వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కల్యాణ్ సినిమాల్లో నటిస్తోంది ఇందుకేనా..? జేసీకి బుద్ధి పెరగలే..?: మంత్రి కొడాలి నాని

|
Google Oneindia TeluguNews

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కూడా వదల్లేదు మంత్రి కొడాలి నాని. ఏపీని బ్రహ్మాండంగా పరిపాలిస్తే సినిమాల్లో నటిస్తానని చెప్పిన పవన్.. అందుకే యాక్ట్ చేస్తున్నారా అని అడిగారు. రాష్ట్రానికి సంబంధించిన నిధులపై బీజేపీని అడగాలని సూచించారు. బీజేపీతో కలిసి పనిచేస్తున్న మీరు.. సీఎం జగన్‌ను మాత్రం విమర్శించొద్దని సూచించారు.

బుద్ది పెరగలే...?

బుద్ది పెరగలే...?

జేసీ దివాకర్ రెడ్డికి వయసు పెరిగింది కానీ బుద్ది పెరగలేదన్నారు. 40 ఏళ్ల నుంచి ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికి భజన కొట్టడం అలవాటైపోయిందని చెప్పారు. 500 ఎకరాల సున్నపురాయి క్వారీ కోసం చంద్రబాబు బూట్లు నాకారని విమర్శించారు. బస్సులకు పర్మిట్లు కట్టకుండా, పన్ను కట్టకుండా తిప్పుతున్న ఘనుడు జేసీ అని మండిపడ్డారు.

జేసీ కాదా...?

జేసీ కాదా...?

బస్సు ప్రమాదంలో 50 మందిని బలి తీసుకుంది కూడా జేసీ అని ఫైరయ్యారు. జగన్‌ను వైరస్ అంటున్నారు. అవును జగన్ దుర్మార్గులు, దుష్టులకు వైరస్ అని చెప్పారు. జగన్ విమర్శించే స్థాయి జేసీకి లేదన్నారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని సూచించారు.

5 వేల కోట్లు లూటీ..

5 వేల కోట్లు లూటీ..

కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్నట్టు.. చంద్రబాబు రోజుకో సమస్యతో ముందుకొస్తున్నారని మంత్రి కొడాలి నాని చెప్పారు. ఇసుక విధానం అని మొదలుపెట్టారని తెలియజేశారు. కొత్త ఇసుకవిధానంతో ప్రభుత్వానికి ఏడాదికి వెయ్యి కోట్ల ఆదాయం సమకూరుతుందని చెప్పారు. ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తోందని చెప్పారు. గత ప్రభుత్వంలో ఉచితంగా ఇసుక అని 5 వేల కోట్లు మెక్కారని గుర్తుచేశారు.

మైండ్ బ్లాంక్..

మైండ్ బ్లాంక్..


యనమల రామకృష్ణుడుకి మతి భ్రమించిందని మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే తుని నుంచి మూడుసార్లు ఓడిపోయారన్నారు. మండలిలో అతను ఏ విధంగా ప్రవర్తించారో ప్రజలు గమనించారని తెలియజేశారు. బీజేపీతో చెట్టపట్టాలేసుకొని తిరిగింది.. చంద్రబాబు నాయుడు, యనమల రామకృష్ణుడు తప్ప తాము కాదన్నారు.

సరికాదు

సరికాదు

బీజేపీతో చెట్టపట్టాలేసుకొనే తిరిగేది టీడీపీ నేతలేనని మంత్రి కొడాలి నాని స్పష్టంచేశారు. రాష్ట్ర ఇబ్బందులను పరిష్కరిస్తామని చెప్పే నేతలు... బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదన్నారు. కానీ చివరకు 23 మంది ఎంపీలు ఏం చేశారని తమపై విమర్శలు చేయడం సరికాదన్నారు.

English summary
why pawan kalyan acting movies minister kodali nani ask
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X