• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చీఫ్ జస్టిస్ కు దూరంగా చంద్రబాబు : తెలంగాణలో అన్ని పార్టీల లీడర్లు కలిసినా : ఆ చొరవ ఏమైంది...!!

By Lekhaka
|

జాతీయ..అంతర్జాతీయ ప్రముఖులు ఎప్పుడు..తెలుగు గడ్డకు వచ్చినా వారిని ఆకర్షించటంలో టీడీపీ అధినేత చంద్రబాబు ముందుంటారు. అధికారంలో ఉన్నా..ప్రతిపక్షంలో ఉన్నా తన స్థాయి పెంచుకొనే ప్రయత్నం చేస్తారు. రాష్ట్ర విభజన తరువాత ప్రధాని అభ్యర్ధిగా మోదీ ప్రొజెక్ట్ అవుతున్న సమయంలో వస్తున్న మద్దతు..అదే విధంగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ కోసం చంద్రబాబు వేగంగా పావులు కదిపి సక్సెస్ అయ్యారు. బిల్ గేట్స్ అయినా..బిల్ క్లింటన్ వచ్చినా.. టోనీ బ్లెయిర్ ను అమరావతికి ఆహ్వానించినా అందులో చంద్రబాబు స్పెషల్ అట్రాక్షన్. ఇక, అధికారంలో ఉంటే ప్రతీ ఏటా దవోస్ పర్యటనలో అంతర్జాతీ య ప్రముఖలను కలవటం చంద్రబాబుకు అలవాటు.

అందరినీ ఆహ్వానించి..ఆర్బాటంగా..

అందరినీ ఆహ్వానించి..ఆర్బాటంగా..

ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతి శంకుస్థాపన కోసం ప్రధాని మోదీతో పాటుగా వెంకయ్య నాయుడు..సింగపూర్ - ఇతర దేశాల ప్రముఖుల ను ఆహ్వానించారు. జాతీయ స్థాయిలో ఉన్నత పదవుల్లో ఉన్న వారినీ అమరావతికి తీసుకొచ్చారు. ఆ కార్యక్రమంలో నాడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణను ఆహ్వానించారు. ఇక, అమరావతిలో హైకోర్టు ప్రారంభోత్సవానికి నాటి సుప్రీం చీఫ్ జస్టిస్ గగోయ్ తో పాటుగా సుప్రీం న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆహ్వానం మేరకు హాజరయ్యారు. ఇదంతా గతం. అయితే, ఇక ఇప్పుడు చంద్రబాబు అధికారం కోల్పోయారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం నడుస్తోంది.

ఎన్వీ రమణ ఏపీ పర్యటన..

ఎన్వీ రమణ ఏపీ పర్యటన..

జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. తెలుగు వ్యక్తి అంతటి ఉన్నత స్థానంలో నిలవటంతో తెలుగు వారంతా అభినందించారు. ముఖ్యమంత్రి జగన్ తో సహా పలువురు ఆయన బాధ్యతల స్వీకరణ రోజునే శుభాకాంక్షలు చెప్పారు. అలా..సర్వోన్నత న్యాయస్థానంలో అత్యున్నత పదవి అధిరోహించిన తరువాత తొలి సారి జస్టిస్ ఎన్వీ రమణ తెలుగు రాష్ట్రాలకు వచ్చారు. తొలుత ఏపీలో తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆ రోజే ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అక్కడ టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి..ఆలయ-జిల్లా అధికారులు స్వాగతం పలికారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కార్యక్రమం మొత్తం పాల్గొన్నారు. ఆ తరువాత పద్మావతి అమ్మవారి దర్శనం కు వెళ్లిన సమయంలో అక్కడ జిల్లా అధికారులు..చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి స్వాగతం పలికారు. ఇక, శ్రీశైలం వెళ్లిన సమయంలో దేవాదాయ మంత్రి వెల్లంపల్లి..కర్నూలు జిల్లా అధికారులు..స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రధాన న్యాయమూర్తికి ఆహ్వానం పలికారు.

హైదరాబాద్ లో ఘన స్వాగతం..

హైదరాబాద్ లో ఘన స్వాగతం..

ఇక, హైదరాబాద్ చేరుకున్న జస్టిస్ ఎన్వీ రమణకు ఊహించని విధంగా ఘన స్వాగతం లభించింది. మంత్రులు వెళ్లి ఏయిర్ పోర్టులో రిసీవ్ చేసుకోగా.. రాజ్ భవన్ లో గవర్నర్ తో పాటుగా సీఎం ఆహ్వానం పలికారు. ఇక, తరువాత కూడా సీఎం కేసీఆర్..పలువురు మంత్రులు...రాజకీయ పార్టీల నేతలు..స్వచ్చంద సంస్థల ప్రతినిధులు..రచయిత సంఘాల నేతలు కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తనకు తెలుగు నేలన్నా...తెలుగుదనం అన్నా ఎంతో మమకారం అని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పుకొచ్చారు.

  Telangana : భూముల అమ్మకం జీవో రద్దు చేయాలి - Sridhar Babu
  చంద్రబాబు కలవకపోవటం పై చర్చ...

  చంద్రబాబు కలవకపోవటం పై చర్చ...


  అయితే, సహజంగా ప్రముఖులు ఎవరు వచ్చినా..మర్యాద పూర్వకంగా కలిసే చంద్రబాబు ఇప్పుడు సుప్రీం చీఫ్ జస్టిస్ హైదరాబాద్ లోనే ఉన్నా..కలవలేదు. చంద్రబాబు సైతం హైదరాబాద్ లోనే ఉన్నారు. ఇదే అంశం ఇప్పుడు కొన్ని సర్కిల్స్ లో చర్చకు కారణమైంది. చంద్రబాబు మాత్రమే కాదు... టీడీపీ కీలక నేతలు ఎవరూ కూడా సుప్రీం ప్రధాన న్యాయమూర్తిని కలిసేందుకు రాలేదు. రావాలి..కలవాలి అనే నిబంధన ఏమీ లేదు. అయినా..తెలుగు వ్యక్తి ఉన్నత స్థానంలో ఉంటూ..తెలుగు రాష్ట్రానికి వచ్చిన సమయంలో చంద్రబాబు లాంటి సీనియర్ కలవకపోవటమే ఈ చర్చకు కారణమైంది. రాజకీయాలకు సంబంధం లేదు. గౌరవ మర్యాదలతో గుర్తించాల్సిన స్థాయిలో ఉన్న తెలుగు వ్యక్తి సొంత ప్రాంతానికి వస్తే ... మన రాజకీయ నేతల నుండి స్పందన ఏరకంగా వ్యక్తం అయిందనేదే ఇప్పుడు అన్ని వర్గాల్లోనూ చర్చకు కారణమవుతోంది.

  English summary
  There is a lot of speculation going on in political circles as why chandrababu did not meet CJI Ramana
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X