వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ ఘటనపై జగ్గారెడ్డి, కిరణ్ మంచోడని నారాయణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jagga Reddy
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతానికి చెందిన మహిళా మంత్రులకు ఎపి భవన్ వద్ద అవమానం జరిగిందని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు అనడం విడ్డూరమని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మౌన దీక్ష సమయంలో జరిగిన ఆ సంఘటన అనుకోకుండా జరిగిందేనని సంగారెడ్డి శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) అన్నారు.

ఈ ఘటన పైన తెలంగాణ మంత్రులకు సానుభూతి తెలిపే నైతిక హక్కు హరీష్ రావుకు, తెరాసకు లేదన్నారు. గతంలో మంత్రి గీతా రెడ్డి నివాసంలోకి చొచ్చుకెళ్లి ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి, అవమానపర్చినప్పుడు ఏమయిందని ప్రశ్నించారు.

తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ జహీరాబాదులో మాట్లాడుతూ... ఈశ్వరీబాయి కడుపును గీతా రెడ్డి చెడ పుట్టారన్నారు. వాటిని తెలంగాణవాదులు ఎవరు మర్చిపోలేదన్నారు.

ఢిల్లీ ఘటన ముఖ్యమంత్రి కారణంగా జరిగింది కాదని వివరణ ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటు కావడం తెరాస నేతలకు ఇష్టం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ పార్టీ నాయకులు కనుమరుగు కావడం ఖాయమన్నారు.

ప్రస్తుత నేతలలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంచివాడుగా గుర్తింపు పొందారని, మైనింగ్ మాఫియా కన్నా మెరుగైన సేవలందించగల వ్యక్తి అని, ఈ తరుణంలో పారిపోవడం రాజకీయ లక్షణం కాదని, సిఎం రాజీనామా యోచన విరమించుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. అసలు రాజీనామా అవసరమేంటన్నది తన ప్రశ్న అని, రాష్ట్ర పరువు ఢిల్లీ వీధులలో అత్యాచారానికి గురైందని విభజనపై జాప్యం రెండు ప్రాంతాలమధ్య వైషమ్యాలను పెంచేదిగా ఉందని, కేంద్రానికి ఆంద్రులు పిచ్చివాళ్లలా కనిపిస్తున్నారా అని మండిపడ్డారు.

English summary

 Why was Siddipet MLA Harish rao silent when Geeta Reddy was insulted, questioned Jagga Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X