• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మావోయిస్టులు ఇంకా లేఖ ఎందుకు విడుదల చేయలేదు?...ఆ లేఖ కోసం సర్వత్రా ఆసక్తి

|

విశాఖపట్నం:అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను కాల్చిచంపిన మావోయిస్టులు వారి హత్యలు ఎందుకు చేశారన్న కారణాలను నేటికీ వెల్లడించలేదు. ఇప్పుడు ఈ విషయమే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

గతంలో మావోయిస్టులు హత్యలు చేసినప్పుడల్లా రెండు మూడు రోజుల వ్యవధిలోనే ఆ హత్యకు కారణాలను వెల్లడిస్తూ లేఖ విడుదల చేసేవారు. ఇంకా చెప్పాలంటే

గతంలో ఏదైనా దాడికి పాల్పడే ముందే మావోయిస్టులు లేఖను సిద్ధం చేసేవారని సీనియర్ పోలీస్ అధికారులు చెబుతున్నారు. కానీ తాజా దాడి విషయంలో అందుకు భిన్నంగా జరగడం, రోజులు గడుస్తున్నా మావోయిస్టులు లేఖ విడుదల చేయకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

అన్నా వదిలేయండి, కాల్పులు జరపొద్దు: హత్యకు ముందు మావోయిస్టులతో కిడారి

అరకు ఎమ్మల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్యెల్యే సోమ హత్యల అనంతరం మావోయిస్టులు ఎప్పటిలాగానే లేఖ విడుదల చేస్తారని అందరూ భావించారు. అందుకు భిన్నంగా రోజులు గడుస్తున్నా మావోయిస్టుల నుంచి లేఖ విడుదల కాకపోవడం, ఎన్నడూ లేనివిధంగా లేఖ నేడొస్తుంది...రేపొస్తుంది అనుకుంటూ అందరూ నిరీక్షిస్తున్నా...ఘటన జరిగి 6 రోజులు అవుతున్నా నేటికి మావోయిస్టులు లేఖ విడుదల చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

Why the Maoists havent released the letter till now?...Allover debate in Telugu states

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, అనుచరులు తమ అభిమాన నేతలు...అందునా గిరిజన నేతలైన వీరిని మావోయిస్టులు హత్య చేయడానికి కారణం ఏమిటో తెలుసుకోవాలని లేఖ కోసం నిరీక్షిస్తుండగా...మరోవైపు మావోయిస్టులు విడుదల చేసే ఈ లేఖ ద్వారా వారికి సంబంధించిన మరి కొంత అదనపు సమాచారం పొందవచ్చని ఆ లేఖ కోసం ఎదురుచూస్తున్నారు.

మావోయిస్టులు లేఖ విడుదల చేయకపోవడాన్ని బట్టి వారికి అసలు లేఖ విడుదల చేసే ఉద్దేశం ఉందా? లేదా?...గతంలో ఘటన జరిగిన వెంటనే లేఖ విడుదల చేసే ఆ పద్దతికి మావోయిస్టులు స్వస్థి చెప్పారా?...అంటే వారి హత్యలకు జవాబివ్వాల్సిన అవసరం లేదని వారు భావిస్తున్నారేమోననే అభిప్రాయం కొందరు వ్యక్తీకరిస్తున్నారు. మరికొందరేమో తాము ఏ కారణంతో ఎమ్మెల్యే,మాజీ ఎమ్మెల్యేలను హతమార్చామో వాటికి సంబంధించిన వివరాలు పక్కా ఆధారాలతో ఇచ్చేందుకు లేఖ ఆలస్యం చేస్తుండొచ్చని అంటున్నారు.

మరోవైపు రోజులు గడుస్తున్నా మావోయిస్టులు లేఖ విడుదల చేయకపోవడంపై అధికార పార్టీ నేతల విశ్లేషణ ఇలా ఉంది. ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమ అక్రమాల గురించి తెలిసిన మావోయిస్టులు దాడి సందర్భంగా వారితో చర్చించి వాటిని నిర్థారించుకొని ఉంటారని...ఈ కారణాలతో తాము వారిని హతమార్చామని చెప్పేందుకు వారు చెప్పిన విషయాలకు సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో ఉండి ఉంటారని అభిప్రాయపడుతున్నారు.

ప్రజాదరణ కలిగిన గిరిజన నేతలను హతమార్చినందుకు తాము సరైన జవాబు చెప్పాల్సి ఉంటుందనే కారణంతో ఆయా నేతల ప్రతికూల విషయాలకు సంబంధించి సమగ్ర వివరాలు,ఆధారాలు సేకరిస్తూ ఉండొచ్చని, అందుకే లేఖ విడుదల ఆలస్యం అయిఉండొచ్చని అంటున్నారు. అయితే రోజులు గడిచినా మావోయిస్టులు ఈ దాడిపై లేఖ ను తప్పనిసరిగా విడుదల చేస్తారనే అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అవుతుండటం గమనార్హం.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Araku MLA Kidari Sarveswar Rao, former MLA Siveri Soma who shot dead by Maoists, But the Maoists did not release the letter with behind the reasons why they killed those leaders. Now this is the issue of allover debate in Telugu states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more