విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ లీకేజీ: లాక్‌డౌన్ సమయంలో ఎలా తెరిచారు, పొల్యూషన్ బోర్డు ఏం చేస్తోంది: సీపీఐ నారాయణ..

|
Google Oneindia TeluguNews

విశాఖలో విషవాయువు లీకేజీ వ్యవహారంపై ప్రతిపక్షాలు స్పందించాయి. ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో స్టెరిన్ గ్యాస్ లీకవడంతో పది మంది చనిపోయిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం జరిగిన ఘటనతో సాగరతీరం ఉలికిపాటునకు గురైంది. ప్రమాదంపై సీపీఐ నేత నారాయణ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి ఏపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పారు. కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోందని చెప్పారు. ఈ సమయంలో కంపెనీ తెరిచేందుకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు.

9.50 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు, 33 సెంటర్లలో స్పాట్ వాల్యూయేషన్: మంత్రి సబిత9.50 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు, 33 సెంటర్లలో స్పాట్ వాల్యూయేషన్: మంత్రి సబిత

ఫ్యాక్టరీ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని నారాయణ మండిపడ్డారు. ఉద్యోగులు, ప్రజల జీవితాలతో చెలగాటం ఆడేలా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదన్నారు. ఇంత జరుగుతోన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తుందని ప్రశ్నించారు. పొల్యూషన్ డిపార్ట్‌మెంట్‌పై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.

why open lg polymers company in lockdown time: cpi narayana

ప్రమాదంలో చనిపోయిన పది మంది మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ.కోటి పరిహారం ప్రకటించింది. ఘటనపై విచారణ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం కమిటీని కూడా నియమించింది. కమిటీ నివేదిక ఆధారంగా సంస్థపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కంపెనీ తప్పు చేసినట్లైతే చర్యలు తప్పవని ఏపీ పరిశ్రమల శాఖమంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కూడా స్పస్టంచేసిన సంగతి తెలిసిందే.

English summary
why lg polymers company open in lockdown time cpi narayana ask andhra pradesh government
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X