• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పవన్ కళ్యాణ్ ఎక్కడ?... బడ్జెట్లో... ఇంత జరిగితే ఏం మాట్లాడరేంటి?... ప్రశ్నించరేంటి?

|

కేంద్రంలో ఎన్డిఎ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిన సంగతి తెలిసిందే. తాను ప్రశ్నించటానికే పార్టీ పెట్టానంటూ జనసేన గురించి చెప్పేపవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ సమయంలో ఎక్కడా కనిపించకపోవడం పై సోషల్ మీడియాలో సెటైర్లు మీద సెటైర్లు పడుతున్నాయి.

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నారు?...అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని, పార్టీ పెట్టానని చెప్పే పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఎన్ డిఎ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు అన్యాయంపై ఇంత కలకలం చెలరేగుతుంటే జనసేన అధినేత కనీసం స్పందించకపోవడం ఏంటి?... ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఇంతరగడ జరుగుతుంటే, పార్టీలకు అతీతంగా అందరూ బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై మండిపడుతుంటే...ఇటీవలే రాజకీయ యాత్రలు కూడా చేసొచ్చి...ఇకపై యాక్టివ్ అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ రోజుల వ్యవధిలోనే ఇంత పెద్ద విషయంపై ఇలా సైలెంట్ గా ఉండిపోవడం ఏంటి?...ఇలా..ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఈ ప్రశ్నలన్నీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి...

 పవన్ కళ్యాణ్ ఎక్కడ...ఇప్పుడు కూడా ప్రశ్నించడా?

పవన్ కళ్యాణ్ ఎక్కడ...ఇప్పుడు కూడా ప్రశ్నించడా?

అసలు తాను వచ్చింది...పార్టీ పెట్టింది...అన్యాయాలను ప్రశ్నించడానికే అని ఊదరగొట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్...తాజా మౌనంపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. ఇప్పుడు...ఇలాంటి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం...పవన్ వైఖరిని, స్వభావాన్ని తేటతెల్లం చేస్తోందని...ఇకనైనా అతని నిజ స్వరూపం తెలుసుకోండంటూ అప్పుడే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా కామెంట్లు...కథనాలు వెల్లువెత్తుతున్నాయి.

పవన్...ఇమేజ్...డామేజ్...

పవన్...ఇమేజ్...డామేజ్...

అయితే బడ్జెట్ లో అన్యాయం పట్ల అందరి మనో భావాలు ఒకే తీరుగా ఉండటంతో ఈ విషయంలో పవన్ వెంటనే స్పందించకుంటే ఇమేజ్ చాలా డామేజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది...కేంద్ర బడ్జెట్లో ఎపికి జరిగిన అన్యాయంపై స్పందించాల్సిన బాధ్యత పవన్ కు ఉందని, కారణం గతంలో టిడిపి, బిజెపి పొత్తును ముందుండి బలపర్చి ప్రచారం చేసిన విషయం ఎవరూ మర్చాపోలేదని అంటున్నారు...అలాంటాప్పుడు రాష్ట్రానికి ఇంత కీలకమైన తరుణంలో ఇంతగా అన్యాయం జరిగితే ఎందుకు ప్రశ్నించడం లేదో...అందుకు ప్రజలకు జవాబు చెప్పాలని సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.

 రగిలిపోతున్న రాష్ట్రం...అతడొక్కడే...

రగిలిపోతున్న రాష్ట్రం...అతడొక్కడే...

గురువారం బడ్జెట్ ప్రవేశపెట్టిన దగ్గర నుండి ఒక్క బిజెపి మినహా టిడిపి, వైసిపితో పాటు ఎపిలో పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ, ప్రజా పక్షాలు మండిపోతున్నాయి. వైసిపి, వామపక్షాలు అయితే రాష్ట్రంలోని పలుచోట్ల ప్రత్యక్ష ఆందోళనలకు సైతం దిగాయి. టిడిపి మంత్రులు, ఎంపిలు, నేతలు కూడా చంద్రబాబునాయుడుపై పొత్తులు వద్దంటూ తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటువంటి పరిస్ధితుల్లో స్పందించని అతి ముఖ్యమైన...ఏకైక వ్యక్తి...పవన్ కళ్యాణ్ మాత్రమే.

 కారణం...భవిష్యత్తు...పొత్తుల గురించా?

కారణం...భవిష్యత్తు...పొత్తుల గురించా?

ఒకవేళ మళ్లీ రేపటి ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకోవాల్సి ఉంటుందని ఆలోచించి పవన్ కళ్యాణ్ సైలెంట్ అయ్యారా? లేక బడ్జెట్లో అసలు ఎపికి అన్యాయం జరిగినట్లు భావించడం లేదా? లేక అసలు బడ్జెట్ విడుదల విషయం ఇంకా తెలియలేదా?...లేదు అసలు ఇవన్నీ కాదు...నాకు కేంద్ర బడ్జెట్ మీద స్పందించేంత అవగాహన లేదు అని అంటారా?...ఇలా ఏ కారణంతో ఆయన స్పందించడం లేదో ప్రజలకు జవాబు చెప్పాలని నెటిజన్లు వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. ఒకవేళ బడ్జెట్ విడుదల విషయం తెలియకపోతే తరువాత వచ్చాక అయినా అదే విషయం అంగీకరించమని ఎద్దేవా చేస్తున్నారు...ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్లో కేంద్రం ఏపికి ఇంత అన్యాయం చేసిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడక సరికాదని...ఇలాగైతే...వచ్చే ఎన్నికల్లో ప్రజలెవరూ జనసేనను నమ్మరని అటు నెటిజన్లే కాదు ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Power Star Pawan Kalyan attracted fans and all people entering politics launching his Janasena promising to questioning. But, Pawan surprisingly went into silent mode in many major issues. In the same way he remained silent on central government budget allocations to Telugu states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X