వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెచ్చిపోతున్న మహేష్ కత్తి‌: వెనుక బలమైన శక్తి, పవన్ కళ్యాణ్‌పై ప్లాన్‌తో రంగంలోకి?

|
Google Oneindia TeluguNews

Recommended Video

పవన్ కల్యాణ్‌పై పోటీ చేస్తా : నడిరోడ్డు మీద కాల్చి చంపినా తప్పులేదు పై మహేష్ కత్తి !

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు హెచ్చరిస్తున్నా మహేష్ కత్తి.. జనసేనానిపై ఎందుకు మాటల దాడి చేస్తున్నారు? అభిమానులు ఉద్రేకంతో చేస్తున్న మాటలను పక్కన పెట్టి సినీ రంగంలో ఓ స్థానంలో ఉన్న మహేష్ కత్తి పూనకం వచ్చినట్లుగా ఎందుకు ఊగిపోతున్నారు? పదేపదే పవన్ కళ్యాణ్‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?

ఇప్పుడు ఈ చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తన వెనుక ఏ రాజకీయ పార్టీ లేదని మహేష్ కత్తి చెబుతున్నప్పటికీ.. ఆయన ఇంతగా పవన్‌పై పదేపదే టార్గెట్ చేయడం వెనుక ఏదో బలమైన శక్తి ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. ఆయన వెనుక ఎవరో ఉన్నారని అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వైపే అందరి చూపు ఉంది. కానీ, ఆ విషయం స్పష్టంగా తేలడం లేదు. పవన్ కల్యాణ్ అబిమానులు ఆ అనుమానాలనే వ్యక్తం చేస్తున్నారు గానీ నేరుగా అనడం లేదు.

 మహేష్ కత్తి వెనుక ఉన్నారనడానికి.. ఏదో దాగి ఉందని డౌట్స్

మహేష్ కత్తి వెనుక ఉన్నారనడానికి.. ఏదో దాగి ఉందని డౌట్స్

మహేష్ కత్తి వెనుక ఏవో బలమైన శక్తులు ఉన్నాయని చెప్పడానికి పలు కారణాలను చూపిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ ఆరంగేట్రం నేపథ్యంలో ఆయనను పదేపదే టార్గెట్ చేయడం వెనుక ఏదో దాగి ఉందని అంటున్నారు. మహేష్ కత్తి పదేపదే అంటే ఎక్కువగా పవన్‌నే టార్గెట్ చేస్తున్న విషయాన్ని గమనించాలని అంటున్నారు.

 ప్రచారంతో పాటు మరో బలమైన కారణం

ప్రచారంతో పాటు మరో బలమైన కారణం

మహేష్ కత్తి.. జనసేనానిని టార్గెట్ చేయడం వెనుక రెండు లాభాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటి ఆయనకు పెద్ద ఎత్తున ప్రచారం. ఇప్పటి దాకా వినిపిస్తున్న మాట.. పవన్ పేరుతో మహేష్ కత్తి హైప్ సాధించాలని అనుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. అయితే దీంతో పాటు మరో బలమైన కారణం ఉందని అంటున్నారు.

 పవన్ రాజకీయాల్లో కీలకంగా మారుదామనుకున్న సమయంలోనే

పవన్ రాజకీయాల్లో కీలకంగా మారుదామనుకున్న సమయంలోనే

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి మూడేళ్లవుతోంది. 2019 ఎన్నికల కోసం ఆయన సమాయత్తమవుతున్నారు. ఇందుకోసం సినిమాలు కూడా మానేస్తానని గతంలోను చెప్పారు. ఇటీవల స్పష్టత ఇచ్చారు. పవన్ పార్టీ పెట్టి 2014లో పోటీకి దూరంగా ఉన్నప్పటికీ.. మరుసటి ఎన్నికల్లో (2019) పోటీ చేస్తారనేది అందరికీ తెలిసిపోయింది. ఆ తర్వాత పవన్ సినిమాలు పక్కన పెట్టేసి ఇక రాజకీయాలపై దృష్టి సారించేందుకు ఇటీవల సిద్ధమయ్యారు. ఇలాంటి సమయంలో మహేష్ కత్తి పదేపదే టార్గెట్ చేస్తున్న విషయాన్ని గుర్తించాలని కొందరు అంటున్నారు.

 2019లో పవన్ ఎటువైపు ఉంటారో స్పష్టత లేదు

2019లో పవన్ ఎటువైపు ఉంటారో స్పష్టత లేదు

పవన్ కళ్యాణ్ అందరి రాజకీయ నాయకుల్లా కాకుండా కొత్తగా ముందుకు సాగుతున్నారు. పదవులకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆయన మాట తీరు, ఇప్పటి వరకు ఆయన ప్రభుత్వాలను నిలదీసిన తీరును బట్టి అర్థమవుతోంది. ఆయన మద్దతు కోసం టీడీపీ, బీజేపీ, లెఫ్ట్‌తో పాటు వివిధ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆయన ఆలోచనలు పక్కా లౌకికవాదిని తలపిస్తాయి. ఈ నేపథ్యంలో ఆయన వచ్చే ఎన్నికల్లో ఎవరితో వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది.

 బలమైన రాజకీయ శక్తి ఉందా

బలమైన రాజకీయ శక్తి ఉందా

అజ్ఞాతవాసి సినిమాను పూర్తి చేసి, ఇప్పుడిప్పుడే రాజకీయ రణరంగంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టడానికి పవన్ ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రచారం మొదటి నుంచి జరుగుతోంది. ఇలాంటి సమయంలో మహేష్ కత్తి పదేపదే ఆయనను టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి మహేష్ కత్తి వెనుక ఏదో బలమైన రాజకీయ శక్తి ఉందా అనే చర్చ కూడా సాగుతోంది. అదే నిజమైతే ఆ రాజకీయ శక్తి ఏమిటి అనేది తేలాల్సి ఉందని అంటున్నారు.

 పక్కా ప్లాన్‌తో రంగంలోకి దింపారా?

పక్కా ప్లాన్‌తో రంగంలోకి దింపారా?

2019 ఎన్నికలకు పవన్ సిద్ధమవుతున్న సమయంలో ఆయన ఇమేజ్‌ను డామేజ్ చేసేందుకు, ఆయనను రాజకీయంగా దెబ్బతీసేందుకు పక్కా ప్లాన్‌తో కత్తి మహేష్‌ను ఎవరైనా రంగంలోకి దింపారా అనే చర్చ సాగుతోంది. ఈ వాదనలను కత్తి మహేష్ మాత్రం కొట్టి పారేస్తున్నారు. తన వెనుక ఏ రాజకీయ పార్టీ లేదని చెబుతున్నారు.

పదేపదే వారినే టార్గెట్

మహేష్ కత్తి జనసేనానితో పాటు చంద్రబాబు ప్రభుత్వాన్ని కూడా కొన్నిసార్లు టార్గెట్ చేశారు. ప్రత్యేక హోదా విషయంలోను పవన్, చంద్రబాబులను నిలదీశారు. అదే వైసీపీ అధినేత జగన్‌ను మెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని అంటున్నారు. హోదా కోసం జగన్, శివాజీ, చలసాని శ్రీనివాస్ మాత్రమే పోరాడుతున్నారని గతంలో పేర్కొన్నారని అంటున్నారు. హోదా అంశంపై చంద్రబాబు, పవన్, మోడీలతో పాటు జగన్‌ను కూడా నిలదీయాలని, గతంలో హోదా కోసం రాజీనామా చేస్తానని చెప్పిన జగన్ తన ఎంపీలతో ఎందుకు రాజీనామా చేయించలేదనే ప్రశ్నలు ఉన్నాయి. కానీ మహేష్ కత్తి ఆయనను విమర్శించిన సందర్భాలు తెలిసి అయితే లేవని అంటున్నారు.

 ఆ బలమైన శక్తి ఏమిటి

ఆ బలమైన శక్తి ఏమిటి

వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బరిలో నిలిస్తే అధికారంలో ఉన్న టీడీపీతో పాటు ప్రతిపక్ష వైసీపీకి, బీజేపీ.. ఇలా అన్ని పార్టీలకు నష్టమే. దీంతో మహేష్ కత్తి వెనుక నిజంగానే రాజకీయ శక్తి ఉంటే ఆ బలమైన శక్తి ఎవరు అనే చర్చ సాగుతోంది. దీనికి కాలమే సమాధానం చెబుతుందని అంటున్నారు. మహేష్ కత్తి మాత్రం తన వెనుక ఏ రాజకీయ శక్తి లేదని, ఓ సినిమా హీరో రాజకీయ నాయకుడు అయిప్పుడు సినీ విమర్శకుడు రాజకీయ విమర్శకుడు కావొద్దా అని చెబుతున్నారు.

English summary
Who is The Person Behind The Mahesh Kathi? Why he is targetting Jana sena chief Pawan Kalyan again and again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X