• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నన్ను బోనులో పెట్టిస్తారట, పవన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చెప్పరేం: బీజేపీపై బాబు

|

అమరావతి: తమ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇష్టానుసారం మాట్లాడుతుంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఎందుకు ఊరుకుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు శాసన మండలిలో ప్రశ్నించారు.

పీఎంవో నేరస్తులకు గస్తీనా, కాపురం పెట్టండి: విజయసాయి-మోడీలపై బాబు సంచలనం

పోలవరం ప్రాజెక్టు గురించి చంద్రబాబు మాట్లాడిన సమయంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పందిస్తూ... పోలవరం పునరావాస బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అనే విషయం ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు. దీంతో చంద్రబాబు పైవిధంగా మాట్లాడారు. పవన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అభిప్రాయపడ్డారు.

మా హైకమాండ్ ఢిల్లీనే

మా హైకమాండ్ ఢిల్లీనే

ఎన్డీయే నుంచి బయటకు వచ్చే నిన్నటి వరకు బాగానే ఉన్న బీజేపీ నేతలు ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా టీడీపీని విమర్శిస్తున్నారని చంద్రబాబు అన్నారు. తమకు హైకమాండ్ ఢిల్లీలో లేదని, ఐదు కోట్ల మంది ప్రజలే తమ హైకమాండ్ అన్నారు. తాము రాష్ట్ర ప్రయోజనాలపై పోరాడతామని, ఎవ్వరికీ భయపడమని చెప్పారు. ప్రత్యేక హోదా, పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు.

రాజధాని రైతులు ఇచ్చినంత ఇవ్వలేదు

రాజధాని రైతులు ఇచ్చినంత ఇవ్వలేదు

లోకేష్ పైన అవినీతి ఆరోపణలపై స్పందిస్తూ.. లోకేష్ జోక్యం ఎక్కడా లేదన్నారు. అమరావతికి రాజధాని రైతులు ఇచ్చినంత కూడా కేంద్రం ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. తనను ఎవరూ ఏం చేయలేరన్నారు. పీఎంవో చుట్టూ తిరిగే విజయ సాయి రెడ్డి తనను బోనులో పెట్టిస్తానని వ్యాఖ్యానించారని మండిపడ్డారు.

వెంటనే న్యాయం చేయాలి

వెంటనే న్యాయం చేయాలి

ఇదిలా ఉండగా, ఢిల్లీలో టీడీపీ ఎంపీలు ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. గురువారం రాజ్యసభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యుడు సీఎం రమేశ్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. చట్టం ఏర్పడి సరిగ్గా నాలుగేళ్లు పూర్తయ్యాయన్నారు. చేశారు. 2014 ఫిబ్రవరిలో ఈ సభలోనే రాష్ట్ర పునర్విభజన బిల్లును ఆమోదించారని, అదే సమయంలో కొన్ని హామీలిచ్చారని, ఇప్పటి వరకూ ఆ హామీలు అమలు జరగలేదన్నారు. వెంటనే రాష్ట్రానికి న్యాయం చేయాలన్నారు.

 అసమర్థ పాలనకు నిదర్శనం

అసమర్థ పాలనకు నిదర్శనం

అయిదు కోట్లమంది ఏపీ వారికి కేంద్రం సమాధానం చెప్పాలని టీడీపీ ఎంపీలు డిమాండు చేశారు. ఇతర రాష్ట్రాలకు హోదా కొనసాగిస్తూ రాష్ట్రానికి మాత్రం మొండి చేయి చూపుతున్నారన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నిస్తుంటే టీడీపీపై విమర్శలు చేయడం దారుణమన్నారు. సమస్యలు పరిష్కారం దిశగా కేంద్రం ఏమాత్రం ఆలోచించడం లేదని, ఇది అసమర్ధ పాలనకు నిదర్శనమన్నారు.

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu on thursday asked why BJP is silence on Jana Sena chief Pawan Kalyan allegations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X