వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కస్టడీకి: రేవంత్ బాస్‌పై ఏసీబీ ప్రశ్నావళి? గవర్నర్‌తో కేసీఆర్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నోటుకు ఓటు వ్యవహారంలో అరెస్టైన రేవంత్ రెడ్డిని ఏసీబీ అధికారులు తమ కస్టడీకి తీసుకున్నారు. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు అధికారులు జైలు అధికారులకు కోర్టు కాపీని అందజేసి కస్టడీకి తీసుకున్నారు.

రేవంత్ రెడ్డితో పాటు సెబాస్టియన్, ఉదయ్ సిన్హాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని లాయర్ల సమక్షంలో విచారించనున్నారు. రేవంత్ రెడ్డిని ప్రశ్నించేందుకు ఏసీబీ ప్రత్యేక ప్రశ్నావళిని తయారు చేసుసుంది. కాగా, రేవంత్‌ను చర్లపల్లి జైలులో విచారిస్తున్నారని తెలుస్తోంది. సెబాస్టియన్, ఉదయ్ సిన్హాలను ఏసీబీ కార్యాలయానికి తరలించారని తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

నోటుకు ఓటు వ్యవహారంలో అరెస్టైన రేవంత్ రెడ్డిని ఏసీబీ అధికారులు తమ కస్టడీకి తీసుకున్నారు. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు అధికారులు జైలు అధికారులకు కోర్టు కాపీని అందజేసి కస్టడీకి తీసుకున్నారు.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డితో పాటు సెబాస్టియన్, ఉదయ్ సిన్హాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని లాయర్ల సమక్షంలో విచారించనున్నారు.

కేసీఆర్ - గవర్నర్

కేసీఆర్ - గవర్నర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం నాడు గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. రాష్ట్ర అవతరణ ముగింపు వేడుకలకు ఆహ్వానం పలికారు. పట్టాల పంపిణీపై నివేదిక ఇచ్చారు.

కేసీఆర్ - గవర్నర్

కేసీఆర్ - గవర్నర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం నాడు గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ఈ సందర్భంగా తాజా రాజకీయాలపై చర్చించారు.

కాగా, విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు బాస్‌ పైనే దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. రేవంత్‌ రెడ్డి పదేపదే ప్రస్తావించిన బాస్‌ ఎవరు? అనే విషయం తెలుసుకునేందుకు వీలుగా ప్రశ్నావళి సిద్ధమైనట్లు సమాచారం.

బాస్ ఎవరనేది తేలితే కేసులో కొత్త కోణం వెలుగులోకి వస్తుందని ఏసీబీ భావిస్తోంది. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్సన్‌కు ఇచ్చిన రూ.50 లక్షలు ఎక్కడివి? ఎక్కడి నుంచి తెచ్చారు? ఓటింగ్‌ తర్వాత ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్న రూ.4.50 కోట్లు ఎక్కడున్నాయి? వాటిని ఎవరు తెచ్చి ఇచ్చేందుకు సిద్ధమయ్యారనే అంశాలపై ఎక్కువ దృష్టిసారించనుందని తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి‌, ఇతర నిందితుల విచారణలో వెల్లడైన అంశాలు, కాల్‌ డేటా ఆధారంగా మరికొంత మందిని అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వీరి విచారణ తర్వాత మత్తయ్యను అరెస్ట్‌ చేసే అవకాశముంది. కాగా, శుక్రవారం నాడు సీఎం కేసీఆర్ గవర్నర్‌ను కలిశారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారని సమాచారం.

English summary
Who is Revanth Reddy's 'BOSS'?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X