ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అడ్డంగా దొరికారు, ఎందుకు అలా మాట్లాడుతున్నారు?: పవన్‌పై చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఏలూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలా ఎందుకు మాట్లాడుతున్నారో తెలియడం లేదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్నారు. ఆయన ఏలూరులో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఆర్బీఐ బ్యాంకులు సహకరించకున్నా రుణమాఫీ చేశామన్నారు. ఒకేసారి రూ.50వేలు రుణమాఫీ చేసిన ఘనత టీడీపీదే అన్నారు.

Recommended Video

కేంద్రం, జగన్ నాటకాలంటూ చంద్రబాబు ఆగ్రహం

పక్కా ప్లాన్‌తో పర్యటన, దాడితో పవన్ భేటీ: జనసేనలోకి విశాఖ ఎంపీగా పోటీ చేసిన నేతపక్కా ప్లాన్‌తో పర్యటన, దాడితో పవన్ భేటీ: జనసేనలోకి విశాఖ ఎంపీగా పోటీ చేసిన నేత

దేశంలో 11శాతం వృద్ధిరేటు సాధించింది ఆంధ్రప్రదేశ్ మాత్రమే అన్నారు. అన్ని రంగాలకు సమానమైన ప్రాధాన్యమివ్వడం వల్ల ఆదాయం పెరిగిందన్నారు. రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు. నాలుగేళ్లలో రైతుల కోసం రూ.80 వేల కోట్ల బడ్జెట్‌ కేటాయించామన్నారు. కేంద్రం విధానాలతో రైతులు ఆదాయం పోగొట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు.

 పోలవరం కచ్చితంగా నిర్మించి తీరుతాం

పోలవరం కచ్చితంగా నిర్మించి తీరుతాం

శక్తి ఉన్నంత వరకు రైతు సంక్షేమం కోసం శ్రమిస్తూనే ఉంటానని చంద్రబాబు చెప్పారు. 2019 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టును కచ్చితంగా పూర్తి చేస్తామని చెప్పారు. ఇసుక ధరలను నియంత్రించామని, ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి పేద కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పారు.

పవన్ కళ్యాణ్ జతకలిశారు, ఎందుకు అలా మాట్లాడుతున్నారో

పవన్ కళ్యాణ్ జతకలిశారు, ఎందుకు అలా మాట్లాడుతున్నారో

ఏపీకి ప్రత్యేక హోదా కోసం టీడీపీ పోరాటం కొనసాగిస్తుందని చంద్రబాబు చెప్పారు. లేని టిటిడి నగలు, వజ్రాలు మాయమయ్యాయని ఆరోపిస్తున్నారని వైసీపీ, బీజేపీ, జనసేన, రమణదీక్షితులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీజేపీ, వైసీపీతో కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అడుగుతున్నారని వాపోయారు. జనసేన అధినేత అలా ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదన్నారు.

జగన్ దొంగ లెక్కలు చూపి అడ్డంగా దొరికాడు

జగన్ దొంగ లెక్కలు చూపి అడ్డంగా దొరికాడు

కడప ఉక్కు ఫ్యాక్టరీకి మీరు నిధులు ఇవ్వాల్సిన పని లేదని కేంద్రాన్ని ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాకు సమానంగా పదేళ్లు రాయితీలు ఇస్తే చాలన్నారు. అలా చేస్తే స్టీల్ ప్లాంట్ తామే నిర్మించుకుంటామని చెప్పారు. అనుభవం లేని జగన్ దొంగలెక్కలు చూపి అడ్డంగా దొరికిపోయారని విమర్శించారు.

టీడీపీ పేదల పార్టీ

టీడీపీ పేదల పార్టీ

కేంద్రం సహకరించకున్నా రైతులను ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది పోలవరం నుంచి గ్రావిటీ ద్వారా నీరు ఇస్తామని చెప్పారు. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా భూగర్భ జలాలు పెంచామన్నారు. టీడీపీకి వెనుకబడినవర్గాలే వెన్నెముక అన్నారు. టీడీపీ రైతుల పార్టీ, పేదల పార్టీ, ఎన్టీఆర్‌ పెట్టిన పార్టీ అన్నారు.

English summary
Andhra Pradesh cheif Minister Nara Chandrababu Naidu on Tuesday said that why Jana Sena chief Pawan Kalyan is talking like this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X