వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ చేసింది ఏపీ ఎందుకు చేయలేకపోతోంది ?- కొంప ముంచుతున్న అప్పటి నిర్ణయం..

|
Google Oneindia TeluguNews

విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వాలు చేసే ఒక్కో పని వాటిని నడుపుతున్న వారి సమర్ధతను, సమయస్ఫూర్తికి అద్దం పడుతూ ఉంటుంది. కొన్నిసార్లు పాలకుల నిర్ణయాలు వారి ముందుచూపును సైతం ప్రజలకు గుర్తు చేస్తుంటాయి. ఇవేవీ చేయకపోయినా కనీసం సమయానుకూలంగా నిర్ణయం తీసుకున్నా ప్రజల మన్ననలు అందుకునేలా చేస్తుంది. తాజాగా తెలంగాణలో లాక్ డౌన్ నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం పేదల పాలిట వరంగా మారుతుండగా.. గతంలో ఏపీలో వైసీపీ సర్కారు తీసుకున్న మరో నిర్ణయం ఇక్కడి పేదలకు శాపంగా మారుతోంది. ఈ రెండు నిర్ణయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

తెలంగాణ నిర్ణయం భేష్..

తెలంగాణ నిర్ణయం భేష్..

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం నానాటికీ పెరుగుతోంది. ఏపీతో పోలిస్తే తెలంగాణలో భారీగా కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. ఇదే క్రమంలో తెలంగాణలోని హైదరాబాద్ లో ఉన్న పలు హాస్టళ్లలో చిక్కుకుపోయిన ఆంధ్రావాసులంతా ఒక్కసారిగా స్వస్ధలాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రత్యేకంగా అనుమతివ్వాలని అధికారులపై ఒత్తిడి తేవడంతో పోలీసులు నిరభ్యంతర పత్రాలు జారీ చేసి వారిని పంపారు. కానీ గరికపాడు చెక్ పోస్ట్ లో ఏపీ సరిహద్దు పోలీసులు అనుమతించకపోవడంతో వారిలో చాలా మంది హైదరాబాద్ తిరిగివచ్చారు. కానీ హాస్టళ్లలో సరుకుల కొరతతో వారిని ఆదరించేందుకు యాజమాన్యాలు సిద్ధం కాకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం స్పందించి లాక్ డౌన్ ఉన్నా.. అన్నపూర్ణ క్యాంటీన్లను తెరవడంతో పాటు వాటిలో ఐదు రూపాయల సబ్సిడీని ఎత్తేసి మరీ ఉచితంగా భోజనం అందించేందుకు సిద్దమైంది. దీంతో ఇప్పుడు విద్యార్ధులతో పాటు పేద ప్రజలు కూడా యథావిథిగా కడుపు నింపుకుంటున్నారు. ఈ ఒక్క నిర్ణయంతో ఇప్పుడు తెలంగాణ సర్కారు పేద ప్రజల మన్ననలు అందుకుంటోంది.

ఏపీలో వైసీపీ సర్కారు మాత్రం..

ఏపీలో వైసీపీ సర్కారు మాత్రం..

గతేడాది అధికారంలోకి రాగానే వైసీపీ ప్రభుత్వం.. అంతకు ముందు టీడీపీ సర్కారు ప్రారంభించిందన్న సాకుతో రాష్ట్రవ్యాప్తంగా ఐదు రూపాయలకే భోజనం అందిస్తున్న అన్న క్యాంటీన్లను ఉన్నపళంగా ఎత్తేసింది. కారణాలు ఏవైనా ఆ నిర్ణయం మాత్రం అప్పట్లోనే ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నింపింది. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజల కడుపు నింపాల్సిన క్యాంటీన్లను పార్టీల పేరుతో తొలగించిన వైసీపీ సర్కారుకు .. కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో ఇప్పుడు వాటిని పునరుద్ధారించాల్సిన పరిస్ధితి ఏర్పడుతోంది. అయితే తాము తొలగించిన క్యాంటీన్లను తిరిగి ప్రారంభించలేక, అలాగని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేక పేదల ఆకలి కేకలకు ప్రభుత్వం కారణమవుతోంది. పలుచోట్ల స్వచ్ఛందంగా ముుందుకు వచ్చే వారిని సైతం అనుమతించలేక సర్కారు ఇరుకున పడుతున్న పరిస్ధితి.

 బాధ్యత గుర్తుచేస్తున్న స్వచ్ఛంద సంస్ధలు..

బాధ్యత గుర్తుచేస్తున్న స్వచ్ఛంద సంస్ధలు..

కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఓవైపు గతంలో మూసేసిన అన్న క్యాంటీన్లను తిరిగి తెరిపించలేక, అలాగని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేక సతమతం అవుతుంటే స్వచ్ఛంద సంస్ధలు, జర్నలిస్టులు, సామాజిక స్పృహ ఉన్న కొందరు మాత్రం ఈ దిశగా ప్రయత్నాలు చేస్తూ మన్ననలు అందుకుంటున్నారు. విజయవాడలో లాక్ డౌన్ నేపథ్యంలో కొందరు మీడియా రిపోర్టర్లు స్ధానిక నేతలతో కలిసి చందాలు వేసుకుని మరీ పేదలకు ఉచితంగా భోజనం సరఫరా చేస్తున్నారు. ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో వారు చేస్తున్న సేవ పాలకులకు సైతం కనువిప్పు కల్పించేలా ఉంది.

 కొసమెరుపు ఏంటంటే...

కొసమెరుపు ఏంటంటే...


అయితే ఈ మొత్తం వ్యవహారంలో కొసమెరుపు ఏంటంటే తెలంగాణలో అన్నపూర్ణ క్యాంటీన్లకు భోజనం సరఫరా చేస్తున్నదీ, గతంలో ఏపీలో అన్నక్యాంటీన్లకు భోజనం సరఫరా చేసిందీ హరేరామ ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న అక్షయపాత్ర ఫౌండేషనే. అయితే రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రభుత్వం .. వారు అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ఐదు రూపాయల భోజనాన్ని కరోనా విపత్తు వేళ సద్వినియోగం చేసుకుంటుంంటే ఏపీ ప్రభుత్వం రాజకీయ కారణాలతో ఉన్న క్యాంటీన్లను సైతం మూసేసి పేదలకు చుక్కలు చూపిస్తోంది. అయితే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం తర్వాతైనా ఏపీ సర్కారు కళ్లు తెరవాలని విపక్షాలతో పాటు సాధారణ జనం కూడా కోరుతున్నారు.

English summary
in wake of coronavirus lock down, telangana govt reopened annapurna canteens, but in andhra pradesh govt not yet started anna canteens, which they closed after coming to power last year. people think that if anna canteens were available in this critical situation, it will be useful to thousands of poor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X