వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొద్దు శీనులా, జగన్‌కే కాదు.. డబ్బిస్తే టిడిపికీ: రవికిరణ్‌ని బెదిరించారా?

తాము తలుచుకుంటే ఏదైనా చేస్తామని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిస్తామని, జైల్లో వేస్తామని, ఎక్కువ రోజులు జైల్లో ఉండేలా చేస్తామని, అక్కడ నీ పక్కన ఉండే ఖేదీ ఏమైనా చేయవచ్చునని, మొద్దు శీనులా ఏదైనా..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తాము తలుచుకుంటే ఏదైనా చేస్తామని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిస్తామని, జైల్లో వేస్తామని, ఎక్కువ రోజులు జైల్లో ఉండేలా చేస్తామని, అక్కడ నీ పక్కన ఉండే ఖేదీ ఏమైనా చేయవచ్చునని, మొద్దు శీనులా ఏదైనా జరగవచ్చునని, అప్పుడు తమకు ఏమీ సంబంధం ఉండదని గుంటూరు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు పొలిటికల్ పంచ్ ఫేస్‌బుక్ పేజీ అడ్మిన్ రవికిరణ్‌ను బెదిరించారని తెలుస్తోందని సాక్షి మీడియాలో వచ్చింది.

పొలిటికల్ పంచ్ ఇలాగే: బాబుకు రవికిరణ్ షాక్, జగన్ సహా జైలుకెళ్తారని వార్నింగ్పొలిటికల్ పంచ్ ఇలాగే: బాబుకు రవికిరణ్ షాక్, జగన్ సహా జైలుకెళ్తారని వార్నింగ్

శుక్రవారం తెల్లవారుజాము నుంచి శనివారం ఉదయం వరకు వరకు వివిధ రకాలుగా వేధించి, బెదిరించి, తాను వైసిపి కోసం పని చేస్తున్నానని ఒప్పించేందుకు పోలీసులు ప్రయత్నం చేశారని రవికిరణ్‌ శనివారం సాక్షికి వివరించారని అందులో పేర్కొంది. దాని ప్రకారం....

శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటలకు పోలీసులు తమ ఇంటికి వచ్చారని, తనపై ఓ కేసు ఉందని, గుంటూరు రావాలని తనను తీసుకెళ్లారని, కేసు ఏమిటని పోలీసులను అడిగినా సమాధానం చెప్పలేదని, ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో మందడం పోలీసు స్టేషన్‌లో ఉంచారని, అక్కడ తన పేరు, ఇతర వివరాలు అడిగారని రవికిరణ్ చెప్పాడని పేర్కొంది.

కేసు ఏమిటని మళ్లీ అడిగా.. లోకేష్ మీద సెటైర్ మాత్రమే..

కేసు ఏమిటని మళ్లీ అడిగా.. లోకేష్ మీద సెటైర్ మాత్రమే..

అప్పుడు మరోసారి తనపై కేసు ఏమిటని అడిగానని, శాసనసభను కించపరుస్తూ పోస్టు పెట్టావని, దానిపై తమకు ఫిర్యాదు ఇచ్చారని చెప్పారని రవికిరణ్ చెప్పారని పేర్కొంది. పోస్టింగుపై పోలీసులకు వివరణ ఇచ్చానని, శాసనసభ, మండలిని అవమానించడం తన ఉద్దేశం కాదని వివరించానని, పెద్దల సభ అంటే.. పెద్దల సినిమాగా భావించడం వల్లే లోకేష్‌ అందులో కూర్చుంటానని అడుగుతున్నాడన్న భావనతోనే పోస్టింగ్‌ పెట్టానని వివరణ ఇచ్చానని, లోకేష్‌ మీద అది సెటైర్‌ మాత్రమే గాని, చట్టసభను అవమానపరచడం కాదని చెప్పానని రవికిరణ్ చెప్పారని పేర్కొంది.

రెండు నెలల కింది మాట

రెండు నెలల కింది మాట

ఈ పోస్టింగ్‌ తగదని కామెంట్లు వచ్చాయని, వెంటనే ఆ పోస్టింగ్‌ తొలగించానని చెప్పానని రవికిరణ్ తెలిపారు. ఇది జరిగి కూడా రెండు నెలలు అయిందని, ఆ తర్వాత ఎవరో వస్తున్నారని పేర్కొంటూ తనను భవనంలోని రెండవ అంతస్తుకు తీసుకెళ్లి కూర్చోబెట్టారని రవికిరణ్ చెప్పారని తెలిపింది.

 వాహనాలు మార్చి మార్చి...

వాహనాలు మార్చి మార్చి...

మధ్యాహ్నం మూడు గంటల సమయంలో స్టేషన్‌ వెనుక వైపు నుంచి తనను తీసుకెళ్లి ఆటోలో కూర్చొబెట్టి అర కిలోమీటర్‌ దూరం తీసుకు వెళ్లాక, అక్కడ మారుతీ స్విఫ్ట్‌ కారులోకి మార్చారని, అక్కడి నుంచి ఓ నాలుగు కి.మీ. ప్రయాణం చేశాక, బ్లాక్‌ స్కార్పియో వాహనంలోకి తనను మార్చి ముఖ్యమంత్రి నివాస ప్రాంతం కరకట్ట చుట్టూ సుమారు నాలుగు గంటల పాటు తిప్పారని రవికిరణ్ పేర్కొన్నారని పేర్కొంది.

జగన్ కోసం పని చేస్తున్నావా అని..

జగన్ కోసం పని చేస్తున్నావా అని..

ఆ తర్వాత సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో హైదరాబాద్‌ వెళ్తున్నామని చెప్పారని, కొంత దూరం వెళ్లాక ఓ ఆయిల్‌ కంపెనీ గెస్ట్‌హౌస్‌కు తీసుకు వెళ్లారని, అక్కడికి పోలీసు ఉన్నతాధికారులు వచ్చారని, మళ్లీ తన వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారని, వైసిపి డబ్బులిస్తే నీవు పొలిటికల్‌ పంచ్‌‍‌ను నిర్వహిస్తున్నావు కదా, జగన్‌ కోసం పని చేస్తున్నావు కదా? అంటూ తనను పలు విధాలుగా ప్రశ్నించారని రవికిరణ్ చెప్పినట్లుగా పేర్కొంది.

టిడిపి డబ్బులిచ్చినా డిజైనింగ్ చేసి పెడతానని చెప్పా

టిడిపి డబ్బులిచ్చినా డిజైనింగ్ చేసి పెడతానని చెప్పా

నిర్వహిస్తున్నానని, తాను వృత్తిపరంగా వెబ్‌ డిజైనర్‌ని అని, కాబట్టి డిజైన్స్‌ అవసరమైతే డబ్బులు తీసుకొని చేసి ఇస్తానని, వైసిపికి కూడా వెబ్‌ డిజైనింగ్‌ చేసి ఇచ్చానని, టిడిపి డబ్బులు ఇస్తే వారికి కూడా డిజైనింగ్‌ చేసి పెడతానని, పొలిటికల్‌ పంచ్‌‌ను మాత్రం ఫ్రీలాన్సర్‌‌గా నిర్వహిస్తున్నట్లు చెప్పానని రవికిరణ్ తెలిపాడని పేర్కొంది.

English summary
Why Was 'Political Punch' Ravi Kiran Let Off?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X