వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ర్యాంకింగ్స్‌లో ఏపీకి 2వస్థానం ఎందుకంటే..!' బాబుతో మాట్లాడతా: నిర్మల

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ/ప్రకాశం: పెట్టుబడులకు సంబంధించి ప్రపంచ బ్యాంక్ ర్యాంకింగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండోస్థానం రావడంపై సిపిఐ ఏపీ కార్యదర్శి మధు ఎద్దేవా చేశారు. కార్మిక సంక్షేమాన్ని పక్కన పెట్టడం వల్లనే ఏపీకి రెండో స్థానం వచ్చిందన్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మళ్లీ ప్రపంచ బ్యాంకు పాలన ప్రారంభమైందని చంద్రబాబును ఉద్దేశించి ఎద్దేవా చేశారు. గతంలో ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌గా పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఆ బ్యాంకు విధానాలను అమలుపరుస్తున్నారన్నారు.

76,426 ఎకరాలను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైందన్నారు. ప్రభుత్వం బలవంతపు భూసేకరణపై త్వరలో భారీ ఉద్యమం చేపడతామన్నారు. రాష్ట్ర బంద్‌కు, అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తామని చెప్పారు.

Why AP 2nd rank in World Bank Rankings!?

చంద్రబాబుతో మాట్లాడాక ప్రకటన: నిర్మలా

ఏపీలో పొగాకు రైతులకు మేలు కలిగించే నిర్ణయాన్ని ప్రకటించే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించనున్నట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకాశం జిల్లాలో చెప్పారు. ఉదయం ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులను ఆమె పరామర్శించారు.

Why AP 2nd rank in World Bank Rankings!?

వల్లేటివారిపాలెం మండలం కొండ సముద్రంలో ఆత్మహత్యకు పాల్పడ్డ నీలం వెంకట్రావ్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సాయంత్రం చంద్రబాబుతో భేటీ కానున్నట్లు చెప్పారు. అనంతరం పొగాకు రైతుల విషయమై ఓ ప్రకటన ఉంటుందన్నారు. పొగాకు రైతులు బలవన్మరణాలకు పాల్పడవద్దన్నారు.

కార్పోరేషన్ ఎన్నికలకు టిడిపి సిద్ధం

కార్పోరేషన్ ఎన్నికలకు టిడిపి సిద్ధంగా ఉందని గుంటూరు తర్పు నియోజకవర్గం టిడిపి ఇంఛార్జ్ గిరి అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే కోర్టులకు వెల్లకుండా ఎన్నికలకు రావాలని నగర అధ్యక్షులు శ్రీనివాస్ సవాల్ చేశారు.

English summary
Why AP 2nd rank in World Bank Rankings!?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X