వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ పొలిటికల్ ఐడియా ఏమిటి, వెనక ఎవరు?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం ఖాయమైనట్లే కనిపిస్తోంది. ఈ నెల 14వ తేదీన తన రాజకీయ రంగ ప్రవేశంపై ప్రకటన చేయనున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం ఖాయమైందనే విషయాన్ని ధ్రువీకరిస్తూ హైదరాబాదులోని హైటెక్స్‌లో పవన్ కళ్యాణ్ పేర ఓ హాల్ బుక్కయినట్లు సమాచారం. హైటెక్స్ వేదికగా ఈ నెల 14వ తేదీ సాయంత్రం పవన్ కళ్యాణ్ తాను స్థాపించబోయే పార్టీని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

హైటెక్స్‌కు రావాలని పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లినట్లు కూడా తెలుస్తోంది. సాయంత్రం ఆరు గంటలకు పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం జరుగుతుంది. దాదాపు 45 నిమిషాల పాటు ఆయన ప్రసంగించే అవకాశాలున్నాయి. ఆ తర్వాత తాను రాజకీయాలపై రాసిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ అనుచరులతో పాటు పలువురు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్త హాజరవుతున్నట్లు తెలుస్తోంది.

Who behind Pawan Kalyan political idea?

కాగా, పవన్ కళ్యాణ్ రాజకీయ ఆరంగేట్రానికి సోదరుడు, సినీ నటుడు నాగబాబు మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. తెర వెనక వ్యహారమంతా సినీ దర్శకుడు త్రివిక్రమ్ చూస్తున్నట్లు వినికిడి. గతంలో పరుచూరి బ్రదర్స్, త్రిపురనేని మహారథి ఇటువంటి పనులు చేసేవారు. అదిరిపోయే, పంచ్ పొలిటికల్ డైలాగులు తయారు చేసి పెట్టేవారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కు త్రివిక్రమ్ ఆ పని చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే, పవన్ కళ్యాణ్ నేరుగా పార్టీ పేరును ప్రకటిస్తారా, స్వతంత్రంగా అభ్యర్థులను రంగంలోకి దింపి తాను దిగుతారా అనేది స్పష్టం కావడం లేదు. మొదటి పథకం ప్రకారమైతే, స్వతంత్ర అభ్యర్థులను రంగంలోకి దింపి, రాజకీయాలను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత, తాను పోటీకి దించినవారి వ్యవహార శైలి చూసిన తర్వాత పార్టీ పేరును ప్రకటించాలని అనుకున్నట్లు సమాచారం. రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులను బరిలోకి దింపి, మూడేళ్ల తర్వాత రాజకీయ పార్టీని స్థాపించాలని ఆయన అనుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఆయన వ్యూహం ఏమైనా మారిందా అనేది తెలియదు. నేరుగా పార్టీ పేరును ప్రకటించే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీకి దిగకూడదని కూడా ఆయన అనుకుంటున్నారు. తాను మల్కాజిగిరి నుంచి లేదా అనకాపల్లి నుంచి లోకసభకు పోటీ చేసి, 25 మందిని శాసనసభ బరిలోకి దింపుతారని భావించారు. కానీ, ఇప్పుడు అది మారినట్లు తెలుస్తోంది. 9 లోకసభ స్థానాలకు, 40 శాసనసభ స్థానాలకు పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.

English summary
It is said that Pawan Kalyan has decided to enter into politics and director Trivikram is working behind his political entry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X