వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూ. ఎన్టీఆర్ ఎందుకు రాలేదు?: బాబుతో విభేదాలే కారణమా!, లేక..

నందమూరి ఫ్యామిలీ ఏ కార్యక్రమానికైనా హాజరవుతున్నారంటే.. జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారా? లేదా? అభిమానులు ఆరా తీస్తుంటారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: చాలాకాలంగా టీడీపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న నందమూరి హరికృష్ణ ఆదివారం నాడు అమరావతిలో జరిగిన మంత్రుల ప్రమాణస్వీకారోత్సవానికి హాజరవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. దాదాపుగా టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన పార్టీకి దూరంగానే ఉంటూ వస్తున్నారు.

మంత్రుల ప్రమాణస్వీకారోత్సవానికి తనయుడు కళ్యాణ్ రామ్ తో కలిసి వచ్చారు హరికృష్ణ. మరోవైపు ఎమ్మెల్యే బాలకృష్ణ, సీఎం చంద్రబాబు తమ్ముడి కుమారుడు నారా రోహిత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో నందమూరి-నారా కుటుంబాలు చాలా కాలం తర్వాత మళ్లీ పక్కపక్కన కనిపించినట్లయింది.

why junior ntr not attends to the program of lokesh oath as minister

ఇన్నాళ్లు పార్టీకి దూరంగా ఉన్న హరికృష్ణ తిరిగి పార్టీకి దగ్గరవుతున్నారా? అన్న సంకేతాలు వెలువడ్డాయి. ఇదిలా ఉంటే, ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ఒక్కరే హాజరుకాకపోవడం గమనార్హం. చంద్రబాబుతో ఉన్న విభేదాల కారణంగానే ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి కొందరు అభిప్రాయపడుతుంటే.. సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటం వల్లే హాజరై ఉండకపోవచ్చునని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

కాగా, సహజంగానే నందమూరి ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్ కు ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో నందమూరి ఫ్యామిలీ ఏ కార్యక్రమానికైనా హాజరవుతున్నారంటే.. జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారా? లేదా? అభిమానులు ఆరా తీస్తుంటారు. నిన్నటి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఎన్టీఆర్ వస్తారని ఆయన అభిమానులు కూడా ఎదురుచూశారు. చివరకు ఆయన రావట్లేదని తెలియడంతో కొంత నిరాశకు గురయ్యారు.

English summary
Its an interesting discussion in TDP political circle that why junior Ntr was not attended to the program of ministers oath , other side his father and brother was attended to the program
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X