• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆమెకు కేసీఆర్ షాక్, అవాక్కయ్యారు.. జగన్ కోవింద్‌కు పాదాభివందనం వెనుక?

|

హైదరాబాద్/అమరావతి: రాష్ట్రపతి అభ్యర్థులు రామ్‌నాథ్ కోవింద్, మీరా కుమార్‌లు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించారు. ఎన్డీయే అభ్యర్థిగా కోవింద్, విపక్షాల అభ్యర్థిగా మీరా పోటీలో నిలిచారు. ఆయా పార్టీల మద్దతు కూడగట్టేందుకు ఇరువురు వచ్చారు.

చదవండి:

తెలుగు రాష్ట్రాల్లో టిడిపి, వైసిపి, టిఆర్ఎస్ పార్టీలు ఎన్డీయే అభ్యర్థికి మద్దతివ్వాలని ముందే నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు కెసిఆర్, జగన్, చంద్రబాబులను రాంనాథ్ కలిశారు. వారి మద్దతును కోరారు. రాంనాథ్ పర్యటన సంతృప్తికరంగానే సాగింది.

విపక్షాల అభ్యర్థి మీరా కుమార్ పర్యటన అసంతృప్తిగానే సాగిందని చెప్పవచ్చు. ఆమెకు సొంత పార్టీ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీ ప్రజాప్రతినిధుల మద్దతు తప్ప ఎవరిదీ లభించడం లేదు. కాంగ్రెస్ నేతలు మాత్రమే ఆమెను కలిశారు. తెరాస అధినేత కెసీఆర్‌ని ఆమె కలవాలనుకున్నారు.

చదవండి: రామ్‌నాథ్‌కు ఘనస్వాగతం: పాదాభివందనం చేసిన జగన్, వీడియో వైరల్

కానీ ఆయన కలిసేందుకు ఆసక్తి కనబరచలేదని తెలుస్తోంది. మద్దతు కోసం మిమ్మల్ని కలవాలని మీరా కుమార్ అపాయింటుమెంట్ కోరినా గులాబీ అధినేత ఇవ్వలేదని తెలుస్తోంది. కనీసం ఫోన్లో కూడా కలవలేదని తెలుస్తోంది. చివరకు ఆమె.. తాను తెలంగాణ బిల్లులో కీలక పాత్ర పోషించానని, దీనిని గుర్తు పెట్టుకొని తెలంగాణ ప్రజాప్రతినిధులు తనకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేసి వెళ్లిపోయారు.

జగన్ తీరుతో ఆశ్చర్యం.. అందుకేనా

జగన్ తీరుతో ఆశ్చర్యం.. అందుకేనా

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి కోవింద్ హైదరాబాద్‌లో అధికార విపక్ష పార్టీలతో సమావేశమయ్యారు. తనకు మద్దతు ఇచ్చినందుకు నేతలకు

కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అక్కడ ఊహించని ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కోవింద్‌కు వైసిపి అధినేత జగన్ పాదాభివందనం చేశారు. దీంతో అక్కడున్నవారందరూ ఆశ్చర్యపోయారు. మామూలుగా జగన్ అంటీముట్టనట్టు వ్యవహరించే వ్యక్తిగా కనిపిస్తారని, కరచాలనం కూడా చాలాసార్లు అంత చురుగ్గా చేయరని, అలాంటిది కోవింద్ వచ్చీ రాగానే విష్ చేస్తూనే... ఇలా పాదాభివందనం చేశారని అంటున్నారు. జగన్ పాదాభివందనం చేసి బ్లెస్సింగ్స్ తీసుకోవడం గమనార్హం. ఓటు వేస్తామన్నందుకు కృతజ్ఞత చెప్పేందుకు ఆయన వస్తే జగన్ ఆశీర్వాదం తీసుకోవడం అక్కడ చూసిన వారికి ఆసక్తిని కలిగించిందట. జగన్ తర్వాత విజయసాయి రెడ్డి కూడా కోవింద్‌కు పాదాభివందనం చేశారు. కోవింద్ లేదా బిజెపితో తనకు సాన్నిహిత్యం ఉందని చెప్పుకునేందుకే జగన్ అలా చేసి ఉంటారని అంటున్నారు.

జగన్ ఇక్కడే ఉన్నారు కాబట్టి

జగన్ ఇక్కడే ఉన్నారు కాబట్టి

రాష్ట్రపతి రేసులో ఉన్న అభ్యర్థులు రాష్ట్రాలు తిరిగి మద్దతు ఇచ్చిన పార్టీలకి కృతజ్ఞతలు చెప్పడం, ఇంకా నిర్ణయం తీసుకోని పార్టీలు ఉంటే మద్దతు కోరడం చేస్తారు. మీరా కుమార్ తర్వాత రాంనాథ్ కోవింద్ అందుకే హైదరాబాద్ వచ్చారు. ఇక్కడ తెలంగాణ పార్టీలతో సమావేశమయ్యారు. జగన్ కూడా హైదరాబాదులోనే ఉంటున్నందున, పార్టీ నేతలతో కోవింద్‌ను కలిశారు. ఈ మేరకు ముందే సమాచారం ఇచ్చారు. కానీ జగన్ పాదాభివందనం చేయడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోందని అంటున్నారు.

అప్పుడు ఫోటోలు.. ఇప్పుడు పాదాభివందనం

అప్పుడు ఫోటోలు.. ఇప్పుడు పాదాభివందనం

కోవింద్ తమకు పరిచయస్తుడు అని చెప్పేందుకు వైసిపి ప్రయత్నిస్తోందని కొందరు అంటున్నారు. కోవింద్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించీ ప్రకటించగానే... ఆయనతో విజయసాయి రెడ్డి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. ఇప్పుడు జగన్, విజయసాయిలు పాదాభివందనం చేశారు.

కేసీఆర్ సాదర స్వాగతం

కేసీఆర్ సాదర స్వాగతం

రామ్‌నాథ్ కోవింద్‌కు తెలంగాణ ప్ర‌భుత్వం సాద‌ర స్వాగ‌తం ప‌లికి, అనంత‌రం ఆయ‌న‌తో స‌మావేశం అయింది. ఈ కార్య‌క్ర‌మంలో సీఎం కేసీఆర్‌తో పాటు కేంద్రమంత్రులు వెంక‌య్య నాయుడు, బండారు ద‌త్తాత్రేయ, ప‌లువురు రాష్ట్ర మంత్రులు, బిజెపి రాష్ట్ర‌ నేత‌లు పాల్గొన్నారు. రామ్‌నాథ్‌కు తెరాస ప్ర‌భుత్వం ఆత్మీయ సత్కారం చేసింది. రామ్‌నాథ్ కోవింద్‌ రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికే వ‌న్నె తెస్తార‌ని పేర్కొంది. ఈ సంద‌ర్భంగా కోవింద్ మాట్లాడారు. రాజ్యాంగ‌బ‌ద్ధ ప‌ద‌వులు స్వీక‌రించిన‌ప్పుడు వాటికి త‌గిన విధంగా న‌డుచుకోవాలని, త‌న‌కు అప్ప‌గిస్తోన్న బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్థంగా నిర్వ‌ర్తించ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌న్నారు.

తెరాస మద్దతు తెలిపిందని..

తెరాస మద్దతు తెలిపిందని..

ప్ర‌పంచంలోనే అతిపెద్ద ప్ర‌జాస్వామ్య దేశం భార‌త్ అని కోవింద్ అన్నారు. అటువంటి భార‌త్‌లో రాజ్యాంగబ‌ద్ధంగా న‌డుచుకోవాల‌ని అన్నారు. తాను బీహార్‌ గ‌వ‌ర్న‌ర్‌గా ప‌ని చేసిన‌ప్పుడు కూడా ఏ పార్టీవైపునా ప‌క్ష‌పాతం చూపించ‌లేద‌న్నారు. బిజెపి అధిష్ఠానం త‌న‌ను రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన వెంట‌నే టీఆర్ఎస్ మ‌ద్దతు తెలిపింద‌న్నారు. తాను నామినేష‌న్ వేసే స‌మ‌యంలోనూ టీఆర్ఎస్ మ‌ద్ద‌తుగా నిలిచిందని చెప్పారు.

రాంనాథ్ ఆశీర్వాదాలు కోరిన కేసీఆర్

రాంనాథ్ ఆశీర్వాదాలు కోరిన కేసీఆర్

రాష్ట్ర అభివృద్ధి కోసం భవిష్యత్తులో రామ్‌నాథ్‌ ఆశీర్వచనాలు ఉండాలని కేసీఆర్ ఆకాంక్షించారు. సుదీర్ఘ పోరాటం అనంతరం 2014 జూన్‌ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడే నాటికి అనేక సమస్యలు ఉన్నాయన్నారు. తీవ్రమైన విద్యుత్‌ సంక్షోభం నుంచి అతి తక్కువ సమయంలోనే బయటపడి ప్రస్తుతం తెలంగాణ సంక్షేమ రాష్ట్రంగా అవతరించిందన్నారు.

ఎన్టీఆర్‌ను అవతార పురుషుడిగా కొలుస్తారని విన్నాను..

ఎన్టీఆర్‌ను అవతార పురుషుడిగా కొలుస్తారని విన్నాను..

తాను ఏ రాజకీయ పార్టీకీ చెందినవాడిని కాదని రామ్‌నాథ్‌ కోవింద్‌ విజయవాడలో అన్నారు. ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో టిడిపికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగమే భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌ అన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా తనకు మద్దతు ఇచ్చిన ఎన్డీయే, నరేంద్ర మోడీ, అన్ని రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. స్వర్గీయ ఎన్టీఆర్‌ తెలుగు జాతికి గర్వకారణం అన్నారు. తెలుగువారు ఆయనను అవతార పురుషుడిగా భావిస్తారని తాను విన్నానని ఈ సందర్భంగా కోవింద్‌ చెప్పారు. తనను గవర్నర్‌గా నియమించగానే పార్టీలకు అతీతంగా వ్యవహరించానన్నారు.

నా అదృష్టమన్న చంద్రబాబు

నా అదృష్టమన్న చంద్రబాబు

రాష్ట్రపతి ఎన్నికల్లో రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఓటువేయడం అదృష్టంగా భావిస్తున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కోవింద్‌ను అభ్యర్థిగా ఎంపికచేసినట్టు ప్రధాని మోడీ తనకు ఫోన్‌లో చెప్పారనీ, వెంటనే తన మద్దతు తెలిపానన్నారు. 26 ఏళ్ల క్రితం రామ్‌నాథ్‌ కోవింద్‌ బిజెపిలో చేరారనీ, ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలు ఆయనపై లేవన్నారు. రాష్ట్రపతి అయ్యేందుకు అన్ని అర్హతలూ కోవింద్‌కు ఉన్నాయన్నారు. ఏపీ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ అన్నివిధాలా సహకారం అందిస్తున్నారన్నారు.

వివాదాల్లేని రాంనాథ్ కోవింద్

వివాదాల్లేని రాంనాథ్ కోవింద్

రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ లేకుండా ఉంటే గౌరవంగా ఉండేదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి ఎన్నికల అంశంపై అన్ని పార్టీలతో చర్చలు జరిపాకే అత్యంత సౌమ్యుడు, వివాదరహితుడు, మృధుస్వభావిగా పేరున్న రామ్‌నాథ్‌ కోవింద్‌ పేరును ప్రకటించామన్నారు. అయినప్పటికీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్‌, కొన్ని విపక్షాలు కలిసి మీరాకుమార్‌ను బరిలో దించాయన్నారు. వారు తమ ఎన్నికల ప్రచారంలో సైద్ధాంతిక పోరాటం అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కానీ రాష్ట్రపతి ఎన్నికల్లో సైద్ధాంతిక పోటీ ఉండదన్నారు. రామ్‌నాథ్‌ కోవింద్‌కు దేశంలో విశేషమైన మద్దతు ఉందని, ఆయన దేశ రాష్ట్రపతిగా అపూర్వమైన మెజార్టీతో ఎన్నికవుతారన్నారు. ప్రధాని మోడీ రాష్ట్రపతి అభ్యర్థి పేరును ప్రకటించిన వెంటనే అందుకు కట్టుబడి ఉంటామని ప్రకటించిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్డీయేలో 33 పార్టీలు ఉన్నాయని, వారితో పాటు యూపీఏలోని కొన్ని పార్టీలు కూడా తమ అభ్యర్థికి మద్దతు ఇచ్చే అవకాశం ఉందన్నారు.

వెంకటేశ్వర వైభోవోత్సవాల్లో రాంనాథ్ కోవింద్

వెంకటేశ్వర వైభోవోత్సవాల్లో రాంనాథ్ కోవింద్

విజయవాడలోని స్వరాజ్య మైదానంలో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలకు రామ్‌నాథ్‌ కోవింద్‌ హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుతో కలిసి ఆయన అక్కడకు చేరుకున్నారు. ఉత్సవాల కోసం ఏర్పాటుచేసిన టిటిడి నమూనా ఆలయంలో కోవింద్‌ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తెలుగు రాష్ట్రాల్లో పర్యటనను ముగించుకొని ఢిల్లీకి బయల్దేరారు.

English summary
Even as YSR Congress party’s decision to support National Democratic Alliance in the Presidential elections has come controversial, the way party president Y S Jaganmohan Reddy went head over heels to welcome NDA candidate Ramnath Kovind on Tuesday has raised many an eyebrow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X