వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పునఃస‌మీక్ష‌పై వ‌ణుకెందుకు? సాయిరెడ్డి

|
Google Oneindia TeluguNews

అమ‌రావ‌తి: అయిదేళ్ల చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వ హ‌యాంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)ను పునఃసమీక్షిస్తాంటూ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు అజేయ‌క‌ల్లం చేసిన ప్ర‌క‌ట‌న తెలుగుదేశం పార్టీలో క‌ల‌క‌లానికి దారి తీసింది. పీపీఏల పునఃస‌మీక్ష నిర్ణ‌యాన్ని మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌ప్పు ప‌డుతున్నారు. దీనివ‌ల్ల రాష్ట్రానికి పెట్టుబ‌డులు రాకుండా పోతాయ‌ని, ప‌రిశ్ర‌మ‌లు రావ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

నిరంత‌రాయంగా విద్యుత్‌ను స‌ర‌ఫ‌రా అందిన‌ప్పుడే ప‌రిశ్ర‌మ‌లు పెద్ద ఎత్తున ఏర్పాట‌వుతాయ‌ని అంటున్నారు. పారిశ్రామిక‌వేత్త‌లను భ‌యాందోళ‌న‌కు గురి చేయ‌డానికే విద్యుత్ కొనుగోలు ఒప్పందాల‌ను పునఃస‌మీక్షించాల‌ని వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుందంటూ ఆరోపిస్తున్నారు. ఆయ‌న కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తున్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల‌ను పునఃస‌మీక్షించ‌డ‌మంటే మాట‌లు కాద‌ని, దీనివ‌ల్ల రాష్ట్రం అంధ‌కారంలోకి వెళ్తుంద‌ని విమ‌ర్శించారు.

Recommended Video

విజయవాడలో విద్యుత్ కోత
Why afraid of reviewing Power Purchase Agreements? YSRCP MP Vijayasai Reddy questioned to Chandrababu

ఈ వ్య‌వ‌హారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు వీ విజ‌య‌సాయి రెడ్డి స్పందించారు. అయిదేళ్ల కాలంలో చోటు చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల‌ను పునఃస‌మీక్షిస్తామంటే ఎందుకు ఉలిక్కిప‌డుతున్నారంటూ ఆయ‌న చంద్ర‌బాబును ప్ర‌శ్నించారు. భుజాలు ఎందుకు త‌డుముకుంటున్నార‌ని నిల‌దీశారు. ప‌వ‌న్, సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో పెద్ద ఎత్తున అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని ఆరోపించారు. వేల కోట్ల రూపాయ‌ల ప్ర‌జాధ‌నం దోపిడీకి గురైంద‌ని విమ‌ర్శించారు.

మౌన ముని! నిజాలన్నీ కక్కేస్తున్న తెలుగు తమ్ముళ్లు: నోరు మెద‌ప‌ని చంద్ర‌బాబు!మౌన ముని! నిజాలన్నీ కక్కేస్తున్న తెలుగు తమ్ముళ్లు: నోరు మెద‌ప‌ని చంద్ర‌బాబు!

విద్యుత్ కొనుగోలు ఒప్పందాల సంద‌ర్భంగా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పెద్ద‌ల‌కు వంద‌ల కోట్ల రూపాయ‌ల మేర క‌మీషన్లు ముట్టాయ‌ని ఆరోపించారు. కమీషన్లు మింగి చేసుకున్న పీపీఏల వల్ల రాష్ట్ర ఖ‌జానాపై సంవ‌త్స‌రానికి 2,500 కోట్ల రూపాయ‌ల అద‌న‌పు భారం ప‌డింద‌ని, ప్రజాధనం వృధా అయిందని అన్నారు. యూనిట్ ఒక్కింటికి 2 రూపాయ‌ల 70 పైస‌ల‌కు బ‌హిరంగ మార్కెట్‌లో ల‌భిస్తోంటే 4 రూపాయ‌ల 84 పైస‌ల‌ను ఎందుకు చెల్లించాల్సి వ‌చ్చింద‌ని ప్ర‌శ్నించారు సాయిరెడ్డి. ఎవడబ్బ సొమ్మని దోచిపెట్టారని మండిప‌డ్డారు.

English summary
Despite the Centre's advise to exercise restraint on the issue of reviewing Power Purchase Agreements (PPAs), the Andhra Pradesh government on Monday decided to go ahead with the review of all PPAs. Principal advisor to Chief Minister, Ajeya Kallam, said that all PPAs signed during the term of the previous Telugu Desam Party (TDP) will be reviewed as they were causing huge losses to state exchequer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X