వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు ఎఫెక్ట్: కేంద్ర మంత్రివర్గంలో బెర్త్ ఎవరికీ, అదృష్టవంతులు వీరేనా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి:కేంద్ర మంత్రివర్గం నుండి టిడిపి వైదొలగడంతో ఏపీకి చెందిన బిజెపి ఎంపీలకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతోందా అనే చర్చ సర్వత్రా సాగుతోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుండి కేంద్ర మంత్రివర్గంలో చోటు లేకుండా పోయింది.

ఏపీకి అండగా ఉంటా:మోడీ, రాజీనామాలకు కారణమిదే: సుజనా, ఆశోక్ఏపీకి అండగా ఉంటా:మోడీ, రాజీనామాలకు కారణమిదే: సుజనా, ఆశోక్

2014 ఎన్నికల్లో టిడిపి, బిజెపి కూటమిగా పోటీ చేశాయి.బిజెపి నేతృత్వంలో ఎన్డీఏ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది.ఎన్డీఏ ప్రభుత్వంలో ఆ సమయంలో టిడిపి చేరింది. సుజనా చౌదరి, ఆశోక్ గజపతిరాజులు కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. ఏపీ రాష్ట్రంలోని టిడిపి ప్రభుత్వంలో ఇద్దరు బిజెపి ఎమ్మెల్యేలు చేరారు. కేంద్ర, రాష్ట్రాల్లో టిడిపి, బిజెపి మంత్రులు వైదొలిగారు.

రంగంలోకి అమిత్ షా: ఏపీ పరిణామాలపై ఆరా, ఆ ఫోన్ తర్వాతే రాజీనామారంగంలోకి అమిత్ షా: ఏపీ పరిణామాలపై ఆరా, ఆ ఫోన్ తర్వాతే రాజీనామా

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుండి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిథ్యం లేకుండా పోయింది. గతంలో తెలంగాణ రాష్ట్రం నుండి బండారు దత్తాత్రేయ కేంద్ర మంత్రిగా కొనసాగారు. కానీ, గత ఏడాది మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో దత్తాత్రేయను మంత్రివర్గంలో చోటు కోల్పోయారు.

కేంద్రమంత్రివర్గంలో ఎంపీలకు చోటు దక్కేనా

కేంద్రమంత్రివర్గంలో ఎంపీలకు చోటు దక్కేనా

కేంద్ర మంత్రివర్గంలో బిజెపి ఎంపీలకు చోటు దక్కుతోందా అనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం టిడిపి కేంద్ర మంత్రివర్గం నుండి వైదొలిగింది. ఏపీ రాష్ట్రం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీలకు కేంద్ర మంత్రివర్గం నుండి చోటు దక్కుతోందా అనే చర్చ సాగుతోంది. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నందున ఏపీ నుండి ప్రాతినిథ్యం కోసం మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ చోటు చేసుకొనే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు ఉన్నాయి.

అదృష్టవంతులెవరో

అదృష్టవంతులెవరో


కేంద్ర మంత్రి వర్గంలో ఏపీ రాష్ట్రం నుండి ప్రాతినిథ్యం లేకుండా పోయింది. అయితే బిజెపి నుండి ఏపీ రాష్ట్రం నుండి ఇద్దరు ఎంపీలున్నారు. విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబుకు గత మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ సమయంలోనే హరిబాబుకు మంత్రివర్గంలో చోటు దక్కనుందనే ప్రచారం సాగింది. అయితే కానీ, ఈ దఫా రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో హరిబాబుకు చోటు దక్కే అవకాశాలున్నాయనే ప్రచారం సాగుతోంది.

తెలంగాణకు మరోసారి మంత్రి పదవి దక్కేనా

తెలంగాణకు మరోసారి మంత్రి పదవి దక్కేనా


గతంలో కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు నుండి బండారు దత్తాత్రేయ ప్రాతినిథ్యం వహించారు. కానీ, పార్టీ అవసరాల రీత్యా దత్తాత్రేయను కేంద్ర మంత్రివర్గం నుండి తప్పించారు. అయితే ఈ పరిణామం కొంత తెలంగాణ పార్టీ నేతల్లో అసంతృప్తిని గురి చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కేంద్ర మంత్రి వర్గంలో చోటు ఎవరికీ దక్కుతోందనే చర్చ ప్రస్తుతం నెలకొంది.

మురళీధర్ రావు, రాం మాధవ్ పేర్లు

మురళీధర్ రావు, రాం మాధవ్ పేర్లు


కేంద్ర మంత్రివర్గంలోకి బిజెపి జాతీయ ప్రధానకార్యదర్శులుగా ఉన్న మురళీధర్ రావు, రామ్ మాధవ్ ల పేర్లు కూడ విన్పిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణలో వీరిద్దరి పేర్లు కూడ బిజెపి నేతలు పరిశీలించే అవకాశం లేకపోలేదనే చర్చ కూడ ఉంది. అయితే ఏపీలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని హరిబాబుకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంటుందని బిజెపి వర్గాల్లో ప్రచారంలో ఉంది.

English summary
Who will get union cabinet berth from Telugu states. After Tdp quit from union cabinet noone in union cabinet from Ap state. Last year Bjp leadership revmoved Bandaru Dhattreya from union cabinet, Dhattreya got berth from Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X