
ఉప ఎన్నికలపై వైఎస్ జగన్కు అంత ఆత్మవిశ్వాసం ఎందుకు?: ప్రచారానికి వెళ్లకుండా రికార్డు మెజారిటీ
అమరావతి: ఊహంచినట్టే- నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి నిర్వహించిన ఉప ఎన్నికలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. ఆ పార్టీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ఘన విజయాన్ని సాధించారు. 82,888 ఓట్ల మెజారిటీని సాధించారు. ఇది- 2019లో వైఎస్ఆర్సీపీ సాధించిన మెజారిటీ కంటే అధికం. ఉప ఎన్నిక బరి నుంచి తెలుగుదేశం పార్టీ తప్పుకొంది. తన బలం ఎంతో తెలుసుకోవడానికి అభ్యర్థిని నిలబెట్టిన భారతీయ జనతా పార్టీకి కోలుకోని దెబ్బ కొట్టింది ఈ ఉప ఎన్నిక. డిపాజిట్ కూడా దక్కలేదు.

అడుగు బయట పెట్టకుండా అభ్యర్థుల విజయం..
ఈ ఉప ఎన్నికకు కూడా వైసీపీ తరఫున.. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి రాలేదు. తన క్యాంప్ కార్యాలయం నుంచి అడుగు తీసి బయట పెట్టలేదు. పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను ఆయన మంత్రులు, నెల్లూరు జిల్లాకు చెందిన నాయకులకు అప్పగించారు. దాదాపుగా మంత్రులందరూ ఆత్మకూరులో పర్యటించారు. కన్నుమూసిన మేకపాటి గౌతమ్ రెడ్డి మాజీమంత్రి కావడం వల్ల ఈ ఉప ఎన్నికలో ఆయన సోదరుడిని భారీ మెజారిటీతో గెలిపించే బాధ్యతను స్వీకరించారు. దిగ్విజయంగా ముగించారు.

ఇదివరకు కూడా..
ఉప ఎన్నికల్లో ప్రచారానికి వైఎస్ జగన్ దూరంగా ఉండటం ఇది కొత్తేమీ కాదు. ఇదివరకు తిరుపతి లోక్సభ, కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నిక ప్రచారంలోనూ ఆయన పాల్గొనలేదు. తిరుపతి ఉప ఎన్నిక సమయంలో భారీ బహిరంగ సభతో ప్రచార పర్వాన్ని ముగించాలని తొలుత నిర్ణయించినప్పటికీ.. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న అప్పటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దాన్ని రద్దు చేసుకున్నారు. బద్వేలు ఉప ఎన్నిక ప్రచారానికీ వెళ్లలేదు. ఇప్పుడు తాజాగా ఆత్మకూరు వెళ్లాలనే ఆలోచన కూడా చేయలేదు.

అడుగు బయట పెట్టకుండా అభ్యర్థుల విజయం..
వైఎస్ జగన్ తన క్యాంప్ కార్యాలయం నుంచి అడుగు బయట పెట్టకుండా అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకుంటోన్నారు. అది లోక్సభ అయినా సరే.. అసెంబ్లీ అయినా సరే. తాను తెరవెనుకే ఉంటోన్నారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక సమయంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం అక్కడే మకాం వేసింది. ఆ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి నారా లోకేష్ సహా పలువురు నాయకులు తిరుపతిలో మకాం వేశారు. పార్టీ అభ్యర్థి, కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మిని గెలిపించడానికి సర్వశక్తులూ ఒడ్డారు. ఫలితం రాలేదు.

పరిపాలనపై విశ్వాసం..
వైఎస్
జగన్
ఉప
ఎన్నికల్లో
ప్రచారానికి
దిగకపోవడానికి
ప్రధాన
కారణం..తన
పరిపాలన
పట్ల
తనకే
ఉన్న
బలమైన
నమ్మకం.
అమలు
చేస్తోన్న
సంక్షేమ
పథకాలన్నింటినీ
నేరుగా
లబ్దిదారుల
ఇళ్ల
వద్దకే
అందజేయడం,
సచివాలయాలు,
రైతు
భరోసా
కేంద్రాలతో
పరిపాలనను
ప్రజల
వద్దకు
తీసుకెళ్లడం,
సంక్షేమ
క్యాలెండర్ను
ఖచ్చితంగా
అమలు
చేయడం
వంటివి..
ఆయన
ఆత్మ
విశ్వాసానికి
కారణాలు
చెప్పుకోవచ్చు.

ఆత్మకూరు ఫలితంతో జోష్..
వైఎస్ జగన్ ప్రచారానికి దూరంగా ఉన్నప్పటికీ.. రికార్డు స్థాయి మెజారిటీని సాధించడం ఈ మూడు ఉప ఎన్నికల ప్రత్యేకత. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి 2,71,592 మెజారిటీతో గెలుపొందారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే ఇది ఎక్కువే. బద్వేలులోనూ అదే పునరావృతమైంది. 90 వేలకు పైగా మెజారిటీతో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ ఘన విజయం సాధించారు. తాజాగా ఆత్మకూరులో కూడా అదే ప్రతిఫలించింది.