అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజధానికి ఆ పేరు సూచించింది ఆయనే!: మహానాడులో మరోసారి గుర్తు చేసుకున్న బాబు..

అమరావతి పేరు వెనుక ఉన్న చరిత్రను, దాని ప్రస్థానాన్ని రామోజీరావు తనకు సవివరంగా రాసి పంపించారని, ఆ ప్రాముఖ్యతను గుర్తించినందువల్లే రాజధానికి ఆ పేరు ఖరారు చేశామని సీఎం గతంలో చెప్పిన సంగతి తెలిసిందే.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ఆ పేరును సూచించెదెవరో.. మహానాడు వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బయటపెట్టారు. మీడియా మొఘల్ గా చెప్పుకునే ఈనాడు సంస్థల అధినేత రామోజీరావే ఆ పేరును సూచించారని సీఎం స్వయంగా వెల్లడించారు.

గతంలోనే ఈ విషయాన్ని వెల్లడించినప్పటికీ.. విశాఖలో మహానాడు చివరి రోజు సందర్భంగా సీఎం మరోసారి దాన్ని గుర్తు చేసుకున్నారు.అమరావతి పేరు వెనుక ఉన్న చరిత్రను, దాని ప్రస్థానాన్ని రామోజీరావు తనకు సవివరంగా రాసి పంపించారని, ఆ ప్రాముఖ్యతను గుర్తించినందువల్లే రాజధానికి ఆ పేరు ఖరారు చేశామని సీఎం గతంలో చెప్పిన సంగతి తెలిసిందే.

కాగా, రాజధాని కోసం ఎంచుకున్న ప్రాంతం అమరధామం అమరావతికి సమీపంలో ఉండటం కూడా ఈ పేరును ఎంచుకోవడానికి మరో కారణం. చరిత్ర పరంగాను అమరావతికి ఘనమైన గుర్తింపు ఉంది. శాతవాహనుల రాజధానిగా 400 ఏండ్లకు పైగా గుర్తింపు, చారిత్రక, పౌరాణిక వైభవంతో పాటు ఇంద్రుడు పాలించిన నగరమన్న ప్రచారం ఉన్న సంగతి తెలిసిందే. ఇదే ప్రాంతంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పేరిట గ‌తంలో గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి రాజ‌ధాని ఉండేదని కూడా చెబుతారు.

who suggested name for ap capital, chandrababu revealed again

ఇన్ని ప్రత్యేకతలతో ముడిపడి ఉన్నది కాబట్టే.. ఏపీ ప్రభుత్వం అమరావతిని రాజధానికి అనువైనదిగా ఎంచుకుంది. అయితే పర్యావరణ రీత్యా గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి మాత్రం రాజధాని పట్ల అభ్యంతరాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. రాజధానికి ఇది అనువైన ప్రాంతం కాదంటూ గ్రీన్ ట్రిబ్యునల్

కాగా, ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఎక్కడ నిర్మించాలనే విషయంపై ప్రభుత్వం తొలుత తీవ్ర తర్జనభర్జనలు పడిన సంగతి తెలిసిందే. పలుమార్లు సమాలోచనలు జరిపిన తర్వాత.. చివరకు కృష్ణా-గుంటూరు జిల్లాల మ‌ధ్య వెల‌గ‌పూడి కేంద్రంగా రాజధాని నగరం నిర్మిస్తే బాగుంటుందని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. అనుకున్నట్లుగానే ఇందుకోసం రాజధాని పరిధిలో 33వేల ఎకరాలను అధికారులు సేకరించారు.

English summary
AP CM Chandrababu Naidu again cleared that the name of Amaravati was suggested by Eenadu MD Ramoji Rao. On the last day of Mahanadu event he said this matter
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X