చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎవరు ముసలాడో అక్కడ తేల్చేద్దాం - సీఎం జగన్ కు లోకేష్ సవాల్..!!

ఎవరు ముసలాడో..ఎవరు యువకుడో తేల్చేందుకు సిద్దమని, ముఖ్యమంత్రి సిద్దమేనా అంటూ లోకేష్ సవాల్ చేసారు.

|
Google Oneindia TeluguNews

టీడీపీ నేత నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి జగన్ తాజాగా పల్నాడు జిల్లా పర్యటనలో చంద్రబాబును ముసలాయన ప్రభుత్వంలో అంటూ చేసిన వ్యాఖ్యల పైన లోకేష్ స్పందించారు. ఎవరు యువకుడో..ఎవరు ముసలాడో తేల్చుదామంటూ ఒక సవాల్ చేసారు. అందుకు ముఖ్యమంత్రి సిద్దమా అని ప్రశ్నించారు. యువగళం పాదయాత్రలో భాగంగా లోకేష్ పూతలపట్టు నియోజకవర్గం వజ్రాలపల్లి క్యాంప్ సైట్ లో బీసీ సామాజికవర్గం ప్రతినిధులతో భేటీ అయ్యారు. తాను సీఎం జగన్ లాగా మోసపు హామీలు ఇవ్వనన్నారు. టీడీపీ హయాంలోనే బీసీలకు నిజమైన మేలు జరిగిందని చెప్పుకొచ్చారు. వైసీపీ పాలనలో బీసీలకు జరిగిన అన్యాయం గురించి వివరించారు.

మోసపు హామీలు ఇవ్వను..

మోసపు హామీలు ఇవ్వను..


లోకేష్ యువగళం పాదయాత్రలో భాగంగా పలు సామాజిక వర్గాలు..సంఘాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీసీ సామాజిక వర్గ నేతలతో సమావేశమైన లోకేష్ టీడీపీ లోనే బీసీలకు నిజంగా మేలు జరిగిందని వివరించారు. టీడీపీ పాలనలోనే బీసీలకు నిజమైన స్వాతంత్య్రం వచ్చిందన్నారు. తాను సీఎం జగన్ లా మోసపు హామీలు ఇవ్వనని చెప్పారు. టిడిపి పాలనలో బిసిలకు ఇచ్చినన్న నిధులు ఎవ్వరూ ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన జగన్ రెడ్డి ఒక్క బీసీ కి ఒక్క లోన్ అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. 45 ఏళ్లకే బీసీ మహిళలకు పెన్షన్ ఇస్తా అని మోసం చేశారని ఆరోపించారు.
రిజర్వేషన్లు 10 శాతం తగ్గించి 16,500 మందిని జగన్ పదవులకి బీసీలను దూరం చేసారని విమర్శించారు. విదేశీ విద్య పథకం రద్దు చేసి బీసీలను మోసం చేశారని లోకేష్ వ్యాఖ్యానించారు.

సలహాదారులుగా బీసీలు ఉండకూడదా..

సలహాదారులుగా బీసీలు ఉండకూడదా..


ముఖ్యమంత్రి జగన్ తన సొంత సామాజిక వర్గానికి చెందిన వారికి వందల సంఖ్యలో పదవులు ఇచ్చారని లోకేష్ ఆరోపించారు. సలహాదారులుగా ఉండటానికి బీసీలు సరిపోరా అని నిలదీసారు. బీసీ కార్పొరేషన్ ద్వారా ఎన్ని లోన్స్ ఇచ్చారో జగన్ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చెయ్యాలని డిమాండ్ చేసారు. బీసీలకు ఎవరు ఏం చేసారో చర్చకు తాను సిద్దమని.. మంత్రి వేణుగోపాల్ ముందుకు వస్తే చర్చిద్దామని లోకేష్ స్పష్టం చేసారు. ఆదరణ పథకం నిలిపేశారన్నారు. పనిముట్లు ఇవ్వలేదని... బీసీలు కట్టిన 10 శాతం సొమ్ము కు తిరిగి ఇవ్వడం లేదని నిలదీసారు. బీసీలకు కులం సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా జగన్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు. స్వర్ణకారులను ఆదుకోవడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేస్తామని చెప్పారు. ఉప కులాల వారీగా కమ్యూనిటీ హాల్స్ కావాలి అని అడిగారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే నిర్మిస్తామని లోకేష్ చెప్పుకొచ్చారు. బీసీల్లో పేదరికం లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు.

ముసలోడు ఎవరో తేలాలంటే తిరుమల కొండ ఎక్కాలి

ముసలోడు ఎవరో తేలాలంటే తిరుమల కొండ ఎక్కాలి


ముఖ్యమంత్రి కొద్ది రోజులుగా గత ముసలాయన పాలన అంటూ పరోక్షంగా చంద్రబాబును ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యల పైన లోకేష్ స్పందించారు. చంద్రబాబుతో పోటీ పడి తిరుమల కొండ ఎక్కే దమ్ము జగన్ కు ఉందా అని లోకేష్ ప్రశ్నించారు. అక్కేడ ఎవరు ముసలాడో..ఎవరు యువకుడో తెలిసిపోతుందని వ్యాఖ్యానించారు. బీసీలకు జగన్ తగ్గించిన రిజర్వేషన్లను తిరిగి పెంచుతామని లోకేష్ హామీ ఇచ్చారు. 175 నియోజకవర్గాల్లో నేను తిరుగుతా ఒక్కో కేసు ఎందుకు ఒకే సారి 175 కేసులు పెట్టుకోవాలని ప్రభుత్వానికి సవాల్ చేసారు. గత నెల 27వ తేదీన కుప్పం నుంచి ప్రారంభమైన లోకేష్ పాదయాత్ర ప్రస్తుతం పూతల పట్టు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ప్రభుత్వ వైఫల్యాలు లక్ష్యంగా లోకేష్ ప్రసంగాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు లోకేష్ చేసిన ఛాలెంజ్ పైన వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

English summary
Lokesh Challegnes CM Jagan to walk equally with Chandrababu on Tirupati hill shrine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X