అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పయ్యావుల వర్సెస్ బుగ్గన: సీఆర్డీఏ పరిధిలో భూమి కొనుగోలుపై మాటల యుద్ధం, విచారణకు సిద్ధం

|
Google Oneindia TeluguNews

మూడు రాజధానుల బిల్లుపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వాడీ వేడీ చర్చ జరిగింది. రాజధాని ప్రాంతం ఇక్కడే వస్తోందని తెలుసుకొని టీడీపీ ముఖ్య నేతలు భూములు కొనుగోలు చేశారనే అంశంపై ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. పయ్యావుల విక్రమ సింహ పేరుతో పయ్యావుల కేశవ్ 4 ఎకరాల భూమి కొనుగోలుపై ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వర్సెస్ కేశవ్ మధ్య హాట్ హాట్ డిస్కషన్ జరిగింది.

సీఆర్డీఏ కంటే ముందు..

సీఆర్డీఏ కంటే ముందు..

అమరావతి రాజధానికి సంబంధించి సీఆర్డీఏ చట్టం అమల్లోకి రాకముందే పయ్యావుల విక్రమసింహ భూములు కొనుగోలు చేశారని మంత్రి బుగ్గన సర్వే నంబర్లతో సహా సభలో వివరించారు. దీనిపై పయ్యావుల కేశవ్ మాత్రం మంత్రివర్గ సమావేశం తర్వాతే రాజధానిలో ఇల్లు కావాలని భూమి కొనుగోలు చేశానని చెప్పారు. దీనిపై పయ్యావుల వర్సెస్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మధ్య చర్చ జరిగింది. మధ్యలో మంత్రులు బొత్స సత్యనారాయణ, కొడాలి నాని కూడా కల్పించుకొని మాట్లాడారు.

పయ్యావుల పిట్టకథ...

పయ్యావుల పిట్టకథ...


బినామీ భూములంటే ప్రధాని నరేంద్ర మోడీ చట్టం తీసుకొచ్చారని ఆ ప్రకారం చర్యలు తీసుకోవాలని పయ్యావుల కేశవ్ ప్రభుత్వానికి సూచించారు. 800 తెల్లరేషన్ కార్డుదారులతో భూములు కొనుగోలు చేసిన అంశంపై ఎంక్వైరీ చేయాలని.. దాంతోపాటు విశాఖపట్టణంలో భూములు కొనుగోలు చేసే అంశంపై కూడా విచారించాలని పయ్యావుల కేశవ్ సూచించారు. అంతేకాదు ఈ సందర్భంగా ఒక పిట్ట కథ కూడా పయ్యావుల కేశవ్ చెప్పారు. ఓ కుక్క పిచ్చిదని చెప్పేందుకు.. పిచ్చిది, పిచ్చిది అని పదే పదే వల్లించినట్టు.. అమరావతిలో అక్రమాలు జరిగాయని చెప్పి అబద్దాన్ని నిజం చేసే ప్రయత్నం అని మండిపడ్ారు.

క్యాబినెట్ నిర్ణయం-సీఆర్డీఏ చట్టం

క్యాబినెట్ నిర్ణయం-సీఆర్డీఏ చట్టం

1-9-2014లో మంత్రివర్గం విజయవాడ సమీపంలో రాజధాని వస్తుందని చెబితే.. 12 అక్టోబర్ 2014లో తూళ్లురు మండల ఐనవోలులో సబ్ రిజిస్ట్రార్ 10960లో రెండుకరాల 13 సెంట్ల భూమి పయ్యావుల విక్రమసింహ పేరుతో కొనుగులు చేశారని ఆర్థికమంత్రి బుగ్గన చదివి వినిపించారు. సర్వే నంబర్ 48-3లో సర్వేనంబర్‌ 12020లో ఎకరాభూమిని కూడా విక్రమసంహ పేరుతో పయ్యావుల కేశవ్ కొనుగులు చేశారన్నారు.

ఇక్కడే ఎందుకు

ఇక్కడే ఎందుకు


విజయవాడ కాదని, గుంటూరు వద్దనుకొని, అనంతపురం నుంచి విజయవాడ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో భూమి కొనుక్కొవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఇదీ ముమ్మాటికీ ఇన్‌సైడర్ ట్రేడింగ్ అని మంత్రి బుగ్గన వాదించారు.

English summary
why payyavula keshav Buy land in amaravati before 31st dec 14 minister buggana rajendranath reddy ask
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X