• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్ లండన్ ఎందుకెళ్లారంటే ? బుగ్గన క్లారిటీ- కుటుంబంతోనే దావోస్ పయనం

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం వైఎస్ జగన్ దావోస్ పర్యటన వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ దీనిపై క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా దావోస్ లో దిగాల్సిన ముఖ్యమంత్రి విమానం లండన్ ఎయిర్ పోర్టుకు ఎందుకు వెళ్లింది. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన జగన్ విమానం.. మధ్యలో ఎక్కడెక్కడ ఆగింది ? సీఎం జగన్ తో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతి అధికారిక టూర్ కు ఎందుకెళ్లారు ? వంటి అంశాలపై ఆర్ధికమంత్రి బుగ్గన క్లారిటీ ఇచ్చారు.

జగన్ దావోస్ టూర్ వివాదం

జగన్ దావోస్ టూర్ వివాదం

సీఎం జగన్ దావోస్ పర్యటనలో భాగంగా రేపటి నుంచి ఈ నెల 26వరకూ ప్రపంచ ఆర్దిక వేదిక సదస్సులో పాల్గొంటారు. ఏఫీకి పెట్టుబడుల్ని ఆకర్షించే లక్ష్యంతో జగన్ ఈ టూర్ వెళ్లారు. అయితే గన్నవరం ఎయిర్ పోర్టులో బయలుదేరిన ఆయన విమానం నేరుగా లండన్ విమానాశ్రయంలో ల్యాండ్ అయినట్లు వార్తలొచ్చాయి. దీంతో సీబీఐ కోర్టు నుంచి దావోస్ టూర్ కోసం అనుమతి తీసుకున్న జగన్ లండన్ ఎలా వెళ్తారని, అసలు జగన్ అధికారిక పర్యటనలో లండన్ లేనే లేదంటూ విపక్ష టీడీపీ ఆరోపణలు మొదలుపెట్టింది. దీనిపై ఆర్ధికమంత్రి బుగ్గన స్పందించారు.

టీడీపీపై బుగ్గన ఫైర్

టీడీపీపై బుగ్గన ఫైర్

సీఎం జగన్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం టీడీపికి, ఎల్లోమీడియాకు ఒక అలవాటుగా మారిందని ఆర్ధికమంత్రి బుగ్గన ఆరోపించారు. రోజురోజుకూ వారిలో అనాగరికత పెట్రేగిపోతోందని, కనీస విలువలను పాటించాలన్న స్పృహకోల్పోయి ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. వీరినుంచి ముఖ్యమంత్రి కుటుంబానికే కాదు, రాష్ట్రానికీ ముప్పు మరింత పెరిగిందన్నారు. ముఖ్యమంత్రి దావోస్‌ పర్యటనమీద యనమల చేసిన ఆరోపణలు నిస్సిగ్గుగా ఉన్నాయని బుగ్గన ఆక్షేపించారు. వయసు మీద పడుతున్న కొద్దీ.. యనమల కనీస సంస్కారంకూడా లేకుండా రోజురోజుకూడా దిగజారిపోతున్నారని ఆరోపించారు.

 జగన్ టూర్ రహస్యమేం కాదు

జగన్ టూర్ రహస్యమేం కాదు

గత ప్రభుత్వంలో సుదీర్ఘకాలం మంత్రులుగా పనిచేసిన వారికి కూడా విమానప్రయాణాల్లో అంతర్జాతీయ నియమాలు, నిబంధనలు తదితర అంశాలమీద అవగాహన లేకపోవడం, దీనిమీద పనిగట్టుకుని ముఖ్యమంత్రి మీద, ఆయన కుటుంబం మీద విషప్రచారం చేయడం యనమల లాంటి వారు, ఎల్లోమీడియా ఏ స్థాయికి దిగజారిపోయారో అర్థం అవుతుందని బుగ్గన విమర్శించారు. దాపరికంతో, దొంగదారుల్లో అధికారం సాధించడం, ప్రజలన్ని వంచించడం అన్నది టీడీపీ ట్రేడ్‌ మార్క్‌ తప్ప తమది కాదన్నారు. ముఖ్యమంత్రి పర్యటన రహస్యమేమీ కాదని, కుటుంబ సభ్యులతో కలిసి దావోస్‌ చేరుకుంటారన్న దాంట్లో ఎలాంటి రహస్యం లేదని బుగ్గన తెలిపారు.

జగన్ లండన్ ఎందుకెళ్లారంటే?

జగన్ లండన్ ఎందుకెళ్లారంటే?

నిన్న గన్నవరం విమానాశ్రయంలో బయల్దేరిన తర్వాత సీఎం విమానం ఇంధనం నింపుకోవడం కోసం ఇస్తాంబుల్‌లో ఆగిందని, ఎయిర్‌ట్రాఫిక్‌ విపరీతంగా ఉండడం వల్ల అక్కడ ఇంధనం నింపుకునే ప్రక్రియలో ఆలస్యం జరిగిందని బుగ్గన తెలిపారు. దీనివల్ల లండన్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నప్పుడు మరింత ఆలస్యం అయ్యిందన్నారు.

లండన్‌లో కూడా ఎయిర్‌ ట్రాఫిక్‌ విపరీతంగా ఉందని, ఈలోగా జురెక్‌లో ల్యాండ్‌ అవడానికి ప్రయాణ షెడ్యూల్‌ సమయం రాత్రి 10 గంటలు దాటిపోయిందని బుగ్గన వెల్లడించారు. మళ్లీ ల్యాండింగ్‌కోసం అధికారులు రిక్వెస్ట్‌పెట్టారని, ఈప్రక్రియలో స్విట్జర్లాండ్‌లోని భారత ఎంబసీ అధికారులు కూడా స్వయంగా పాల్గొన్నారని తెలిపారు.

రాత్రి 10 గంటల తర్వాత జురెక్‌లో విమానాలు ల్యాండింగ్‌ను చాలా సంవత్సరాలనుంచి నిషేధించిన విషయాన్ని స్విస్‌ అధికారులు భారత రాయబార కార్యాలయ అధికారులకు నివేదించారన్నారు. ఈ విషయాలన్నీకూడా స్విట్జర్లాండ్‌లోని భారత ఎంబసీ అధికారులు- లండన్‌లోని భారత దౌత్య అధికారులకు సమాచారం అందించారని బుగ్గన తెలిపారు. వారు నేరుగా ముఖ్యమంత్రితో కూడిన అధికారులతో చర్చించి.. లండన్‌లోనే ముఖ్యమంత్రిగారికి బస ఏర్పాటు చేశారన్నారు.

తెల్లవారుజామునే జురెక్‌ బయల్దేరేందుకు ముఖ్యమంత్రి బృందం సిద్ధంగా ఉన్నప్పటికీ, పైలట్లు నిన్న అంతా ప్రయాణంలో ఉన్నందున డీజీసీఏ నిబంధనల ప్రకారం పైలెట్లు నిర్ణీత గంటలు విశ్రాంతిని తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇవాళ జగన్ దావోస్ చేరుకుంటారన్నారు.

English summary
ap finance minister buggana rajendranath on today clarified on cm ys jagan's flight landing at london airport instead of davos.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X