India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్ర‌బాబునాయుడి మాట విన‌ని ఆ మాజీ మంత్రి ఎవ‌రు?

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడి మాట విన‌నంటున్నారు ఆ మాజీ మంత్రి. ఎట్టి ప‌రిస్థితుల్లోను ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని, 160 సీట్లు సాధించ‌డం ఖాయ‌మ‌ని, ఆ త‌ర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల వీపులు ప‌గ‌ల‌డం ఖాయ‌మ‌న్నారు. ఎన్ని జ‌న్మ‌లెత్తినా జ‌గ‌న్ మళ్లీ ముఖ్య‌మంత్రి కాలేర‌ని, ఆయ‌న్ను త‌రిమి కొట్ట‌డానికి ఈ రాష్ట్ర ప్ర‌జ‌లంతా సిద్ధంగా ఉన్నార‌ని, ఈసారి బాబు మాట విన‌నందుకు ముందే మ‌మ్మ‌ల్ని క్ష‌మించాల‌ని కోరుతున్నామంటున్నారు గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, సీనియ‌ర్ నేత ప్ర‌త్తిపాటి పుల్లారావు.

1పార్టీ కేంద్ర కార్యాల‌యంపైనే దాడి

1పార్టీ కేంద్ర కార్యాల‌యంపైనే దాడి


ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అధికారం చేప‌ట్టిన త‌ర్వాత తెలుగుదేశం పార్టీ నేత‌ల‌పై దాడులు పెరిగిపోయాయ‌నేది రాజ‌కీయ విశ్లేష‌కుల భావ‌న‌గా ఉంది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాల‌యంపై నేరుగా వైసీపీ శ్రేణులు దాడులకు దిగిన సంగ‌తి తెలిసిందే. ప‌ల్నాడులో పార్టీ కార్య‌ర్త జాల‌య్య‌ను వెంట‌ప‌డి వేట‌కొడ‌వ‌ళ్ల‌తో న‌రికారు. ఈ సంఘ‌ట‌న రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. తాజాగా న‌ర్సీప‌ట్నంలో అయ్య‌న్న‌పాత్రుడి ఇంటిగోడ‌ను కూల్చివేసిన సంఘ‌ట‌న ఒక‌ర‌కంగా రాష్ట్ర‌వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల‌ను సంఘ‌టిత‌ప‌రిచింద‌ని చెప్ప‌వ‌చ్చు.

త‌ప్పు చేసిన‌వారినెవ‌రినీ వ‌దిలే ప్ర‌స‌క్తే లేదు!!

త‌ప్పు చేసిన‌వారినెవ‌రినీ వ‌దిలే ప్ర‌స‌క్తే లేదు!!


వైసీపీలో ఇప్ప‌టివ‌ర‌కు త‌ప్పు చేసిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లెవ‌రినీ వ‌దిలే ప్ర‌స‌క్తే లేద‌ని, తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే వారికి త‌గిన‌రీతిలో బుద్ధిచెబుతామ‌ని ప్ర‌త్తిపాటి పుల్లారావు హెచ్చ‌రించారు. ఆరోజులు కూడా ద‌గ్గ‌ర‌లోనే ఉన్నాయ‌ని హెచ్చ‌రించారు. సాధార‌ణంగా సౌమ్యంగా ఉండే ప్ర‌త్తిపాటి పుల్లారావు ఆగ్ర‌హంగా, ఆవేశంతో మాట్లాడ‌టంతో చిల‌క‌లూరిపేట టీడీపీ కార్య‌క‌ర్త‌ల్లో ఉత్సాహం నెల‌కొంద‌ని ఆ పార్టీ నేత‌లు అంటున్నారు.

పుల్లారావుపై ఎస్సీ, ఎస్టీ కేసు న‌మోదు

పుల్లారావుపై ఎస్సీ, ఎస్టీ కేసు న‌మోదు


ఇటీవ‌లే పుల్లారావుపై ఎస్సీ, ఎస్టీ కేసును న‌మోదు చేశారు. ప‌ట్ట‌ణంలో ఎన్టీఆర్ సుజ‌ల స్ర‌వంతి ప‌థ‌కం కింద గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఏర్పాటు చేసిన వాట‌ర్ ప్లాంట్ పునః ప్రారంభం సంద‌ర్భంగా పుర‌పాల‌క‌శాఖ అధికారుల‌కు, పుల్లారావుకు మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. ఈ ప్రాంతంలో వేసిన బోర్ల‌కు అనుమ‌తులు లేవ‌ని అడ్డం చెప్పారు. త‌న‌ను కులం పేరుతో దూషించారంటూ టౌన్‌ప్లానింగ్ అధికారి కోడిరెక్క సునీత పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును న‌మోదు చేశారు. ఈ త‌ర‌హా కేసులు తెలుగుదేశం పార్టీ నేత‌ల‌ను ఏమీ చేయ‌లేవ‌ని, అందులో నిజ‌మెంతో ఇక్క‌డున్న నేత‌లంద‌రికీ, చివ‌ర‌కు అధికారుల‌కు కూడా తెలుస‌ని పుల్లారావు వ్యాఖ్యానించారు. కులంపేరుతో వ్య‌క్తుల‌ను దూషించేంత స్థాయికి తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌లు దిగ‌జారిపోలేద‌న్నారు.

English summary
Who was the former minister who did not listen to Chandrababu Naidu? why the reason here is all
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X