వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దొంగలే ఖంగుతిన్నారు: పోలీసులనే మోసగించబోయింది, ఇదో వెరైటీ క్రైమ్ స్టోరీ

గుంటూరు నగరంలో జరిగిన ఒక దొంగతనం పోలీసులను పరుగులు తీయించి చివరకు ఉసూరుమనిపించింది. కొర్నెపాడు గ్రామానికి చెందిన నేలటూరి దాసు, బొడ్డపాటి ప్రసాద్ అనే ఇద్దరు

|
Google Oneindia TeluguNews

అమరావతి: గుంటూరు లో జరిగిన బంగారు నగల దోపిడీ ఉదంతం పోలీసులకే చుక్కలు చూపించింది. గోల్డ్ అనుకొని రోల్డ్ గోల్డ్ కొట్టేసి బుక్కయిపోయారు ఇద్దరు. నగలు పోయాయని బోరుమంటుంటే పాపం వృద్దురాలనే సానుభూతితో అహర్నిశలు శ్రమించి ఆ దొంగలను పట్టుకున్నారు పోలీసులు.

ఆ తరువాత అసలు విషయం తెలిసి నివ్వెరపోయారు. బాధితురాలనే కనికరం చూపించిన తమనే ఆమె మోసగించబోయిందని తెలుసుకొని తెల్లబోయారు. మొత్తంగా ఈ దోపిడీ వ్యవహారం చూస్తే వెరైటీ కామెడీ క్రైమ్ స్టోరీని తలపించినా పోలీసులకు మాత్రం ట్రాజెడీలా మారింది.

చిన్ననాటి స్నేహితులు

చిన్ననాటి స్నేహితులు

వివరాల్లోకి వెళితే కొర్నెపాడు గ్రామానికి చెందిన నేలటూరి దాసు,బొడ్డపాటి ప్రసాద్ చిన్ననాటి స్నేహితులు. నేలటూరి దాసు మంగళగిరి ఓరియెంటల్ బ్యాంకులో అటెండర్ గా పనిచేస్తుండగా బొడ్డపాటి ప్రసాద్ గుంటూరులో బిఎస్సీ ఫైనలియర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో మంగళగిరికి చెందిన తాడిపత్రి ఇందుమతి అనే మహిళ భారీగా నగలు ధరించి తరుచు బ్యాంకుకు వస్తుండేది. ఆమె ఎప్పుడూ బంగారు నగలతోనే కనిపించడం గమనించిన అటెండర్ దాసు అవి ఎలాగైనా కొట్టెయ్యాలనుకున్నాడు.

ప్లాన్ ప్రకారం

ప్లాన్ ప్రకారం

ఆమెని మాటల్లో పెట్టి వంటల పోటీలంటే బాగా ఆసక్తి అని తెలుసుకున్నాడు. దీంతో ఆ బంగారు నగలను దొంగిలించడానికి తన స్నేహితుడైన ప్రసాద్ తో కలసి పథకం రచించాడు. ప్లాన్ ప్రకారం దాసు ఆమెకి అపరిచితుడిలా ఫోన్ చేసి గుంటూరులో వంటల పోటీల నిర్వాహకులమని మీరు వంటలు బాగా చేస్తారని తెలిసి ఫోన్ చేస్తున్నామని చెప్పారు. ఈ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిస్తే భారీ బహుమతులు ఉంటాయని నమ్మించారు. దీంతో ఇందుమతి పోటీల్లో పాల్గొంటానని , పోటీలు ఎప్పుడు, ఎక్కడ అనే వివరాలు తెలపాలని కోరింది. దీంతో తమ పథకం పారుతుందని సంతోషించిన దాసు అక్టోబర్ 27 తేదీన గుంటూరు బస్టాండ్ కు రావాలని, అక్కడకు వచ్చి ఫోన్ చేస్తే తామే పోటీల ప్రదేశం వద్దకు తీసుకెళతామని చెప్పారు.

బస్టాండుకు రాగానే

బస్టాండుకు రాగానే


ఆ ప్రకారమే ఇందుమతి గుంటూరు బస్టాండ్ కు రాగా అక్కడే ఉన్న దాసు ఆమె తనను గుర్తుపడుతుందని భావించి ప్రసాద్ ను ఆమె వద్దకు పంపించాడు. ప్రసాద్ వంటల కార్యక్రమానికి వెళదాం రమ్మంటూ ఇందుమతిని తన బైక్ పై ఎక్కించుకొని గుంటూరులో అనేక వీధుల గుండా తిప్పి చివరకు ఆంధ్రా ముస్లిం కాలేజీ వెనుక నిర్మానుష్యప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెని బెదిరించి మెడలోని బంగారు హారం,నల్లపూసల తాడు, సెల్ ఫోన్ తీసుకొని ఉడాయించాడు. దీంతో ఆమె పాతగుంటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

పోలీసుల శ్రమ వృధా

పోలీసుల శ్రమ వృధా

పట్టపగలు నేరస్తులు ఈ విధంగా చెలరేగిపోవడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు తీవ్రంగా శ్రమించి నగరాన్ని జల్లెడపట్టి ఎట్టకేలకు దొంగలను పట్టుకున్నారు. అయితే ఆ తర్వాత దొంగలు చెప్పింది విని అవాక్కయ్యారు. తాము దోచుకెళ్లిన బంగారు నగలను అమ్మేందుకు ప్రయత్నించగా అవి గోల్డ్ కాదని రోల్డ్ గోల్డ్ అని తేలిందని బావురుమన్నారు. వారు అబద్దం చెబుతున్నారని భావించిన పోలీసులు అసలు వాస్తవం తెలుసుకునేందుకు నగలు పోగొట్టుకున్న మహిళ ఇందుమతిని పిలిపించారు. మొదట తనవి బంగారు నగలే అని చెప్పిన ఆమె పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో అవి గిల్టు నగలేనని చెప్పింది. దీంతో తెల్లబోవటం పోలీసుల వంతయింది. మరి బంగారు నగలని ఎందుకు చెప్పావని ప్రశ్నించగా బంగారు గొలుసులు ఇస్తారనే ఆశతో అలా చెప్పాననడంతో పోలీసులే బిత్తరపోయారు. గోల్డ్ అయినా రోల్డ్ గోల్డ్ అయినా గొలుసు గొలుసేనని, దొంగతనం దొంగతనమేనని అంటూ దొంగలపై కేసులు, ఈ దొంగతనం చేధించిన పోలీసులకు రివార్డులు ప్రకటించారు. అయితే రోల్డ్ గోల్డ్ నగలను బంగారు నగలని చెప్పిన మహిళకు మరోసారి ఇలా చేయొద్దంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ విధంగా ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చినా, తప్పుడు ఫిర్యాదులు ఇచ్చినా వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొత్తానికి రోల్డ్ గోల్డ్ కొట్టేయబోయి ఒకరు ఉద్యోగం పోగొట్టుకోగా, మరో విద్యార్ధి కటకటాలపాయ్యాడు.

English summary
police arrested two young men, who steal rolled gold jewelry. But the victim woman said that the fake gold jewelery was original.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X