్నారు. త‌ల్లి పేరు విజ‌య‌ల‌క్ష్మి.

While India was rooting for PV Sindhu, Andhra Pradesh and Telangana were googling her caste

భ‌ర్త త‌ర‌హాలోనే సింధు త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మి కూడా వాలీబాల్ ప్లేయ‌ర్‌. విజ‌య‌ల‌క్ష్మి మాత్రం విజ‌య‌వాడ వ్యాపార‌వేత్త కూతురు. ఇక సింధు సికింద్రాబాద్‌లో పుట్టింది. మారేడ్‌ప‌ల్లిలో ఆమె నివాసం. సింధు ఆంధ్రానా లేక తెలంగాణనా అని తేల్చడం కంటే ఓ భారతీయురాలిగా ఆమె ఒలింపిక్ ప‌త‌కం సాధించినందుకు మనమందరం గర్వపడాలి.

English summary
India loves PV Sindhu, but Indians love caste more, says Google. So while a billion of us were rooting for PV Sindhu to outclass Spain's Carolina Marin in Rio on Friday, about 9 lakh Indians back home were on Google looking up for her caste.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X