వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్ దెబ్బ! చంద్రబాబు ఎందుకలా మాట్లాడారు?: కొత్త అనుమానాలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: ప్రారంభంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు ఘాటుగా ఉన్నాయని, ఇటీవలి కాలంలో తగ్గాయని, కాబట్టి జనసేన - టీడీపీ పొత్తు ఉంటుందని చెబుతున్న వారి అభిప్రాయాలు తలకిందలవుతున్నాయా?

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జనసేనానిని.. పదేపదే తమ కూటమిలోకి టీడీపీ ఆహ్వానిస్తుండటంతో పొత్తు ఖాయమని భావించినవారి అభిప్రాయం తలకిందులయినట్లేనా? అంటే ప్రస్తుత ఏపీ రాజకీయాలు చూస్తుంటే అలాగే ఉందని అంటున్నారు.

'ఎమ్మెల్యే మేడా దారిలోనే మరికొందరు టీడీపీ నేతలు బయటకు': వలసలతో టీడీపీలో గుబులు!'ఎమ్మెల్యే మేడా దారిలోనే మరికొందరు టీడీపీ నేతలు బయటకు': వలసలతో టీడీపీలో గుబులు!

 హఠాత్తుగా మార్పు

హఠాత్తుగా మార్పు

తాజాగా, బుధవారం టీడీపీ సీనియర్ నేత టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. టీడీపీ - జనసేన పొత్తుకు అవకాశాలు ఉన్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలపై ఓ వైపు చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా, జనసేనాని హెచ్చరికలు జారీ చేశారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే సహించేది లేదని, నోటికి ఏది వస్తే అది మాట్లాడవద్దని,నేను వద్దనుకుంటే వచ్చిన రాజ్యసభ సీటును తెచ్చుకున్న వెంకటేష్‌కు బుద్ధి చెబుతామని, పెద్దమనిషి పెద్దమనిషిగా మాట్లాడాలని హెచ్చరించారు. అయితే, నిన్నటి దాకా ఉన్న పరిస్థితికి, హఠాత్తుగా నేటి పరిస్థితి మార్పు కనిపిస్తోందని అంటున్నారు. ఓ విధంగా చంద్రబాబు సడన్ యూటర్న్ తీసుకున్నారని అంటున్నారు.

 జనసేనానికి నిన్నటి వరకు రెడ్ కార్పెట్!

జనసేనానికి నిన్నటి వరకు రెడ్ కార్పెట్!

ఇందుకు గత కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలను ప్రస్తావిస్తున్నారు. స్వయంగా చంద్రబాబే పలుమార్లు జనసేనానిని పొత్తు కోసం ఆహ్వానించారు. కేంద్రంపై పోరాటానికి పవన్ తమతో కలిసి రావాలని చెప్పారు. పలువురు టీడీపీ నేతలు కూడా టీడీపీ, జనసేన పొత్తు ఉంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. జనసేనకు రెడ్ కార్పెట్ పరిచారు. ఆయనపై విమర్శల దాడి కూడా ఆపేశారు. అంతేకాదు, జనసేనానిపై ఘాటు విమర్శలు చేయవద్దని చంద్రబాబు కూడా ఆదేశించినట్లుగా వార్తలు వచ్చాయి.

కొత్త అనుమానాలు

కొత్త అనుమానాలు

కానీ, అంతలోనే టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. పొత్తు కోసం టీడీపీ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయాయా? వచ్చే ఎన్నికల్లో పొత్తు కోసం చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో ఇప్పుడు హఠాత్తుగా కొత్తగా టర్న్ తీసుకున్నారా? లేదంటే నిన్నటి దాకా ఆహ్వానించి, ఇప్పుడు ఇలా ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనే చర్చ సాగుతోంది. మొత్తానికి తాజా పరిణామాలతో పొత్తు లేదని అర్థమవుతోందని అంటున్నారు.

English summary
Andhra Pradesh chief minister Nara Chandrababu Naidu fired at party senior leader TG Venkatesh for his comments on alliance with Pawan Kalyan's Janasena in next general elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X