వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్‌ను పిలిచి ఎందుకు అడగలేదు!: హోదాపై జగన్ పార్టీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన, జెపి నేతృత్వంలోని లోక్‌సత్తా, తమ పార్టీని పిలిచి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా విషయంలో ఎందుకు సూచనలు అడగలేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు గురువారం ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదాకు ఇచ్చేందుకు ఉన్న గైడ్ లైన్స్ ఏపీకి వర్తించవన్నారు. ప్రత్యేక హోదా కాకుండా.. ప్రత్యేక హోదాను ఎట్టి పరిస్థితుల్లో తమ పార్టీ అంగీకరించే ప్రసక్తి లేదన్నారు.

విభజన కోరుకోని ప్రజలకు ఇచ్చిన భరోసానే ప్రత్యేక హోదా అన్నారు. ఢిల్లీల్లో పిల్లుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఓటేసిన ప్రజలను వంచిస్తారా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా పైన హామీ ఇచ్చి, ఇప్పుడు మాట మారుస్తున్నారన్నారు.

ఏడాది కాలంలో కనీసం వారు ప్రత్యేక ప్యాకేజీ గురించి అడగలేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదా ఒక్కటేనని చంద్రబాబు చెప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజల తరఫున పోరాడాల్సిన చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారన్నారు.

 Why Chandrababu not consulted Pawan Kalyan: Dharmana

ఏపీని నాలెడ్జ్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో నిర్వహించిన కోడ్‌ ఫర్‌ ఏపీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని మన వద్దకు తీసుకురావాలన్నారు. తమ ప్రభుత్వం ఇన్‌క్యుబేషన్‌కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. మనకు అవసరమైన వస్తువులు మన వద్దే తయారు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

English summary
YSR Congress party leader Dharmana Prasad Rao on Thursday questioned that Why Chandrababu not consulted Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X